E-Paper
Advertisement

భార్యను కలవబోతున్న సీఎం విజయ్…త్రిష సైడ్ అవ్వాల్సిందేనా?

భార్యను కలవబోతున్న సీఎం విజయ్…త్రిష సైడ్ అవ్వాల్సిందేనా?
Advertisement

Tamilanadu C.M.Vijay: తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సినీ నటుడు విజయ్ (C.M.Vijay) ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి విదేశీ పర్యటనలకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రానికి పారిశ్రామిక పెట్టుబడులను తీసుకువచ్చే లక్ష్యంతో ఈయన ఈనెల 10వ తేదీ బ్రిటన్ కు వెళ్తున్నారు. ఈనెల పది నుంచి 16వ తేదీ వరకు యూకే లో జరిగే పలు పారిశ్రామికవేత్తల సమావేశంలో ఈయన పాల్గొనబోతున్నారు. ఈ విధంగా సీఎం విజయ్ యూకే వెళుతున్న విషయం తెలియడంతో ఇది కాస్త ఇటు రాజకీయాల పరంగా సినిమాలపరంగా కూడా చర్చలకు కారణం అవుతుంది.

లండన్ పర్యటనలో సీఎం విజయ్..

గత కొంతకాలంగా సీఎం వ్యక్తిగత విషయాలన్నీ కూడా సోషల్ మీడియాలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈయన తన భార్య సంగీత విడాకులు తీసుకోబోతున్నట్టు ప్రచారం జరిగింది. అందుకు అనుగుణంగానే సంగీత కోర్టును ఆశ్రయించడం, చివరి నిమిషంలో విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకోవడం జరిగింది. ఇలా విజయ్ సంగీత విడాకులు తీసుకున్న అనంతరం నటుడు విజయ్ త్రిష(Trisha)తో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ అప్పట్లో వార్తలు బలంగా వినిపించాయి. అయితే సంగీత(Sangeetha) విడాకుల ఉపసంహరణ చేసుకోవడంతో తిరిగి మళ్లీ కలవబోతున్నారా? అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి.

భార్యాబిడ్డను విజయ్ కలవబోతున్నారా?

Advertisement

ఇదిలా ఉండగా తాజాగా సీఎం విజయ్ లండన్ వెళ్తున్న నేపథ్యంలో ఈయన అక్కడే నివసిస్తున్నటువంటి తన భార్య సంగీత అలాగే కుమార్తె దివ్వను కూడా కలవబోతున్నారనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. మరి నిజంగానే విజయ్ తన భార్య సంగీతను కలవబోతున్నారా ఒకవేళ తన భార్యతో విజయ్ తిరిగి కలిసిపోతే త్రిష సైడ్ అవ్వాల్సిందేనా అంటూ ఎన్నో సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం నటి త్రిష సైతం ఒక సినిమా షూటింగ్లో భాగంగా యూరప్ లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే విజయ్ లండన్ పర్యటన పట్ల పెద్ద ఎత్తు ఆసక్తి నెలకొంది.

విడాకుల ఉపసంహరణ..

విజయ్ భార్య సంగీత గత కొంతకాలంగా విజయ్ దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా వీరి విడాకుల గురించి సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు అనుగుణంగానే ఇద్దరు విడిపోవాలని సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేవలం త్రిష కారణంగానే విజయ్ సంగీత విడాకులు తీసుకున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు అనుగుణంగానే విజయ్ త్రిష ఇటీవల కాలంలో కలిసి కనిపించడంతో ఈ వార్తలో నిజమేనని భావించారు. విజయ్ సంగీత విడాకులు తీసుకున్న అనంతరం త్రిషను పెళ్లి చేసుకుంటారని అందరు భావించారు కానీ ఊహించని విధంగా సంగీత విడాకుల ఉపసంహరణ చేసుకోవడం కొత్త చర్చలకు కారణమైంది.మరి విడాకులు ఉప సంహరణ చేసుకున్న సంగీత తిరిగి తన భర్త విజయ్ తో కలిసిపోతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక మరోవైపు త్రిష మాత్రం తరచూ విజయ్ తో కలిసి పలు కార్యక్రమాలకు, వివాహాలకు హాజరవుతూనే ఉన్నారు . మరి వీరి వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో తెలియాల్సి ఉంది.

Advertisement

Also Read: బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

Related News

రజినీ జైలర్ 2 కథ ఇదేనా? ఈసారి టార్గెట్ ఎవరో తెలిస్తే షాక్!

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

Big Stories

Advertisement
×