Ritika Nayak:రితికా నాయక్..మిరాయ్ తో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన ఈ భామ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. చేతిలో ఓ అందమైన పువ్వు పట్టుకుని, సింపుల్ లుక్‌లో కనిపించిన రితికా “Trying to be a sunflower” అంటూ క్యాప్షన్ పెట్టింది. అంటే.. సన్ఫ్లవర్లా మారడానికి ప్రయత్నిస్తున్నానని సింపుల్ గా హింట్ ఇచ్చేస్తుందన్న మాట.
ఫోజ్ కి ఫిదా అయిపోతున్న ఫాన్స్
దీంతో అసలు రితికా ఈ క్యాప్షన్ ఎందుకు పెట్టింది? దీని వెనుక ఏదైనా ప్రత్యేకమైన అర్థం ఉందా? అంటూ ఆసక్తిగా ఆరాలు తీయడం మొదలెట్టారు ఫాలోవర్స్.రితికా పోస్ట్ చేసిన ఫోటో చూస్తే లైట్ కలర్ ఫ్లోరల్ డ్రెస్‌లో, చేతిలో పువ్వుతో చిరునవ్వులు చిందిస్తూ ఇచ్చిన ఫోజ్ కి ఫిదా అయిపోతున్నారు ఫాన్స్.
ఇక ఈ మధ్య వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న ఈ భామ సోషల్ మీడియాలో క్రేజీ పోస్ట్ లతో అభిమానులకు టచ్‌లో ఉంటుంది కూడా. ముఖ్యంగా తన ఫోటోలు, స్టైలిష్ లుక్స్, పర్సనల్ మూమెంట్స్ ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేస్తుంది.
సినిమాల విషయానికి వస్తే
ఇక రితికా నాయక్ సినిమాల విషయానికి వస్తే.. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో ఆమె పోషించిన వాసు పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. పెళ్లి చుట్టూ తిరిగే కథలో తన న్యాచురల్ యాక్టింగ్ తో ఆడియన్స్ ని అలరించింది.ఆ తర్వాత ‘ఓరి దేవుడా’ సినిమాలోనూ కనిపించి మెప్పించింది.ఇక తేజ సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన మిరాయ్ సినిమా రితికా నాయక్ కెరీర్ ని మలుపు తిప్పేసింది.
ఒక్క క్లిక్ దూరంలో పెట్టేస్తున్న సినిమా హీరోయిన్స్
ఇక ప్రస్తుతం సినిమా హీరోయిన్లకు సోషల్ మీడియా కూడా చాలా ముఖ్యమైందన్న సంగతి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. సినిమాల గురించి మాత్రమే కాకుండా తమ పర్సనల్ మూమెంట్స్ ,లైక్స్ ,డిస్ లైక్స్ ,వెకేషన్ ట్రిప్స్ ..ఇలా ఎన్నో అభిమానులకి ఒక క్లిక్ దూరంలో పెట్టేస్తున్నారు.ఇక తాజాగా రితికా నాయక్ కూడా ఇపుడు అలాంటి పోస్ట్ తోనే అభిమానులకి మరింత దగ్గరై పోయింది.
మొత్తానికి, “Trying to be a sunflower” అంటూ రితికా నాయక్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సింపుల్‌గా కనిపిస్తూనే అందంగా ఆకట్టుకున్న ఈ ఫోటోకు అభిమానుల నుంచి కామెంట్ల వర్షం కురుస్తుంది.చూడాలి మరి సోషల్ మీడియాని తనదైన పోస్ట్ లతో షేక్ చేస్తున్న ఈ ముద్దు గుమ్మ ఎలాంటి సినిమాలతో పలకరించనుందో !
ALSO READ :ఒక్కటి కాదు.. ఏకంగా 8 సినిమాలు! జంధ్యాలతో నరేష్ జర్నీమామూలుది కాదుగా !