E-Paper
Advertisement

OTT Movie: కేసులు లేని డిటెక్టివ్… కుక్క కేసుతో యాక్షన్ షురూ … ఓటీటీలోకి మలయాళ హిట్ మూవీ

OTT Movie: కేసులు లేని డిటెక్టివ్… కుక్క కేసుతో యాక్షన్ షురూ … ఓటీటీలోకి మలయాళ హిట్ మూవీ
Advertisement

OTT Movie : ఓటిటిలోకి మరో యాక్షన్ కామెడీ సినిమా వచ్చేస్తోంది. అనుపమ పరమేశ్వరన్ నటించిన ‘ది పెట్ డిటెక్టివ్’ థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. నెలరోజుల వ్యవధిలోనే డిజిటిల్ కి సిద్ధమైపోయింది. ఈ మలయాళ కామెడీ థ్రిల్లర్ సినిమా, ఆడియన్స్ కు పక్కా ఎంటర్టైనర్. ఒక
డిటెక్టివ్ చుట్టూ తిరిగే ఈ కథ, కుక్క మిస్సింగ్ కేసుతో మొదలవుతుంది. క్లైమాక్స్ వరకు ఆసక్తికరంగా సాగే ఈ సినిమా ఏ ఒటిటిలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …

జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్

‘ది పెట్ డిటెక్టివ్’ మలయాళ కామెడీ థ్రిల్లర్ ఫ్యాన్స్‌కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. ప్రనీష్ విజయన్ డైరెక్షన్ లో షరాఫుద్దీన్, అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్స్ లో నటించారు. 2025 అక్టోబర్ 16న థియటర్స్‌లో విడుదలైన ఈ సినిమా, నవంబర్ 28 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా ఐఎండిబిలో 8.5/10 రేటింగ్ ని కూడా పొందింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

టోనీ అనే వ్యక్తి కైకేయి అనే అమ్మాయిని లవ్ చేస్తుంటాడు. ఆమె ఒక రిచ్ బిజినెస్‌మెన్ కూతురు. అయితే అతని తండ్రి ముందు నువ్వు ఏదో ఒకటి సాధించి చూపించు, ఆ తరువాతనే పెళ్లి అని కండిషన్ పెడతాడు. టోనీ ప్రైవేట్ ప్రైవేట్ డిటెక్టివ్ గా ఉంటాడు. ఎలాగైనా పెద్ద కేసు సాల్వ్ చేసి పేరు సంపాదించాలనుకుంటాడు. కానీ అతని దగ్గరకు పెద్దగా కేసులు రావు. మొదటి కేస్ ఒక పెట్ డాగ్ మిస్సింగ్ కేసు వస్తుంది. నేను పెట్ డిటెక్టివ్‌నా? అని టోనీ నవ్వుకుంటాడు. ఆ డాగ్ కూడా ఒక రిచ్ లేడీది కావడంతో కేస్ తీసుకుంటాడు. టోనీ దాన్ని వెతుకుతూ వెళ్తే, ఆ డాగ్ ఒక ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ గ్యాంగ్ చేతిలో ఉందని తెలుస్తుంది.  ఈ గ్యాంగ్ ఎగ్జాటిక్ ఫిష్, పక్షులు, వైల్డ్ యానిమల్స్, రేర్ బ్రీడ్ డాగ్స్ దొంగతనం చేసి బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతుంది. ఇందులో మెక్సికన్ మాఫియా డాన్ కూడా ఉంటాడు.

Read Also : మరదలిపై బావ కన్ను … డబ్బు కోసం గలీజు పని… సస్పెన్స్‌తో చెమటలు పట్టించే సినిమా

Advertisement

టోనీ ఇప్పుడు సింపుల్ పెట్ కేస్‌ని ఇంటర్నేషనల్ క్రైమ్ కేస్‌గా మార్చేస్తాడు. ఇతనితో పాటు ఇతని ఫ్రెండ్స్, ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా స్మగ్లర్ల వేటలో పడతారు. కేస్ ముందుకు వెళ్తుంటే టోనీని గ్యాంగ్ టార్గెట్ చేస్తుంది. ఇతన్ని కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ టోనీ మార్షల్ ఆర్ట్స్, కామెడీ టైమింగ్‌తో ఎస్కేప్ అవుతాడు. ఇంతలో మరో ట్విస్ట్ వస్తుంది. ఒక చిన్న పిల్లవాడు కూడా మిస్సింగ్ అవుతాడు, అది కూడా ఇదే గ్యాంగ్ చేతిలో ఉన్నాడని తెలుస్తుంది. ఇక టోనీ ఆ పిల్లవాడ్ని, ఆ డాగ్‌ని కాపాడాలని సీరియస్ గా డిసైడ్ అవుతాడు. టోనీ కుక్కని కాపాడతాడా ? ప్రియురాలిని పెళ్లి చేసుకుంటాడా ? టీమ్ స్మగ్లర్లని పెట్టుకుంటుందా ? అనే విషయాలను, ఈ యాక్షన్ కామెడీ సినిమాని చూసి తెలుసుకోండి.

 

 

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×