Jailer 2 Story: జైలర్ …వరుస ప్లాపులతో కుదేలవుతున్న రజినీకి ఊపిరిపోసిన సినిమా ఇది.నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ఒకటి రెండు కాదు ఏకంగా దాదాపు 600కోట్లకి పైగా కొల్లగొట్టి తలైవా ఈజ్ కంబ్యాక్ అంటూ సగర్వంగా చాటిన సినిమా.
అలాంటి సినిమాకి సీక్వెల్ వస్తుందంటే అభిమానుల్లో అంచనాలు ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు.ఇక సినిమా కూడా అనుకున్నట్టుగానే జైలర్ 2 అక్టోబరు 15న రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు కూడా.మరి ఈ సినిమా కథ ఇదే అంటూ ఒక క్రేజీ స్టోరీ నెట్టింట వైరల్ అవుతుంది.మరింతకీ అదేంటో చూసేద్దామా!
సినిమా మొదటి భాగం విషయానికి వస్తే ‘ముత్తువేల్ పాండియన్ పాత్రలో రిటైర్డ్ జడ్జిగా,ఒక అమాయకమైన తాతయ్యగా మొదటి భాగం లో అలరించిన రజినీ రెండో భాగానికి వచ్చే సరికి ఎలా చెలరేగిపోయాడో మనందరికీ తెల్సిందే.
ముఖ్యంగా ఒక పవర ఫుల్ జైలర్ గా సౌత్, నార్త్ గ్యాంగ్ స్టర్ లని తన ఒక్క ఫోన్ కాల్ తో శాసించే వ్యక్తిగా చూపించిన మాస్ ఎలివేషన్స్ ని రజిని ఫ్యాన్స్ ఇప్పటికీ మర్చిపోలేరు.ఇక సినిమా చివర్లో సీక్వెల్ ఉంటుందని చెప్పేయడంతో సీక్వెల్ కథ ఏమై ఉంటుందా అంటూ ఆరాలు తీసేపనిలో పడ్డారు.
జైలర్ 2 సినిమా విషయానికి వస్తే సినిమా మొదటగా ముత్తువేల్ తన ప్లాష్ ఏంటో తనవారికి డీటైల్డ్ గా వివరిస్తుండటంతో జైలర్ 2 సినిమా మొదలవుతుందని తెలుస్తుంది.ఒక సాదాసీదాగా రిటైర్డ్ అయిన జైలర్ గతంలో అంత ఆషామాషీ వాడు కాదట, తీహార్ జైలులో ముత్తువేల్ జైలర్ గా ఉన్న సమయంలో అక్కడి అండర్ వరల్డ్ నెట్ వర్క్ తో డీ అంటే డీ అన్నాడట.
పైగా అక్కడ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ తో ఒక రేంజ్ లో తలపడతాడట.అలా రజినీ పకడ్బందీగా ఎన్నో ప్లాన్స్ వేయడంతో ఒక ముఖ్యమైన ఇంటర్నేషనల్ డ్రగ్ సిండికేట్ బట్టబయలు అవుతుందట.దీంతో అనుకోకుండా తన ఫ్యామిలీకి ఇంటర్నేషనల్ డ్రగ్ సిండికేట్ నుండి థ్రెట్ ఏర్పడటం తో ముత్తువేల్ జైలర్ గా రిటైర్డ్ అయ్యి కుటుంబానికి ఏ ఇబ్బందులు రాకుండా చక్కగా చూసుకుంటూ ఉంటాడట.
అయితే జైలు లో ఉన్న కొందరు డాన్ లకి జైలర్ సహాయం చేయడం, ఫలితంగా తను ఎప్పుడైనా కష్టాలలో ఉన్నప్పుడు కోరుకుంటే వచ్చి తనకి సహాయం చేయాలనే డీల్ మీద అక్కడి నుండి ఎగ్జిట్ ఇస్తాడట ముత్తువేల్.ఇక జైలర్ లో శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్, జాకీష్రాఫ్ ల ఎంట్రీ వెనుక ఇలాంటి కారణం ఉండటం వల్లే కీలక సమయాల్లో వాళ్ళంతా వచ్చి రజినీకి అండగా నిలిచారని వినిపిస్తుంది.
ఇక జైలర్ 2లో మొదటి భాగం ఫ్లాష్ బ్యాక్ తో ఎండ్ అయితే రెండో భాగం మొత్తం ముత్తువేల్ పాండియన్ స్కేల్ మరింత పెరగనుందట. మొదటి భాగంలో విలన్ గా కనిపించే వర్మన్ కేవలం విగ్రహాలు స్మగుల్ చేసే వాడు మాత్రమే అని దీని వెనుక గతం లో తనకి జైలర్ గా ఉన్నప్పుడు ఎదురైన ఇంటర్నేషనల్ డ్రగ్ సిండికేట్ నెట్ వర్క్ ఉంటుందని ,దాని వెనుక సైకో గా కనిపించే ఒక బడా విలన్ ఉన్నాడని ముత్తువేల్ కి తెలుస్తుందట.
దీంతో ఎలాగైనా వారిని అంతం చేయాల్సిందే అని ముత్తువేల్ రంగంలోకి దిగితే,ముత్తువేల్ ని ఫిజికల్ గా కాకుండా సైకలాజికల్ గా దెబ్బ కొట్టాలని, అందులో భాగంగానే ముత్తువేల్ తన కొడుకు చంపిన విషయాన్ని ఫ్యామిలీకి చెబుతున్నామని సైకో విలన్ బయపెడతారని తెలుస్తుంది.
ఇక చివరికి ఎట్టకేలకి ఫ్యామిలీకి అసలు విషయం తెలీడం,కుటుంబ సభుల ముందే ముత్తువేల్ ఓక్ దోషిలా నిలబడతాడట.ఇక అదే క్రమంలో ముత్తువేల్ చేతిలో ఆ సైకో విలన్ అండ్ గ్యాంగ్ చనిపోవడం, ముత్తువేల్ ని అరెస్ట్ చేయడానికి వచ్చిన పవర్‌ఫుల్ రా ఆఫీసర్ అసలు ఇందులో ముత్తువేల్ హస్తం ఏమీ లేదని ముత్తువేల్ కి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో కథ సుఖాంతం అవుతుందని తెలుస్తుంది.
ALSO READ:రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!
చూడాలి మరి నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ కథకి అక్టోబరు 15వ తేదీన రిలీజ్ అవబోతున్న జైలర్ 2 సినిమా కథకి ఎంతదగ్గరి పోలిక ఉంటుందో!