E-Paper
Advertisement

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!
Advertisement

Priyanka Shivakumar:శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు సందర్భంగా బుల్లితెర జోడీ ప్రియాంక జైన్, శివకుమార్ జంట చేసిన ఒక స్పెషల్ ఫోటోషూట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అయిపొయింది. పండుగ రోజున ఈ జోడీ వేసిన రాధాకృష్ణుల గెటప్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

‘మౌనరాగం’ సీరియల్ తో

Advertisement

బుల్లితెరపై ‘మౌనరాగం’ సీరియల్ తో ఎంట్రీ ఇచ్చితెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఈ కన్నడ కస్తూరి .ఆ సీరియల్‌లో అమ్ములుగా ఆమె నటించిన తీరు, అమాయకత్వంతో కూడిన నటనకి ఎంతో మంది ప్యాన్స్ ఉన్నారు కూడా.

రీల్ లైఫ్‌లోనే కాదు, రియల్ లైఫ్‌లోనూ

Advertisement

ఇక ఆ తర్వాత బిగ్‌బాస్ షోలో తన రియల్ క్యారెక్టర్‌తో మరింత మంది అభిమానులను సంపాదించుకుంది. ఇక శివకుమార్ విషయానికొస్తే, తను కూడా పలు ప్రముఖ సీరియల్స్ ద్వారా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన రీల్స్, వ్యక్తిగత యూట్యూబ్ వీడియోలు ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటాయి కూడా . రీల్ లైఫ్‌లోనే కాదు, రియల్ లైఫ్‌లోనూ ఈ జంట కెమిస్ట్రీకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారనడం లో ఆశ్చర్యం లేదు.పైగా సమయం సెట్ అయితే పెళ్లి చేసుకుంటామని ఇప్పటికే ప్రకటించింది ఈ జోడీ.

రాధాకృష్ణుల గెటప్‌లో

ఇదిలా ఉంటె తాజాగా జన్మాష్టమి పండగను మరింత స్పెషల్‌గా మార్చేసింది ఈ క్రేజీ కపుల్. అవును..ప్రియాంక, శివకుమార్‌లు కలిసి AI సహాయంతో  రాధాకృష్ణుల గెటప్‌లో మెరిసిపోయారు. కృష్ణుడిలా శివకుమార్ చేతిలో పిల్లనగ్రోవి పట్టుకుని నవ్వులు చిందిస్తుంటే, పక్కనే పట్టు వస్త్రాలు, ఆభరణాలు ధరించి రాధమ్మలా ప్రియాంక ఇచ్చిన పోజులు అభిమానులని మెస్మరైజ్ చేస్తున్నాయి. ఈ ఫోటోల్లో వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్, ఒకరినొకరు చూసుకునే చూపులు అభిమానులను కట్టిపడేస్తున్నాయనడంలో ఆశ్చర్యం లేదు.

ఇక ఈ జంట ఫోటోలు షేర్ చేసిన కొద్ది నిమిషాల్లోనే బుల్లితెరపై బెస్ట్ జోడీ అంటే మీరే”,”నిజంగానే రాధాకృష్ణులు మళ్లీ పుట్టారా ఏంటి?”అంటూ కామెంట్ల వర్షం కురిపించారు ఫ్యాన్స్.మరికొంతమంది AI తో కాకుండా రియల్ గా గెటప్పులు వేస్తె ఇంకా బాగుండు అంటూ సలహాలిస్తున్నారు.

ALSO READ:‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

ఈ జోడీ ఎప్పుడు ఒక్కటవుతుందో !

ఇప్పటికే అనేక టీవీ షోలు, ఈవెంట్లతో బిజీగా ఉండే ఈ జంట, పండుగలు వచ్చినప్పుడు ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ ఫోటోషూట్లతో అభిమానులను అలరించడం అలవాటుగా మార్చుకున్నారని వీరి పేజ్ చూస్తేనే అర్థం అవుతుంది.చూడాలి మరి అతి త్వరలో పెళ్లి పీటలు ఎక్కేసి ఒక ఇంటివారిమి అవుతామని చెప్పిన ఈ జోడీ ఎప్పుడు ఒక్కటవుతుందో !

Tags

Related News

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×