E-Paper
Advertisement

ఫోక్ సింగర్ మధుప్రియ ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

ఫోక్ సింగర్ మధుప్రియ ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?
Advertisement

Madhu Priya Remuneration:మధు ప్రియ..ఆడపిల్లనమ్మా అనే పాటతో చిన్న తనంలోనే బాగా పాపులర్ అయిన ఈ తెలంగాణా ఆడబిడ్డ ఇపుడు తెలంగాణా జానపదాలకి కేరాఫ్ అయిపొయింది.ఇక తాజాగా మధుప్రియ చేసిన ఆ కోల ఈ కోలలే గౌరమ్మ అంటూ వచ్చిన పాట కేవలం 5 రోజుల్లోనే 1.9మిలియన్ల వ్యూస్ ని కొల్లగొట్టడంతో మధుప్రియ మరోసారి వార్తల్లో నిలిచింది.దీంతో అసలు మధుప్రియ తాను పాడే ఒక్క పాటకి అసలు ఎంత పారితోషికం తీసుకుంటుందా అంటూ ఆరాలు తీసే పనిలో పడ్డారు ఫోక్ లవర్స్ .మరి ఇంతకీ మధు ప్రియ అసలు ఒక్కో సినిమాకి ఎంత పారితోషికం తీసుకుంటుందో ఒకసారి చూసేద్దాం.

1997ఆగస్టు 26న పెద్దపల్లి జిల్లా, గోదావరి ఖనిలో

Advertisement

మధు ప్రియ విషయానికి వస్తే ..మధు ప్రియ 1997ఆగస్టు 26న పెద్దపల్లి జిల్లా, గోదావరి ఖనిలో జన్మించింది. తల్లి పేరు పెద్దింటి సుజాత,తండ్రి పేరు పెద్దింటి మల్లేష్.ఇక మధు ప్రియ ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు.అక్క పేరు సుప్రియ, చెల్లి పేరు శృతి ప్రియ.ముగ్గురికి చివరిలో ప్రియ అని వచ్చేలా పేరు పెట్టడం విశేషం.ఇక మధుప్రియ ఎక్కడా సంగీతంలో శిక్షణ తీసుకోకపోయినా వారి ఇంట్లో వారికి పాటలు పాడే అలవాటు ఉండటంతో అలా మధు ప్రియకి కూడా పాటలు పాడటం అలవాటు అయింది.అలా కేవలం ఆరేళ్ళ వయసు నుండే స్కూల్ లో ఏ ఈవెంట్స్ అయినా మధుప్రియ తప్పని సరిగా పాటలు పాడేది.

తెలంగాణ జానపదాలకి ఒక బ్రాండ్ అంబాసిడర్

Advertisement

అలా పాటలు పాడుతూ అందరి నోళ్ళల్లో నానిన మధుప్రియకి బాగా గుర్తింపు తెచ్చిన పాట ఆడపిల్లనమ్మా నేను పాడు పిల్ల అనే చెప్పాలి. ‘ఐడియా సూపర్ సింగర్’లో ఈ పాట అప్పట్లో ఒక సెన్సేషన్.ఇక ఆ తర్వాత ఎన్నో సభల్లో తెలంగాణ యుద్ద నౌక గద్దర్ తో కల్సి ఈవెంట్స్ చేసిన మధు ప్రియ క్రమక్రమంగా తెలంగాణ జానపదాలకి ఒక బ్రాండ్ అంబాసిడర్ అయిపొయింది.

అలా ఆడపిల్లనమ్మ నేను ఆడపిల్లని, జర్ర దించుకోవే బిడ్డో,అయ్యో దేవుడా ఎందుకు ఇచ్చినావ ఆడజన్మ,రామ రామ ఎల్లమ్మ,వీరుడు గజ్జెల జయహో తెలంగాణ,అరేవో జంగమ  ఇలా ఎన్నో సాంగ్స్ తో ఫోక్ ఇండస్ట్రీలో పాతుకుపోయింది మధు ప్రియ.

ఫోక్ సాంగ్స్ మాత్రమే కాకుండా

ఇక ప్రైవేట్ ఫోక్ సాంగ్స్ మాత్రమే కాకుండా ఫిదా లోని పిల్లా వచ్చిండే,క్రాంతికి వస్తున్నాం సినిమాలోని గోదారి గట్టుమీద (Godari Gattu Meedha) ,లైలా లో రత్తమ్మ (Oho Rathamma) రే రేలా (Re Rela) అంటూ బాపు సినిమాలలో కూడా తన గొంతు వినిపించింది మధు ప్రియ.ముఖ్యంగా ఈ ఏడు సంక్రాంతి బరిలో సాలిడ్ వసూల్లని కొల్లగొట్టిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో పాడిన శశిరేఖ (Sasirekha)అనే పాటతో మరో సారి వార్తల్లో నిలిచింది.

పారితోషికం విషయానికి వస్తే

ఇక మధుప్రియ పారితోషికం విషయానికి వస్తే..ఒక్కో పాటకి యాబయ్ వేల నుండి లక్ష వరకు ,అదే పెద్ద సినిమాలకైతే లక్ష నుండి రెండు లక్షల వరకు కూడా పారితోషికం తీసుకుంటుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ప్రస్తుతం మధు ప్రియకి ఫోక్ ఇండస్ట్రీలో ఉన్న డిమాండ్ ప్రకారం ఆ మాత్రం ఇవ్వడంలో తప్పే లేదంటున్నారు మధు ప్రియ ఫ్యాన్స్.మరి ఇందులో నిజమెంతో మధుప్రియ బయటపెడితే కాని తెలీదు .

ఏది ఏమైనా తనదైన అధ్బుతమైన గొంతుతో ఎంతో మంది అభిమానులని ఉర్రూతలూగిస్తున్న మధుప్రియ వచ్చే రోజుల్లో మరిన్ని సంచలనాలు నమోదు చేయాలని కోరుకుందాం !

ALSO READ :సింగర్ కనకవ్వ ఒక్కో పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

Tags

Related News

ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో చెప్పేసిన త్రిగుణ్!

కొత్త బిజినెస్ ప్రారంభించిన బుల్లితెర నటి హరిత!

చిన్న మిస్టేక్.. కన్నీళ్లు పెట్టుకున్న వంశీ.. అసలేం జరిగిందంటే?

హౌస్ మేట్స్ కి వైల్డ్ కార్డ్స్ ఊహించని ట్యాగ్.. మరీ అంత బుర్ర తక్కువా?

తల్లి కాబోతున్న బిగ్ బాస్ ప్రేరణ..ఆ మూవీ స్టైల్ లో సీమంతం!

Podarillu Kanna : సీరియల్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. కన్నా అవుట్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి ఇరుక్కుంటుందా..? మీనాకు కొత్త టెన్షన్.. బాలు, ప్రభా ఫైట్..

Big Stories

Advertisement
×