NEET Movement: గత కొన్ని రోజులుగా నీట్ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారం దేశ రాజదాని డిల్లీని ఎలా షేక్ చేస్తుందో చూస్తూనే ఉన్నాం. విద్యాశాఖ మంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, మన విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దాలంటూ లక్షలాది జనాలు తమ నిరసన తెలియజేస్తూనే ఉన్నారు. అయితే ఈ ప్రజా పోరాటానికి ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఊహించని రేంజ్ మద్దతు లభిస్తుండటం విశేషం. ముఖ్యంగా బాలీవుడ్ సల్మాన్ ఖాన్ చేసిన కామెంట్స్, పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
విచారం వ్యక్తం చేసిన సల్మాన్
ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ తన చిన్నప్పటి పిక్ ని షేర్ చేస్తూ ఇన్ స్టాగ్రామ్‌లో మనసులో బాధని చెప్పుకొచ్చాడు. మొదట్లో ఎంతో ప్రశాంతంగా, శాంతియుతంగా మొదలైన ఈ విద్యార్థుల ఉద్యమం హింసాత్మకంగా మారడంతో విచారం వ్యక్తం చేశారు. ఆందోళనల్లో గాయపడిన యంగ్ స్టూడెంట్స్, వారి పేరెంట్స్ బాధను చూస్తుంటే మనసు కలచివేస్తోందని సానుభూతి తెలిపారు. క్వశ్చన్ పేపర్ లీక్ అనేది చిన్న విషయం కాదని, ఇది చాలా తీవ్రమైన సమస్య అని తెలిపారు. మన దేశ భవిష్యత్ ఐన పిల్లలంతా ఒకే తాటిపైకి వచ్చి తమ హక్కుల కోసం, మెరుగైన చదువు కోసం పోరాడుతుంటే చూడటానికి గర్వంగా ఉందన్నారు.
also read :చెన్నై జ్ఞాపకాలు నెమరువేసుకున్న చిరంజీవి.. ‘చెన్నై లవ్ స్టోరీ’ ఈవెంట్ హైలైట్స్!
కష్టపడి చదివి ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే తపన ఉన్న ఈనాటి విద్యార్థుల నిబద్ధతను, వారి ధైర్యాన్ని మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నానని సల్మాన్ చెప్పారు. అయితే ఈ పోరాటం పూర్తిగా విద్యార్థులకు, విద్యా వ్యవస్థకు మధ్య నడుస్తున్న అంశమని.. దీనిని ఏ రాజకీయ పార్టీ కూడా తమ సొంత లాభాల కోసం వాడుకోకూడదని సూచించారు.
ఈ పోరాటంలో విజయం సాధిస్తే ఆ క్రెడిట్ మొత్తం కష్టపడ్డ విద్యార్థులకే దక్కాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం కూడా ఈ విషయంలో పాజిటివ్‌గా స్పందించి స్టూడెంట్స్‌కి సపోర్ట్ చేస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. మన దేశంలో విద్య అనేది ఒక హాట్ ట్రెండ్‌లా, ఫ్యాషన్‌లా మారాలని, ప్రపంచ నలుమూలల నుంచి విదేశీయులు కూడా మన దేశానికి వచ్చి చదువుకునే రేంజ్‌లో ఇండియాను ఒక గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చాలని ఆయన పిలుపునిచ్చారు.
ఘాటుగా స్పందించిన ప్రదీప్ రంగనాథన్
మరోవైపు కోలీవుడ్ క్రేజీ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ కూడా ఈ సంఘటనపై చాలా ఘాటుగా స్పందించారు. ఢిల్లీలో న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడటాన్ని తీవ్రంగా ఖండించారు. “విద్యార్థులు అడిగే ప్రశ్నలకు లాఠీలతో సమాధానం చెప్పకండి” అంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
Don’t answer questions with lathis.#Neet
— Pradeep Ranganathan (@pradeeponelife) July 22, 2026
also read :అపోలోలో ఐసీయూలో ‘గబ్బర్ సింగ్’ రమేష్.. రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్ టీమ్!
ఇక వీరితో పాటు గా ఇప్పటికే మృణాల్ ఠాకూర్, నిఖిలా విమల్, ఈషా రెబ్బా, అదితీరావు హైదరీ, గౌరీ కిషన్, ప్రియా ప్రకాష్ వారియర్ తారలలతో పాటు కాష్ రాజ్, కిషోర్ కుమార్, జీనత్ అమన్, నసీరుద్దీన్ షా, రత్న పాఠక్ షావంటి సినీ ప్రముఖులు కూడా ఈ ఉద్యమానికి సపోర్ట్ చేసిన సంగతి తెల్సిందే.
ఏది ఏమైనా దేశ భవిష్యత్తు అయిన విద్యార్థుల తరుఫున సినీ ఇండస్ట్రీ మొత్తం ఇలా ఒక్కటిగా నిలబడటం ఈ ఉద్యమానికి మరింత బలం ఇస్తుందని చెప్పక్కర్లేదు.చూడాలి మరి మరింత ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ఉద్యమానికి సెంట్రల్ సర్కార్ ఎలా ఎండ్ కార్డ్ వేస్తుందో !