E-Paper
Advertisement

విజయవాడ పడమట డొంక సెంటర్‌లో యువకుడు హత్య.. నిందితులు అరెస్ట్!

విజయవాడ పడమట డొంక సెంటర్‌లో యువకుడు హత్య.. నిందితులు అరెస్ట్!
Advertisement

Vijayawada Murder: అక్టోబర్ 18న విజయవాడ పటమట డొంకరోడ్డు.. వైన్ షాపు పక్కనే ఓ పాన్ షాప్ ఉంది. మద్యం మత్తులో ఉన్న మాస సాయికుమార్, ఫ్రిడ్జ్ డోర్ తెరిచి వాటర్ బాటిల్ తీయబోయాడు. అంతే! సాయికుమార్‌ని పట్టుకుని, నేరుగా కరెంట్ పోల్‌కి కట్టేశారు. నాలుగు గంటల పాటు చిత్రహింసలు పెట్టారు. దెబ్బ మీద దెబ్బ కొట్టారు. ఆ దెబ్బలు తాళలేక సాయికుమార్ ప్రాణం విడిచాడు. చనిపోయాడని గమనించిన నలుగురు వెంటనే అక్కడి నుంచి జంప్ అయ్యారు.

మర్డర్ కేసు..

తెలంగాణలోని నల్గొండకు చెందిన సాయి కుమార్.. విజయవాడకు వచ్చి ఇలా ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. వాటర్ బాటిల్ కోసం మొదలైన చిన్న గొడవ.. చివరికి మర్డర్ కేసుగా మారిపోయింది. ముందు పోలీసులు అనుమానాస్పద మృతిగా భావించారు. కానీ పోస్టుమార్టం రిపోర్ట్‌లో అసలు నిజం బయటపడింది. తీవ్రంగా కొట్టడం వల్లే చనిపోయాడనితేలింది. దీంతో కేసు మర్డర్‌ కేసుగా టర్న్ తీసుకుంది. పటమట పోలీసులు అయ్యప్పశంకర్ సాయికుమార్, పోతంశెట్టి నవీన్, సాయిప్రణీత్‌ని అరెస్ట్ చేశారు. నలుగురిలో ముగ్గురే దొరికారు… మరి ఆ నాలుగో వాడు ఎక్కడ? పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

నిందితులు అరెస్ట్..

Advertisement

విజయవాడలో యువకుడిని కొట్టి చంపిన నిందితులకు పోలీసులు రిమాండ్‌కు తరలించారు. విజయవాడ పడమట డొంక సెంటర్ పాన్ షాప్‌లో వాటర్ బాటిల్ తీసినందుకు యువకుడిని కొట్టి చంపిన నిందితులు యువకుడిని స్తంభానికి కట్టేసి కర్రలతో నలుగురు వ్యక్తులు చితకబాదారు. ఈ దాడిలో నల్గొండ జిల్లాకు చెందిన సాయికుమార్ అనే వ్యక్తి మృతి చెందాడు. నిందితులు రవిశంకర్, శంకర్, నవీన్, సాయి ప్రణీత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Also read: కేసీఆర్ ఫామ్‌హౌస్ నీటి కథేంటి? విచారణకు ఎంపీ చామల డిమాండ్!

Tags

Related News

బిగ్ బ్రేకింగ్.. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ వాయిదా!

సీఈసీ నియామక మార్పులపై జగన్ షాకింగ్ కామెంట్స్.. వీడియో వైరల్!

విజయనగరంలో కోలాహలంగా పైడితల్లి అమ్మవారి జాతర!

ఏపీ 22వ SIPB సమావేశంలో.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయాలు?

చంద్రబాబు ప్రభుత్వం హింసకు పాల్పడుతోంది, పార్టీ నేతల భేటీలో జగన్ కీలక వ్యాఖ్యలు

కడప జిల్లా నందలూరులో హైటెన్షన్.. గాల్లోకి కాల్పులు జరిపిన టీడీపీ నేత?

పొన్నలూరులో తీవ్ర ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర దాడి!

Big Stories

Advertisement
×