Motor Adventure Documentary Series OTT : కార్లు, బైక్స్, స్పీడ్ అంటే పిచ్చి… ప్రపంచంలోని వింతైన రోడ్లపై ముగ్గురు ఫ్రెండ్స్ చేసే రచ్చ అంటే ఇంకా పిచ్చి… 12 ఏళ్లుగా మోటార్ ప్రపంచాన్ని తమదైన స్టైల్ లో అలరిస్తున్న ఈ ఐకానిక్ ట్రయో ప్రయాణం ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. కొత్త కొత్త కార్లను టెస్ట్ చేయడం, ప్రమాదకరమైన రోడ్లపై డ్రైవింగ్ చేయడం, ఊహించని ఛాలెంజ్‌లు తీసుకోవడం, వాటి మధ్య పిచ్చి కామెడీతో ప్రేక్షకులను నవ్వించడం ‘The Grand Tour’ ప్రత్యేకత. ఎన్నో దేశాలు చుట్టేసిన ఈ మోటార్ అడ్వెంచర్ రియాలిటీ సిరీస్ కు ఇప్పుడు ఎండ్ కార్డ్ పడింది. సెప్టెంబర్ 4 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ఫైనల్ స్పెషల్ లో జెరెమీ క్లార్క్‌సన్, రిచర్డ్ హ్యామండ్, జేమ్స్ మే మరోసారి కలిసి కనిపించడంతో ఫ్యాన్స్‌కు ఇది ఎమోషనల్ రైడ్‌గా మారింది. మరి ఈసారి ఈ ముగ్గురు ఎలాంటి మిషన్‌తో బయలుదేరారు ? చివరి ప్రయాణం ఎక్కడ మొదలైంది ? ఏ కార్లతో హంగామా చేశారు ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.
‘ది గ్రాండ్ టూర్’ అనేది సాధారణ కార్ షో కాదు. ప్రపంచంలోని విభిన్న ప్రాంతాలకు వెళ్లి అక్కడి రోడ్లు, వాతావరణం, భూభాగాన్ని దాటుకుంటూ కార్లను పరీక్షించడం ఈ ముగ్గురి స్టైల్. కానీ ప్రతి ప్రయాణంలోనూ కార్ల కంటే వీళ్ల మధ్య జరిగే సరదా గొడవలు, పిచ్చి ఛాలెంజ్‌లు, ఊహించని ప్రమాదాలే అసలు ఎంటర్‌టైన్‌మెంట్. ఈ ఫైనల్ జర్నీలో కూడా అదే ఫార్ములా కొనసాగుతుంది. ముగ్గురూ కలిసి ఒక అడ్వెంచరస్ మిషన్‌లోకి దిగుతారు. కొత్త ప్రాంతాలు, కఠినమైన రోడ్లు, వాహనాల పనితీరు, తమ డ్రైవింగ్ స్కిల్స్‌ను పరీక్షించే పరిస్థితులు ఎదురవుతాయి.
ఒకరి కారును మరొకరు ఆటపట్టించడం నుంచి, అసాధ్యంగా కనిపించే ఛాలెంజ్‌లను పూర్తి చేయడానికి ప్రయత్నించడం వరకు ప్రతి దశలో కామెడీ పండుతుంది. అయితే ఈసారి ఒక ప్రత్యేకమైన ఫీల్ ఉంటుంది. ఎన్నో సంవత్సరాలుగా కలిసి ప్రయాణించిన ఈ ముగ్గురు చివరిసారిగా ఒకే స్క్రీన్‌పై మోటార్ అడ్వెంచర్ చేయడం ప్రేక్షకుల్లో ఎమోషన్ ను పెంచుతుంది. స్పీడ్, కార్లు, కామెడీ మధ్యలో వారి సుదీర్ఘ ప్రయాణానికి వీడ్కోలు పలికే క్షణాలు కూడా కనిపిస్తాయి. ఇంతకాలం ప్రేక్షకులను అలరించిన ఈ ట్రయో చివరి ప్రయాణం ఎలా ముగిసింది ? చివరి ఛాలెంజ్ లో ఎవరు పైచేయి సాధించారు ? ముగింపు నిజంగానే ఊహించినంత ఎమోషనల్ గా ఉందా ? అనేదే ఇందులో చూడాల్సిన అసలు విషయం.
Read Also : బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్
మోటార్ అడ్వెంచర్, ట్రావెల్, రియాలిటీ, కామెడీ డాక్యుమెంటరీ సిరీస్ ‘ది గ్రాండ్ టూర్’. జెరెమీ క్లార్క్‌సన్, రిచర్డ్ హ్యామండ్, జేమ్స్ మే ప్రధాన పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 4 నుంచి Amazon Prime Videoలో ఈ ఫైనల్ స్పెషల్ స్ట్రీమింగ్ అవుతోంది. కార్లు, బైక్స్, అడ్వెంచర్ ట్రావెల్, స్పీడ్, కామెడీ ఇష్టపడేవారికి ఈ చివరి ప్రయాణం మంచి ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వొచ్చు. ముఖ్యంగా ఈ ముగ్గురి కెమిస్ట్రీని మొదటి నుంచి ఫాలో అవుతున్న అభిమానులకు మాత్రం ఈ డాక్యుమెంటరీ చివరి హంగామా ఒక ఎమోషనల్ ఫేర్‌వెల్ రైడ్. కాబట్టి డోంట్ మిస్.