E-Paper
Advertisement

Jailer 2: రజనీ కాంత్ ‘జైలర్ 2’లో కామియో రోల్ చేయబోతున్న బాలీవుడ్ బడా స్టార్.. ఎవరంటే?

Jailer 2: రజనీ కాంత్ ‘జైలర్ 2’లో కామియో రోల్ చేయబోతున్న బాలీవుడ్ బడా స్టార్.. ఎవరంటే?
Advertisement

Jailer 2:సూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రధాన పాత్రలో నల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘జైలర్ 2’. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన ‘జైలర్ 2’ సినిమాలో కామియో రోల్ చేయబోతున్నారు. దీంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కోసం అభిమానలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ‘జైలర్’ ఏ రేంజ్ హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే.

Read also-Telugu TV Serials: ఆ రెండే టాప్ రేటింగ్.. టాప్ సీరియల్స్ కు శుభం కార్డు పడ్డట్లే..

అతిథి పాత్రలో..

Advertisement

సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న ‘జైలర్ 2’ (Jailer 2) గురించి వస్తున్న వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల్లో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారనే వార్త అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో షారుక్ ఖాన్ కేవలం అతిథి పాత్రకే పరిమితం కాకుండా, కథను మలుపు తిప్పే ఒక పవర్‌ఫుల్ రోల్‌లో కనిపిస్తారట. రజనీకాంత్ (ముత్తువేల్ పాండియన్) కష్టాల్లో ఉన్నప్పుడు అతనికి అండగా నిలిచే ఒక నమ్మకమైన స్నేహితుడిగా (Confidante) షారుక్ పాత్ర ఉంటుందని తెలుస్తోంది. దాదాపు 30 ఏళ్ల తర్వాత మిథున్ చక్రవర్తి, రజనీ కాంబినేషన్ సెట్ అవ్వగా, ఇప్పుడు షారుక్ కూడా తోడవడంతో సినిమా రేంజ్ పాన్-ఇండియా స్థాయికి చేరింది. మొదటి భాగం ‘జైలర్’లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ వంటి స్టార్స్ మెరిసినట్లే, సీక్వెల్‌లో కూడా నెల్సన్ భారీ ప్లాన్ చేశారు. రమ్యకృష్ణ, యోగి బాబు, సునీల్ మళ్లీ తమ పాత్రలను పోషిస్తున్నారు. బాలీవుడ్ నటి విద్యాబాలన్, మల్టి టాలెంటెడ్ నటుడు ఎస్.జె. సూర్య, మిథున్ చక్రవర్తి ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. షారుక్ ఖాన్‌తో పాటు విజయ్ సేతుపతి, మోహన్ లాల్ కూడా ప్రత్యేక పాత్రల్లో కనిపించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

Read also-Anil Ravipudi: సంక్రాంతి బరిలోనే అనిల్ రావిపూడి సినిమా .. రంగంలోకి బడా బ్యానర్లు!

అనిరుధ్ మ్యూజిక్ మ్యాజిక్..

Advertisement

‘జైలర్’ మొదటి పార్ట్ విజయానికి అనిరుధ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) ప్రధాన కారణం. ఇప్పుడు రెండో పార్ట్ కోసం కూడా అనిరుధ్ అద్భుతమైన ట్యూన్స్‌ సిద్ధం చేస్తున్నారట. ముఖ్యంగా రజనీ-షారుక్ కలిసి ఉండే సీన్స్‌కు ఇచ్చే మ్యూజిక్ థియేటర్లను హోరెత్తించడం ఖాయమని చిత్ర బృందం ధీమాగా ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చైన్నై, కేరళ, గోవా వంటి ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. చిత్ర యూనిట్ జూన్ 12, 2026న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×