E-Paper
Advertisement

‘జైలర్ 2’ జోరు చూస్తుంటే.. వెయ్యి కోట్లు పక్కానా?

‘జైలర్ 2’ జోరు చూస్తుంటే.. వెయ్యి కోట్లు పక్కానా?
Advertisement

Jailer 2 Box Office:‘జైలర్ 2’ …తమిళ సూపర్ స్టార్ తలైవా క్రేజ్ ఎలా ఉంటుందో మరో సారి ప్రూవ్ చేసిన సినిమా ఇది. భారీ అంచనాల మధ్య ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఇపుడు బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది.. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సాలిడ్ వసూల్లని కొల్లగొట్టినట్టు అనౌన్స్ చేసింది మూవీ టీమ్. ఫస్ట్ వీక్ ముగిసే సమయానికి ఈ సినిమా రూ.549 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిందని మేకర్స్ ప్రకటించడంతో మురిసిపోతున్నారు మూవీ లవర్స్.

నిజంగా ఒక సినిమా సాలిడ్ వసూల్లని సాధించడం ఒక ఎత్తయితే, విడుదలైన ఫస్ట్ వీక్ లోనే వరల్డ్ వైడ్ గా ఇంతటి వసూళ్లను అందుకోవడం మరో ఎత్తు. ముఖ్యంగా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, కేరళ, హిందీ మార్కెట్లు, విదేశాల్లోనూ మంచి క్రేజ్ ఉంటుందన్న సంగతి స్పెషల్ గా చెప్పక్కర్లేదు.పైగా ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించడం బాగా కలిసి వచ్చింది. ‘జైలర్’ సినిమాతో రజినీకాంత్‌ను సరికొత్తగా చూపించిన నెల్సన్, సీక్వెల్‌లోనూ అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయడం విశేషం.

Advertisement

ఇక ‘జైలర్ 2’లో రమ్యకృష్ణ, శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్, విద్యా బాలన్ కీ రోల్స్ చేయడం,అనిరుధ్ రవిచందర్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా ని నెక్స్ట్ లెవెల్ లో పెట్టేయడం,పైగా సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ సినిమాకి పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో ఇపుడు నెక్స్ట్ లెవెల్ వసూల్లని చూస్తుంది ఈ సినిమా.దీంతో కోలీవుడ్ కి తీరని వెయ్యి కోట్ల కల ఈ సినిమాతో అయినా నెరవేరేనా అంటూ లెక్కలు వేస్తున్నారు ట్రేడ్ పండితులు.

ఎందుకంటే కోలీవుడ్‌లో వెయ్యి కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించే సినిమా ఏదనే డిబేట్ ఎప్పటి నుండో రన్ అవుతూనే ఉంది. గతంలో ‘రోబో 2.0’, ‘విక్రమ్’, ‘లియో’, ‘పొన్నియిన్ సెల్వన్ 1’, కంగువా వంటి సినిమాలు ఆ ఆశ నెరవేరుస్తాయని ఆశ పడ్డా డిసప్పాయింట్ చేయడంతో అసలు ఆ కల ఎ సినిమా నేరవేరుస్తుందా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు తమిళ తంబీలు.

Advertisement

సరిగ్గా ఈ సమయంలో ‘జైలర్ 2’ తొలి వారం నుంచే బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తుండటంతో ఇక ఆ వెయ్యి కోట్ల కల నెరవేర్చే సినిమా ఇదే అంటూ అప్పుడే లెక్కలు వేస్తున్నారు తలైవా ఫ్యాన్స్.అయితే ఇప్పుడే ఈ సినిమా ఆ బెంచ్ మార్క్ దాటుతుందా అంటే అవునని చెప్పలేము. ముఖ్యంగా రెండో వారం ఆ టాక్ అలా కంటిన్యూ కావడం చాలా ముఖ్యం.

అందుకే రాబోయే రోజుల్లో ‘జైలర్ 2’ బాక్సాఫీస్ జర్నీ ఎలా ఉండబోతోందన్నది ఇపుడు ఆసక్తికరంగా మారిపోయింది.ఏదేమైనా వాలకం చూస్తుంటే తలైవా తన స్టామినాతో ఈసారి కోలీవుడ్ కలని ఈజీగానే నేరవేర్చేలానే ఉన్నాడు.కావాల్సిందల్ల థియేటర్స్ హోల్డ్ చేసుకుని ఈ సక్సెస్ టాక్ ఇలా కంటిన్యూ కావడమే !
ALSO READ :సన్‌ఫ్లవర్‌లా మారాలంటున్న రితికా నాయక్.. అసలు మ్యాటర్ ఏంటంటే!

Tags

Related News

రాజకీయాల్లోకి వెళ్లి ఆస్తులన్నీ పోగొట్టుకున్నా.. నరేష్ షాకింగ్ కామెంట్స్!

బొబ్బిలి రాజా తర్వాత నా కెరీర్‌లో ఏం జరిగిందంటే.. శివాజీరాజా కామెంట్స్

సన్‌ఫ్లవర్‌లా మారాలంటున్న రితికా నాయక్.. అసలు మ్యాటర్ ఏంటంటే!

ఒక్కటి కాదు.. ఏకంగా 8 సినిమాలు! జంధ్యాలతో నరేష్ జర్నీమామూలుది కాదుగా !

కొత్త బంగారులోకం 2 పై వరుణ్ సందేశ్ బిగ్ అప్డేట్.. సీక్వెల్ సినిమా రాబోతోందా?

స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చా.. కానీ సక్సెస్ అంత ఈజీ కాదు!

ప్లీజ్ సినిమా టికెట్ల రేట్లు పెంచొద్దు.. ప్రభుత్వాలను వేడుకున్న నిర్మాత!

Big Stories

Advertisement
×