E-Paper
Advertisement

విడుదలకు ముందే జైలర్ 2 సరికొత్త రికార్డ్.. భారీ ధరకు నాన్ థియేట్రికల్ హక్కులు!

విడుదలకు ముందే జైలర్ 2 సరికొత్త రికార్డ్.. భారీ ధరకు నాన్ థియేట్రికల్ హక్కులు!
Advertisement

Jailer 2: సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా, కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ (Nelson Dilip) దర్శకత్వంలో 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం జైలర్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాకు సీక్వెల్ గా జైలర్ 2 పేరిట 2026 అక్టోబర్ 15వ తేదీన దసరా సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. విడుదలకు ఇంకా నెల సమయం ఉండగానే ఇప్పటినుంచే సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా నాన్ థియెట్రికల్ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు విడుదలకు ముందే జైలర్ 2 సరికొత్త రికార్డు క్రియేట్ చేసిందని చెప్పాలి.

జైలర్ 2 నాన్ థియేట్రికల్ హక్కులు..

కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ సుమారుగా రూ.250 నుండి రూ.350 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు. జైలర్ సినిమా తీసుకొచ్చిన రికార్డ్స్ కారణంగా ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు కూడా భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులతో పాటు ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. అలా ఈ సినిమా హక్కులు ఏకంగా రూ.160 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం.

కోలీవుడ్ లో సరికొత్త రికార్డు..

Advertisement

ఈ భారీ నాన్ థియేట్రికల్, ఓటిటి డీల్ హక్కులు అమ్ముడుపోయిన ధరను బట్టి చూస్తే తమిళనాడు సినీ చరిత్రలోనే ఇది అతి పెద్ద నాన్ థియేట్రికల్ డీల్ అని చెప్పవచ్చు. ఏది ఏమైనా జైలర్ సినిమా తీసుకొచ్చిన క్రేజ్ జైలర్ 2 ని విడుదలకు ముందే రికార్డుల్లోకి ఎక్కిస్తోందనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.

తెలుగు రాష్ట్రాలలో థియేటర్ హక్కులు ఎవరికి?

భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ వ్యవహారం టాలీవుడ్ లో ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా థియేటర్ హక్కులను దక్కించుకునేందుకు యంగ్ ప్రొడ్యూసర్ ఎస్ నాగ వంశీ (Naga Vamshi) ముందంజలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఫైనల్ డిస్కషన్ కొనసాగుతుండగా అమెరికా వెళ్లే ముందు నాగవంశీ తన ప్రతిపాదనను చిత్ర నిర్మాణ సంస్థ ముందు ఉంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే వారం రోజుల్లో ఈ డీల్ పై ఫైనల్ డెసిషన్ వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Advertisement

ALSO READ: కొత్త ఉద్యోగంలో చేరిన రకుల్ ప్రీత్ సింగ్.. వీడియోతో ఊహించని సర్ప్రైజ్!

భారీ పోటీ మధ్య హక్కులు దక్కించుకునేది ఎవరు?

మరోవైపు అడ్వాన్స్ ప్రాతిపదికన ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ఏషియన్ సునీల్ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి అంతేకాదు ఈ వ్యవహారంలో ప్రముఖ నిర్మాత సురేష్ బాబు సహకారం కూడా ఉండొచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకవేళ నాగ వంశీ ఈ సినిమా హక్కులను దక్కించుకుంటే స్వయంగా ఆయనే రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాను పెద్ద ఎత్తున రిలీజ్ చేసే అవకాశం ఉంది. దీనికి తోడు డైరెక్టర్ నెల్సన్ తో నాగ వంశీకి ఉన్న మంచి అనుబంధం కారణంగా ఈ డీల్ మరింత కీలకంగా మారింది. మొత్తానికైతే నాగ వంశీ ఈ సినిమా హక్కులను దక్కించుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తోంది.

Related News

చిరు డైరెక్టర్ తో బాలయ్య సినిమా.. ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పక్కా..!

మారెమ్మపై రవితేజ ఫుల్ కాన్ఫిడెంట్.. సినిమా చూశాక ఏమన్నాడంటే!

విశ్వక్ సేన్ ‘లెగసీ’.. ఈసారి రాజకీయాలతో రచ్చ చేయబోతున్నాడా?

మీర్జాపూర్‌కు పిచ్చ క్రేజ్.. రెండో రోజు కలెక్షన్స్ చూస్తే షాక్

జగమే సంగీతం పై చిరు ప్రశంసలు… చాలా గర్వంగా ఉందంటూ పోస్ట్!

గన్స్.. గ్రేహౌండ్స్.. మధ్యలో శ్రీవిష్ణు.. ‘కామ్రేడ్ కళ్యాణ్’ టీజర్ ఎలా ఉందంటే!

సుమలత క్షమాపణలు చెప్పాలి.. ఫెడరేషన్ కు శేఖర్ మాస్టర్ ఫిర్యాదు!

Big Stories

Advertisement
×