E-Paper
Advertisement

విజయ్ ‘ జన నాయగన్ ‘ ఫస్ట్ కలెక్షన్స్?.. అస్సలు ఊహించలేదు..!

విజయ్ ‘ జన నాయగన్ ‘ ఫస్ట్ కలెక్షన్స్?.. అస్సలు ఊహించలేదు..!
Advertisement

తమిళనాడు సీఎం విజయ్ దళపతి నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’.. గత ఏడాది షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రం ఈ ఏడాది జనవరిలో రిలీజ్ కావాల్సింది.. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ సినిమా వాయిదా పడుతూనే వస్తుంది.. ఇప్పటివరకు ఈ సినిమాకు ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. కానీ నిన్న అన్నిటిని తొలగించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయింది.. ఇప్పటివరకు ఈ సినిమా అప్డేట్స్ వల్ల వచ్చిన టాక్ సినిమా రిలీజ్ అయిన తర్వాత పెరిగిందని తెలుస్తుంది.. తెలుగు రాష్ట్రాల కన్నా తమిళనాడులో ఈ సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయింది.. అదేవిధంగా సినిమా భారీ అంచనా నడుమ 23న థియేటర్లలో రిలీజ్ అయింది.. ఫ్రీ రిలీజ్ బిజినెస్ లో అదరగొట్టిన ఈ సినిమా కలెక్షన్స్ ఎంత ఉండవచ్చు అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. మరి ఈ మూవీ కలెక్షన్లు ఎన్ని కోట్లు వసూల్ అయ్యాయో ఒకసారి తెలుసుకుందాం..

‘జన నాయగన్ ‘ ఫస్ట్ డే కలెక్షన్..?

గత ఏడు నెలలుగా ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల నిరీక్షణకు తెరపడింది.. నిన్న ఎట్టకేలకు సినిమా రిలీజ్ అయ్యింది.. అయితే ఈ మూవీకి భారీగా బిజినెస్ జరిగిన విషయం తెలిసిందే.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయ్యిందా? లేదా అని తెలుసుకొనేందుకు అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ ను అందుకున్న ఈ మూవీ కలెక్షన్స్ కు బాగానే వసూల్ అయ్యాయి. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికి కలెక్షన్ దాదాపుగా 100 కోట్లకు పైగా వసూల్ అయ్యినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వినిపిస్తుంది. రూ. 28.71 కోట్లకు పైగా నెట్ రాబట్టిందని టాక్.. తమిళంలో అత్యధిక వసూళ్లను సాధించిందని తెలుస్తుంది. తెలుగు లో 29 లక్షలు వసూళ్లను అందుకోగా , అలాగే 73 లక్షలు హిందీలో వసూళ్లను అందుకుంది. మొత్తం ఇండియా వైడ్ దాదాపు రూ.50 కోట్లు వసూల్ చేసినట్లు టాక్.. ఇక వరల్డ్ వైడ్ గా దాదాపుగా 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిందని సమాచారం.. ఈ కలెక్షన్స్ పై ఇప్పటివరకు ఈ చిత్ర యూనిట్ ఎక్కడ అధికారికంగా ప్రకటించలేదు.. మరి మొదటి రోజు ఎన్ని కోట్లు వసూలు చేసిందో ఒక క్లారిటీ రావాలి అంటే చిత్ర యూనిట్ అనౌన్స్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే..

ఈ మూవీ బడ్జెట్ & టార్గెట్..

Advertisement

దర్శకుడు హెచ్. వినోద్ తెరకెక్కించిన ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించారు. క్రేజీ హీరోయిన్ మమత బైజు ఇందులో కీలక పాత్రలో నటించింది. బాబీ డియోల్, ప్రకాశ్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియమణి, సునీల్, రేవతి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ భారీ స్థాయిలో నిర్మించారు.. ఈ మూవీని దాదాపు 500 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించినట్లు సమాచారం.. నటీనటుల రెమ్యునరేషన్లు, భారీ యాక్షన్ ఎపిసోడ్లు, విదేశాల షూటింగ్, సాంకేతిక నిపుణుల ఖర్చులు, ప్రమోషన్స్ అన్ని కలిపి 500 కోట్లు అయినట్లు తెలుస్తుంది. విజయ్ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ ఇది.. ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా దేశాల్లో విడుదల చేస్తున్నారు. దాదాపు 8000 స్క్రీన్లలో సినిమాను ప్రదర్శించారు.. మొదటి రోజు కలెక్షన్స్ ఊరటకలిగించాయి. సుమారు 230 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.. మరి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ అవుతుందా? లేదా చూడాలి..

Also Read :రమ్య పసుపులేటి బ్యాగ్రౌండ్.. నెలకు ఎంత సంపాదిస్తుందంటే..?

Related News

Ramya Pasupuleti : రమ్య పసుపులేటి బ్యాగ్రౌండ్.. నెలకు ఎంత సంపాదిస్తుందంటే..?

Theater Movies : ఇవాళ థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు.. ఆ ఒక్కటి డోంట్ మిస్..

చెన్నై లవ్ స్టోరీ ట్విట్టర్ రివ్యూ.. రొమాంటిక్ డ్రామాతో కిరణ్-గౌరీ జంట మెప్పించిందా?

నాతో పనిచేసిన వాళ్లందరూ మంత్రులయ్యారు – బాబీ డియోల్ ఊహించని కామెంట్స్!

1000 ఇంజెక్షన్లు.. 5సార్లు ఐవీఎఫ్.. నరకం అనుభవించానంటున్న ప్రముఖ నటి!

బాలకృష్ణ మోకాలికి సర్జరీ పూర్తి.. బులెటిన్ విడుదల చేసిన ఏఐజీ బృందం!

రాజకీయాల్లో తిట్లు తినడం కంటే సినిమాలే బెటర్.. రూటు మార్చిన పోసాని కృష్ణమురళి!

Big Stories

Advertisement
×