E-Paper
Advertisement

‘జన నాయగన్’ రెమ్యునరేషన్స్.. విజయ్ ఒక్కడికే అన్ని కోట్లా?

‘జన నాయగన్’ రెమ్యునరేషన్స్.. విజయ్ ఒక్కడికే అన్ని కోట్లా?
Advertisement

Jana Nayagan Cast Remuneration:‘జన నాయగన్’…గత ఏడు నెలలు గా ఈ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు దళపతి ప్యాన్స్.ఇక ఇది నా చివరి సినిమా అని దళపతి విజయే ఏకంగా చెప్పేయడంతో సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో పెరిగిపోయాయి.ఇక ఎన్నో వాయిదాల పాటలు పాడిన తర్వాత ఎట్టకేలకు ఈ సినిమా ఈరోజే అంటే జులై 23నే థియేటర్ లోకి ఎంటర్ అవడంతో మురిసిపోతున్నారు మూవీ లవర్స్.

దళపతి విజయ్ కెరీర్ లోనే ఊహించని రెమ్యునరేషన్

Advertisement

అయితే తాజాగా ఈ సినిమా దళపతి విజయ్ కెరీర్ లోనే చివరిది కావడంతో ఊహించని విధంగా పారితోషికం తీసుకున్నాడని సోషల్ మీడియాలో వార్తలు తెగ హైలెట్ అవుతున్నాయి.అవును..ఇంతకీ విజయ్ తన కెరీర్‌లోనే కాకుండా, ఇండియన్ సినిమా హిస్టరీలోనే రికార్డు లెవెల్‌లో దాదాపు రూ.220 కోట్ల నుండి రూ .275 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది.

also read :నీట్ పేపర్ లీక్ తీవ్ర దుమారం.. రంగంలోకి దిగిన సల్మాన్ ఖాన్, ప్రదీప్ రంగనాథన్!

Advertisement

ఇక సినిమాలో హీరోయిన్‌గా చేసిన పూజా హెగ్డే ₹6 కోట్లు పుచ్చుకోగా, మెయిన్ విలన్‌గా నటిస్తున్న బాబీ డియోల్ రూ.5 నుండి రూ.10 కోట్ల మధ్య వెనకేసినట్టు తెలుస్తుంది. ఇక సీనియర్ యాక్టర్ ప్రకాష్ రాజ్ రూ.5 కోట్లు, ప్రియమణి రూ.3 కోట్లు,. డైరెక్టర్ గౌతమ్ మీనన్ రూ.3 కోట్లు, నరేన్ రూ.2.5 కోట్లు అందుకున్నారట.’అయితే ఊహించని విధంగా ప్రేమలు’ బ్యూటీ మమితా బైజూకి కేవలం రూ.60 లక్షల నుండి కోటి లోపే ముట్టచెప్పారన్న టాక్ వినిపిస్తుంది.

తెర వెనుక కష్టపడ్డ టెక్నీషియన్స్ కి కూడా 

అయితే కేవలం తెర మీద కనిపించే నటీ నటులే కాదండోయ్..సినిమా తెర వెనుక కష్టపడ్డ టెక్నీషియన్స్ కూడా సాలిడ్ గానే వసూలు చేసినట్టు తెలుస్తుంది.వీరిలో ఈ సినిమాను డైరెక్ట్ చేసిన హెచ్. వినోత్ తన కెరీర్‌లోనే హైయెస్ట్‌గా రూ.25 కోట్లు తీసుకోగా, తన మ్యూజిక్‌తో థియేటర్లను షేక్ చేసే రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ రూ.13 కోట్లు పుచ్చుకున్నట్టు సమాచారం. మొత్తంగా ఈ లెక్కలు చూస్తుంటేనే ప్రొడ్యూసర్లు సినిమా కోసం ఎంత ఖర్చు పెట్టారో అర్థమవుతోంది.

also read :అపోలోలో ఐసీయూలో ‘గబ్బర్ సింగ్’ రమేష్.. రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్ టీమ్!

ఇక ప్రస్తుతం సినిమాకి వినిపిస్తున్న టాక్ ని బట్టి చూస్తుంటే రజనీకాంత్ ‘జైలర్’ (10 ఆగస్టు 2023), విజయ్ ప్రీవియస్ హిట్ ‘GOAT’ (5 సెప్టెంబర్ 2024) కలెక్షన్ రికార్డులను ‘జన నాయగన్’ ఈజీగా దాటేస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండిట్స్.చూడాలి మరి అంచనాలు భారీగా మోస్తున్న ఈ జననాయకుడు ఎలాంటి సంచలనాలు స్ప్రుష్టిస్తాడో !

Related News

సుప్రీంకోర్టులో బండ్ల గణేష్ కు ఎదురుదెబ్బ.. పిటిషన్ ను కొట్టి వేస్తూ కీలక తీర్పు!

దళపతి విజయ్ ‘జననాయగన్’ రివ్యూ: ఫ్యాన్స్ ఊహించింది ఒకటి.. జరిగింది వేరొకటి!

జూబ్లీహిల్స్ లో స్థల కబ్జా యత్నం.. బడా ప్రొడ్యూసర్స్ సి.కళ్యాణ్, బి. శివరామకృష్ణపై కేస్ ఫైల్!

నీట్ పేపర్ లీక్ తీవ్ర దుమారం.. రంగంలోకి దిగిన సల్మాన్ ఖాన్, ప్రదీప్ రంగనాథన్!

అపోలోలో ఐసీయూలో ‘గబ్బర్ సింగ్’ రమేష్.. రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్ టీమ్!

చెన్నై జ్ఞాపకాలు నెమరువేసుకున్న చిరంజీవి.. ‘చెన్నై లవ్ స్టోరీ’ ఈవెంట్ హైలైట్స్!

Jananayagan Twitter Review : ‘ జననాయగన్’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Big Stories

Advertisement
×