E-Paper
Advertisement

సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన అబ్బాస్ రీ ఎంట్రీ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే?

సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన అబ్బాస్ రీ ఎంట్రీ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే?
Advertisement

Kollywood:ఇటీవల కాలంలో ఓటీటీ హవా భారీగా పెరిగిపోయింది. అందులో భాగంగానే థియేటర్లలోకి వచ్చిన ప్రతి సినిమా కూడా దాదాపు 4 లేదా 8 వారాలలోపే ఓటీటీలోకి వచ్చి సందడి చేస్తున్నాయి. అయితే ఓటీటీలోకి వచ్చే ప్రతి సినిమా కూడా ముందస్తుగానే ప్రకటన ఇస్తూ ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు హఠాత్తుగా ఓటీటీలోకి వచ్చేసి అభిమానులను సర్ప్రైజ్ చేస్తూ ఉంటాయి. అలాంటి చిత్రాలలో ప్రముఖ హీరో అబ్బాస్ (Abbas ) రీ ఎంట్రీలో వచ్చిన చిత్రం హ్యాపీ రాజ్. ఒకప్పుడు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ చిత్రాలలో నటించి.. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న అబ్బాస్.. ప్రేమదేశం సినిమాతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్నారు. అప్పట్లో కాలేజ్ యువత కలల రాకుమారుడిగా రోల్ మోడల్ గా నిలిచిన ఈయన అనూహ్యంగా 2015 తర్వాత ఇండస్ట్రీకి దూరం అయిపోయారు.

సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన హ్యాపీ రాజ్..

మళ్లీ 11 ఏళ్ల తర్వాత హ్యాపీ రాజ్ అనే తమిళ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు . ఇటీవల తమిళంలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై నెటిజన్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ హీరోగా, శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం థియేటర్లలో విడుదలై సక్సెస్ అందుకుంది. అలాంటి ఈ సినిమా తాజాగా థియేటర్ రన్ పూర్తిచేసుకుని సైలెంట్ గా ఓటీటీ లోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ , మలయాళం లో స్ట్రీమింగ్ అవుతోంది.

మస్ట్ వాచ్ అంటున్న నెటిజన్స్..

Advertisement

ఇకపోతే భారతదేశంలోని ప్రైమ్ వీడియోలో నెంబర్ వన్ సినిమాగా చార్టర్లలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మొత్తానికైతే తమిళ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది అని చెప్పవచ్చు.. సినిమా చూసిన నెటిజన్లు మస్ట్ వాచ్ అని కామెంట్లు పెడుతుంటే.. మరికొంతమంది ప్రతి కుమారుడు తన తండ్రితో కలిసి చూడాల్సిన సినిమా హ్యాపీ రాజ్ అంటూ పోస్ట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా కామెడీ తో పాటు హృదయాన్ని హత్తుకునే ఎమోషనల్ సన్నివేశాలతో ఈ సినిమా కన్నీళ్లు తెప్పిస్తోంది. మరి ఓటీటీలో ఎలాంటి వ్యూస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

ALSO READ:దృశ్యం3 రిలీజ్ డేట్ లాక్.. స్పెషల్ పోస్టర్ పంచుకున్న మీనా!

హ్యాపీ రాజ్ సినిమా స్టోరీ..

Advertisement

సినిమా స్టోరీ విషయానికి వస్తే హ్యాపీ రాజ్ (జీవి ప్రకాష్ కుమార్) ఒక మారుమూల గ్రామానికి చెందిన అబ్బాయి. అతని తండ్రి (జార్జ్ మరియన్) ఒక స్కూల్ టీచర్. అతని రూపం కారణంగా అందరూ గుర్రం గుడ్డు అంటూ ఆటపట్టిస్తూ ఉంటారు.. ఆ మాటలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకు వెళ్తుంటాడు. తనని ఏ అమ్మాయి ప్రేమించకపోవడానికి, పెళ్లి చేసుకోకపోవడానికి తన తండ్రియే కారణమని హ్యాపీ రాజ్ భావిస్తూ ఉంటాడు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే తన తండ్రి ఎవరనే విషయం తెలియని చోటుకు వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. అలా బెంగళూరు వెళ్ళిన హ్యాపీ రాజ్ అక్కడ ఒక సంస్థలో ఉద్యోగం సంపాదిస్తాడు. తన టాలెంట్ తో ఎదుగుతూ కావ్య (గౌరీ ప్రియ)ను ముగ్గులోకి దింపుతాడు.

కావ్య తండ్రి రాజీవ్ (అబ్బాస్) శ్రీమంతుడు. ఇక హ్యాపీ రాజ్ టాలెంట్ తెలుసుకున్న రాజీవ్ తన కూతుర్ని ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకుంటాడు. అతని పేరెంట్స్ ని పిలిపించమని, పెళ్లి గురించి మాట్లాడదామని అంటాడు. దానితో హ్యాపీ రాజ్ అయోమయంలో పడతాడు. తన తల్లిదండ్రులు పల్లెటూరికి చెందిన వాళ్ళు.. సిటీ కల్చర్ గురించి పెద్దగా తెలియని వాళ్లు.. ముఖ్యంగా తన తండ్రి రూపాన్ని చూసి రాజీవ్ వాళ్ళు ఏమనుకుంటారో అని ఆందోళన చెందుతాడు. తన తండ్రి వల్ల ఈ సంబంధం కూడా చెడిపోతుందని భావిస్తాడు . ఇక రాజీవ్ కావ్య మాట కాదనలేక ఊరి నుంచి వాళ్ళని రప్పిస్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది ? ఆ సంఘటనలో కథ ఎలాంటి మలుపు తీసుకుంది? పెళ్లి విషయంలో హ్యాపీ రాజ్ కావ్యాలకు ఎదురయ్యే సవాళ్లేంటి? ఇలా విషయాలను చాలా చక్కగా చూపించారు.

Related News

వీళ్ళకు చావులేదు… తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న హై-వోల్టేజ్ ఫాంటసీ యాక్షన్ సీక్వెల్

సముద్రం ఎడారిగా మారితే ? మనిషి మాంసం కోసం అగాధపు జీవుల అరాచకం… థ్రిల్లింగ్ సర్వైవల్ అడ్వెంచర్

ZEE5లో సెప్టెంబర్ సినిమాల జాతర… మైండ్ బ్లాక్ చేసే మల్టీ-లాంగ్వేజ్ మూవీస్ సిరీస్ల లిస్ట్

1300 కోట్ల థ్రిల్లర్ తెలుగులో… కేక పుట్టిస్తున్న మైండ్ బ్లాక్ క్రైమ్ కామెడీ

2600 కోట్ల కలెక్షన్లు… 7.9 IMDb రేటింగ్… తెలుగులో అందుబాటులో ఉన్న ఆల్ టైమ్ క్లాసిక్ మిస్టరీ థ్రిల్లర్

ఈ వారం ఓటీటీలో పండగే పండగ… తెలుగులో ఏకంగా 6 సూపర్ హిట్ సినిమాలు

ఫ్రెండ్స్‌తో చూస్తే పొట్టచేక్కలవ్వాల్సిందే… పిచ్చి పిచ్చి గొడవలతో నవ్వించే కామెడీ డ్రామా

ఎఫైర్ ను అడ్డం పెట్టుకుని ఇదేం పాడుపని ? ప్రతీ నిమిషం నెయిల్ బైటింగ్ సస్పెన్స్

Big Stories

Advertisement
×