E-Paper
Advertisement

కేసీఆర్ ఫామ్‌హౌస్ నీటి కథేంటి? విచారణకు ఎంపీ చామల డిమాండ్!

కేసీఆర్ ఫామ్‌హౌస్ నీటి కథేంటి? విచారణకు ఎంపీ చామల డిమాండ్!
Advertisement

MP Chamala: మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్‌కు నీటి పంపిణీ, మళ్లింపు వ్యవహారంపై సమగ్ర ఎంక్వైరీ జరిపించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర నీటిపారుదల ఇరిగేషన్ శాఖ కార్యదర్శికి గురువారం అధికారిక లేఖ రాశారు. ప్రజా శ్రేయస్సు, రైతు సంక్షేమం, తాగునీటి అవసరాల కోసం ఏర్పాటు చేసిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను కేసీఆర్ తన వ్యక్తిగత ఫామ్ హౌస్ అవసరాల కోసం దుర్వినియోగం చేశారని ఎంపీ తన లేఖలో ఆరోపించారు.

కొండపోచమ్మ సాగర్ నుంచి పాండురంగ చెరువుకు, అక్కడి నుంచి నేరుగా కేసీఆర్ ఫామ్ హౌస్‌కు నీటిని ఏ విధంగా తరలించారనే దానిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపించాలని ఎంపీ ఆయన కోరారు. ప్రజాధనం దుర్వినియోగం వెలికితీసేలా విచారణ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రికార్డులను, నివేదికలను ఆఫీసర్లు నిష్పాక్షికంగా పరిశీలిస్తే ప్రజాధనం ఎంత మేర దుర్వినియోగానికి గురైందో స్పష్టమైన లెక్కలు బయటకు వస్తాయని ఎంపీ పేర్కొన్నారు.

Advertisement

Also Read: ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారులు.. ఏకంగా రూ.39 లక్షలకు పైగా లంచం వసూల్!

కలెక్టర్లు , సంబంధిత ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి, వీలైనంత త్వరగా ఈ నీటి మళ్లింపు వ్యవహారంపై దర్యాప్తు పూర్తి చేయాలని ఎంపీ చామల పట్టుబట్టారు. నిబంధనలను ఉల్లంఘించి ప్రజాధనాన్ని స్వప్రయోజనాలకు వాడుకున్న బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.

Advertisement

Also Read: ఒక్కటి కాదు.. ఏకంగా 8 సినిమాలు! జంధ్యాలతో నరేష్ జర్నీమామూలుది కాదుగా !

Tags

Related News

కారు అద్దె బకాయి వివాదంలో దారుణం.. యువకుడిని కిడ్నాప్ చేసి చిత్రహింసలు!

సింగరేణి జోలికొస్తే ఊరుకోం.. కాంగ్రెస్, బీజేపీలకు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!

హైదరాబాద్‌లో 87 నిమిషాల మనీ గేమ్.. దెబ్బకు రూ. 3.34 కోట్లు స్వాహా!

ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారులు.. ఏకంగా రూ.39 లక్షలకు పైగా లంచం వసూల్!

ఈ-ముద్ర ప్రైవేట్ కీస్ లోపం అసలు ఎలా జరిగింది?.. అసలు మ్యాటర్ ఇదే?

రైతుల కష్టాలకు ఎల్‌నినో కాదు.. కాంగ్రెస్ నిర్లక్ష్యమే కారణం.. ఆర్.ఎస్ ప్రవీణ్ ఫైర్!

తెలంగాణకు భారీ పెట్టుబడుల వరద.. సీఎం రేవంత్ వ్యూహం ఇదే?

Big Stories

Advertisement
×