E-Paper
Advertisement

Bangladesh: బంగ్లాదేశ్ క్రికెట్ లో చీలిక‌…WWE రేంజ్ లో త‌న్నుకున్న ప్లేయ‌ర్లు, 6 గురికి తీవ్ర గాయాలు

Bangladesh: బంగ్లాదేశ్ క్రికెట్ లో చీలిక‌…WWE రేంజ్ లో త‌న్నుకున్న ప్లేయ‌ర్లు, 6 గురికి తీవ్ర గాయాలు
Advertisement

Bangladesh:  బంగ్లాదేశ్ క్రికెట్ ( Bangladesh Cricket) గురించి షాకింగ్ వీడియో బయటకు వచ్చింది. రెజ్లింగ్ తరహాలో బంగ్లాదేశ్ క్రికెటర్లు కొట్టుకున్నారు. ఈ సంఘటన ఆదివారం చోటు చేసుకోగా, ఇవాళ వీడియో వైరల్ గా మారింది. బంగ్లాదేశ్ లోని సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Celebrity Cricket League 2026) ఇటీవల ప్రారంభమైనట్లు చెబుతున్నారు. అయితే, ఈ టోర్నమెంట్ సందర్భంగా బౌండరీ గురించి గొడవ జరిగిందట. దీంతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. అందరూ 30 సంవత్సరాలకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో మహిళలు కూడా ఉన్నారట. ఈ సంఘటన జరగగానే టోర్నమెంట్ మొత్తాన్ని రద్దు చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

Also Read: BCCI-Bangladesh: బంగ్లాదేశ్ జ‌ట్టులో చీలిక‌, శ‌త్రువులో జ‌ట్టులో “ఇండియన్ ఏజెంట్”..త‌ల‌ప‌ట్టుకుంటోన్న BCB

బంగ్లాదేశ్ క్రికెట్ లో చీలిక.. తన్నుకున్న ప్లేయర్లు

Advertisement

బంగ్లాదేశ్ ( Bangladesh ) చాలా చిన్న దేశం. తెలంగాణ విస్తీర్ణం అంతా కూడా ఉండదు. అలాంటి బంగ్లాదేశ్ కు ఎక్కడ లేని పోకడలు ఉంటాయి. ఓవర్ గా రియాక్ట్ అవుతూ ఉంటారు అక్కడి బంగ్లాదేశ్ క్రికెటర్లు. ముఖ్యంగా మ్యాచ్ గెలిస్తే నాగిన్ డాన్స్ చేస్తూ, రచ్చ చేస్తూ ఉంటారు. అయితే అలాంటి బంగ్లాదేశ్ క్రికెట్లో ఆసక్తికర సంఘటన జరిగింది. బంగ్లాదేశ్ లో తాజాగా సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ప్లేయర్ల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. బౌండరీ విషయంలో రెండు జట్ల మధ్య తగాదా ఏర్పడినట్లు తెలుస్తోంది.

అయితే ఈ గొడవ జరిగిన నేపథ్యంలో మొత్తం ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వాళ్లందరినీ ఆసుపత్రికి తరలించారు. మొత్తం 30 సంవత్సరాలకు పైబడి ఉన్న ప్లేయర్లు ఈ టోర్నమెంట్ లో ఆడుతున్నారు. ఇందులో కొంతమంది లేడీస్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఒక్క బౌండరీ విషయంలో గొడవ జరగడం, కారణంగా WWE రేంజ్ లో క్రికెటర్లు తన్నుకున్నారు. దీంతో ఈ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ను రద్దు చేసింది యాజమాన్యం. ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇది చూసిన ఇండియన్ ఫాన్స్ దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఒక బౌండరీ కి ఇలా కొట్టుకోవడం ఏంట్రా ? మీకు కొంచమైనా బుద్ధి ఉందా ? అంటూ ర్యాగింగ్ చేస్తున్నారు.

ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య వార్ ?

Advertisement

బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్, ఇండియా మధ్య ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ముస్తాఫిజర్ రహమాన్ లాంటి ప్లేయర్లను కూడా పక్కకు పెట్టాలని బీసీసీఐ ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ఐపిఎల్ యాజమాన్యానికి అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది భారత్ క్రికెట్ నియంత్రణ మండలి. దీంతో ఐపీఎల్ 2026 ప్రసారాలపై బ్యాన్ విధించింది బంగ్లాదేశ్ సర్కార్. అలాగే టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో వేదికలు మార్చాలని కూడా కొత్త డిమాండ్ తెరపైకి తీసుకువచ్చింది బంగ్లాదేశ్.

Also Read: Lizelle Lee: 100 కేజీల బ‌రువు, ద‌క్షిణాఫ్రికాకు రిటైర్మెంట్‌..కానీ WPL 2026లో క‌ళ్లు చెదిరే క్యాచ్‌..ఎవ‌రీ లిజెల్ లీ

 

Related News

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

Big Stories

Advertisement
×