E-Paper
Advertisement

నోరు అదుపులో పెట్టుకో కేటీఆర్.. మంత్రి పొన్నం మాస్ వార్నింగ్!

నోరు అదుపులో పెట్టుకో కేటీఆర్.. మంత్రి పొన్నం మాస్ వార్నింగ్!
Advertisement

Ponnam Prabhakar: స్వేచ్ఛ బ్యూరో: కాంగ్రెస్ అగ్ర నాయకుడైన రాహుల్ గాంధీని కేటీఆర్ ఇష్టం వచ్చిన తీరు మాట్లాడడం సరి కాదని, బేషరత్ గా రాహుల్ గాంధీకి కేటీఆర్ క్షమాపణ చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి సుదీర్ఘంగా మాట్లాడారు. ధాన్యం, మొక్కజొన్న కొనుగులు ప్రక్రియకు సంబంధించి సీఎం, చీఫ్ సెక్రటరీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని మంత్రి తెలిపారు. దేశంలో 21వేల కోట్ల రూపాయలతో రైతు రుణ మాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమన్నారు. అన్ని ఎన్నికల్లో ఓడిపోతూ నిరాశలో ఉండి, కుటుంబ కలహాలతో ఉన్న బిఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ రాహుల్ గాంధీని తిట్టడం సహేతుకం కాదన్నారు. అగ్ర నాయకుడైన రాహుల్ గాంధీని తిట్టడం దుర్మార్గం దురదృష్టకరమని తీవ్రంగా ఖండించారు.

గౌరవెల్లి ప్రాజెక్ట్ నిర్వాసితులపై..

రైతులకు సంబంధించి వరంగల్ లో మీటింగ్ పెట్టే హక్కు బిఆర్ఎస్ నాయకులకు ఉందని, కానీ పదేళ్లలో రైతును ఖైదీ చేసి, రైతులను కాల్చి, మల్లన్న సాగర్ నిర్వాసితులను లాఠీ చార్జ్ చేయించింది, గౌరవెల్లి ప్రాజెక్ట్ నిర్వాసితులైన మహిళల మీద అర్ధరాత్రి దాడి చేయించింది మీరు కాదా అని బిఆర్ఎస్ నాయకులను ప్రశ్నించారు. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వచ్చినప్పుడు కాలేశ్వరం ఏటీఎం ఫర్ కేసిఆర్ అని అనేకసార్లు అన్నారని, వారి ఆరోపణలతో కాలేశ్వరం అవినీతి పై ఘోష్ కమిషన్ వేస్తే సిబిఐకి అప్ప జెప్పకుండా బిజెపి నాయకులు కేసీఆర్ ను రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. కిషన్ రెడ్డిని, బండి సంజయ్ ని అడుగుతున్న ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అనే మాదిరిగా బిఆర్ఎస్ తో వ్యవహరిస్తున్నారు, కాలేశ్వరం అవినీతిపై నిజం నిగ్గు తేల్చి దోషిని శిక్షించాలి. 10 వ తేదీ ప్రధాన మంత్రి రాష్ట్రానికి రావడానికి స్వాగతిస్తున్నాం. ప్రధానమంత్రిని మొదలుకుంటే ప్రతి కేంద్ర మంత్రిని అనేకసార్లు కలిసాం, కానీ మాకు నిధులు ఇవ్వకుండా వివక్ష పూరితంగా వ్యవహరించారన్నారు.

Advertisement

Also Read: హైడ్రా పేదల కోసమేనా? నాదర్గుల్‌లో చెరువుల కబ్జాపై హైడ్రా ఎందుకు నిద్రపోతోంది?: హరీశ్ రావు

బంగారం దుకాణంలో..

1956 నుండి తెలంగాణ కోసం పోరాటం చేసి సాధించుకుంటే, పాకిస్థాన్ భారత దేశం వేరు చేసినట్లు తెలంగాణ ఏర్పాటు చేశారని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆనాడు 3 రాష్ట్రాలను ఇచ్చినప్పుడే తెలంగాణను బిజెపి ఇచ్చేదుండేనని, కానీ ఇవ్వకుండా బిజెపి తెలంగాణకు ద్రోహం చేసిందన్నారు. తెలంగాణ ఏర్పాటు గురించి బిజెపి నాయకులు అపహేలనగా మాట్లాడితే దానిని బిఆర్ఎస్ నాయకులు ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. బంగారం దుకాణంలో చోరీ అయితే మంత్రులు ఏం చేస్తున్నారని మూర్ఖత్వంగా మాట్లాడుతున్నారన్నారు. పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని, కచ్చితంగా పట్టుకుంటారన్నారు.ఈ మీడియా సమావేశంలో మాజీ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, మాజీ సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, ఏఎంసీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్ పర్సన్ చిత్తారి పద్మ రవీందర్, మున్సిపల్ కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రం ఆకస్మిక తనిఖీ…

Advertisement

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఏర్పడుతున్న సమస్యలపై పలువురు రైతులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే జిల్లా కలెక్టర్ హైమావతితో రైతుల సమస్యలపై ఫోన్ లో మాట్లాడిన మంత్రి, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు ధాన్యం కొనుగోలులో బారదన్, టార్ఫాలిన్ సమస్య రాకుండా చూసుకోవాలని, లారీలో ఎప్పటికప్పుడు వెంట వెంటనే లోడ్ పంపించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Also read: సర్కార్‌కు హై కోర్టు షాక్.. జీవో 597 భస్మం.. పీఏసీఏస్ పీఠాలపై మళ్లీ పాతోళ్లదే హవా!

Related News

టంగ్ స్లిప్ప‌వుతుందా? ఓట‌మిని ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారా? జ‌నాల‌ను కించ‌ప‌రిచేలా ఈ మాట‌లేలా?

ఆది నుంచి త‌ప్పట‌డుగులే.. వివాదాలే ఆమె దారి? ఇదీ కొండా సురేఖ వైఖరి!

ఇకపై అసమ్మతి గళాలకు బ్రేకులు… పరిపాలన పై రేవంత్ సర్కార్ మరింత పట్టు..

రేవంత్ నాయకత్వాన్ని బలపరిచేలా అధిష్టానం అడుగులు! ఢిల్లీ పెద్ద‌ల‌తో స‌త్సంబంధాల సంకేతాలు..!

మేమొచ్చినా.. వెంట‌నే హామీలు అమ‌లు చేయ‌లేం.. ! కుదురుకోవ‌డానికి ఐదారేళ్లు ప‌డుతుందేమో..? ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై కేటీఆర్ కామెంట్స్‌..

రాడు.. రానేరాడు.. వస్తే గిస్తే.. సీఎంగానే వ‌స్త‌డు.. ఏం చేసుకుంట‌రో చేసుకోండి..!

కేసీఆర్‌ది లీ క్వాన్ యూ స్థాయి.. సింగ‌పూర్ త‌ర‌హా అత్యున్న‌త మ‌ర్యాద‌ను ఇవ్వాల్సిందిపోయి….. కేటీఆర్ ఆస‌క్తిక‌ర కామెంట్స్‌..!

347 కోట్ల మంది మ‌హిళ‌లు.. ఆర్టీసీలో ఫ్రీ ప్ర‌యాణం! రూ. 12,167 కోట్ల మేర ఆ కుటుంబాల‌కు ఆదా..!

Big Stories

Advertisement
×