E-Paper
Advertisement

‘పెద్ది’ టీమ్‌కు షాకిచ్చిన జాన్వీ కపూర్…అచ్చియమ్మ నిజంగానే హర్ట్ అయిందా?

‘పెద్ది’ టీమ్‌కు షాకిచ్చిన జాన్వీ కపూర్…అచ్చియమ్మ నిజంగానే హర్ట్ అయిందా?
Advertisement

Janhvi Controversy : ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద తొలిరోజే ఏకంగా రూ.135 కోట్ల కలెక్షన్లు రాబట్టి సరికొత్త రికార్డుల సునామీ సృష్టిస్తోంది.సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో మొదటి నుంచీ అంచనాలు ఆకాశాన్ని తాకాయి. నిన్న విడుదలైన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించి చిత్ర యూనిట్‌కు బూస్టప్ ఇచ్చింది అయితే, సినిమా సూపర్ హిట్ అయిందన్న ఆనందంలో ఉండగానే , సోషల్ మీడియా వేదికగా ఒక ఊహించని వివాదం తెరపైకి వచ్చి హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా  నటించిన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, ఇన్‌స్టాగ్రామ్‌లో సినిమాకు వ్యతిరేకంగా వచ్చిన ఒక నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

డీగ్లామరైజ్డ్ యువతి పాత్రలో కనిపించిన జాన్వీ కపూర్

గతంలో దేవర చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన జాన్వీ కపూర్, ఈ చిత్రంలో ‘అచ్చియమ్మ’ అనే ఒక డీగ్లామరైజ్డ్ పల్లెటూరి యువతి పాత్రలో కనిపించి మెప్పించింది. కానీ, సినిమాలో ఆమె పాత్రకు ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత దక్కలేదంటూ నిన్నటి నుంచే సోషల్ మీడియాలో వార్తలు తెగ సర్క్యులేట్ అవుతున్నాయి.

Advertisement

ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పాపులర్ పేజీలో ‘పెద్ది.. భారతీయ సినిమా చరిత్రలో ఒక స్టార్ హీరోయిన్‌కు జరిగిన అత్యంత అవమానం’ అంటూ ఒక ఘాటైన పోస్ట్ ప్రత్యక్షమైంది. రామ్ చరణ్ క్యారెక్టర్ ఎలివేషన్స్ కోసం హీరోయిన్ పాత్రను కేవలం పాటలకే పరిమితం చేశారంటూ ఆ పోస్ట్‌లో విమర్శించారు. అయితే, ఎవరూ ఊహించని విధంగా స్వయంగా జాన్వీ కపూర్ ఆ నెగెటివ్ పోస్ట్‌ను లైక్ చేయడం ఒక్కసారిగా కలకలం రేపింది.

నెగెటివ్ పోస్ట్‌ను లైక్ చేసిందంటూ ట్రోల్స్ 

తన పాత్రకు సరైన స్కోప్ దక్కలేదన్న తీవ్ర అసంతృప్తితోనే జాన్వీ ఈ విధంగా తన నిరసనను వ్యక్తం చేసిందని, అందుకే ఆ నెగెటివ్ పోస్ట్‌ను లైక్ చేసిందంటూ నెటిజన్లు రకరకాలుగా విశ్లేషించడం మొదలుపెట్టారు. అచ్చియమ్మ నిజంగానే తన క్యారెక్టర్ విషయంలో హర్ట్ అయిందా అనే అనుమానాలు బలపడ్డాయి. అయితే, ఈ వ్యవహారం పెద్ద వివాదంగా మారుతోందని, మెగా అభిమానుల నుంచి ట్రోల్స్ వచ్చే అవకాశం ఉందని గ్రహించిన జాన్వీ కపూర్ టీమ్ వెంటనే అప్రమత్తమైంది. వివాదం ముదరకుండా ఉండేందుకు ఆమె వెంటనే ఆ పోస్ట్‌ను అన్‌లైక్ చేసింది. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆమె అన్‌లైక్ చేయడానికి ముందే తెలివిగా కొందరు నెటిజన్లు, ఆ లైక్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌లను తీసి ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వైరల్ చేసేశారు.

అచ్చియమ్మే స్వయంగా స్పందించాలి 

Advertisement

మరోవైపు, ఈ వ్యవహారంపై జాన్వీ కపూర్ సపోర్టర్స్ మరో రకంగా రియాక్ట్ అవుతున్నారు. సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నప్పుడు పొరపాటున (Accidental Like) లైక్ బటన్ నొక్కి ఉంటుందని, అంతేకానీ మూవీ టీమ్ పై ఆమెకు ఎలాంటి అసంతృప్తి లేదన్నది వారి వాదన.గతంలో కూడా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఇలాంటి పొరపాట్లు చేసి, ఆ తర్వాత సరిదిద్దుకున్న సందర్భాలు ఉన్నాయని రిమైండ్ చేస్తున్నారు.

ఏది ఏమైనా, ఒకవైపు బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ కలెక్షన్ల సునామీ స్ప్రుష్టిస్తుంటే,మరోవైపు హీరోయిన్ లైక్ వివాదం ఈ సక్సెస్ సెలబ్రేషన్స్‌పై నెగెటివ్ ఇంపాక్ట్ చూపేలా కనిపిస్తుంది.మరి నిజంగానే జాన్వీ కపూర్ తన పాత్ర లెంత్ పై డిసప్పాయింట్ అయిందా లేక ఇది అనుకోకుండా జరిగిన పొరపాటా అన్నది స్వయంగా ఆ అచ్చియమ్మే స్పందిస్తే కాని తెల్సిసేలా లేదు.

also read :‘దూత 2’ షురూ.. కింగ్ నాగార్జున క్లాప్‌తో గ్రాండ్‌గా ప్రారంభమైన నాగచైతన్య మోస్ట్ అవేటెడ్ సీక్వెల్

Related News

‘ఒడిస్సీ’ లాంటి ప్లానింగ్ మనకు సాధ్యమేనా నాగ్?

నోరు జారితే అంతే.. నెక్స్ట్ స్కిట్‌లో నో ఛాన్స్! జబర్దస్త్ సీక్రెట్ లీక్ చేసిన నటి సత్యశ్రీ

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

Big Stories

Advertisement
×