Jani Master: జానీ మాస్టర్ ఇటీవల తరచు వార్తలు నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈయన కొరియోగ్రఫీ అందించిన పాటలు సూపర్ హిట్ కావడంతో ఇప్పటికే జానీ మాస్టర్ ఎన్నో అవార్డులను పురస్కారాలను కూడా సొంతం చేసుకున్నారు. ఇటీవల ఈయన నేషనల్ అవార్డుకు కూడా ఎంపికైన సంగతి తెలిసిందే. ఇలా నేషనల్ అవార్డులను ప్రకటించిన తర్వాత జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ కావడంతో నేషనల్ అవార్డు వెనక్కి వెళ్ళిపోయింది.
జానీ మాస్టర్ ఈ వ్యవహారం కారణంగా తరచు వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే జైలు నుంచి బయటకు వచ్చిన ఈయన ప్రస్తుతం కెరియర్ పరంగా స్టార్ హీరోల సినిమాలకు పని చేస్తూ బిజీగా ఉన్నారు. ఇకపోతే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉండే జానీ మాస్టర్ తాజాగా సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఇప్పటివరకు ఈయన కొరియోగ్రఫీ అందించిన పాటలు మంచి విజయం సాధించడంతో జానీ మాస్టర్ కు చిత్తారా మ్యూజిక్ అవార్డ్స్ 2025(Chitra Music Awards 2025) లో భాగంగా క్రియేటివ్ కొరియోగ్రాఫర్ (creative choreographer )గా అవార్డును అందించింది. ఇక ఈ విషయాన్ని ఈయన సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ సంతోషంగా వ్యక్తం చేశారు.
ఈ అవార్డుకు తనని ఎంపిక చేసినందుకు చిత్తారా మీడియాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. నాకు ఇలా అవకాశాలు కల్పించిన నటీనటులకు, దర్శక నిర్మాతలకు అలాగే టెక్నీషియన్లు ప్రేక్షకులు కూడా వారి పూర్తి మద్దతును తెలియజేస్తున్నందుకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. ఇలా మీరు అందిస్తున్న ఆదరాభిమానాలతో తాను భవిష్యత్తులో ఇంకా మంచి కొరియోగ్రఫీ అందిస్తానని ఈ సందర్భంగా ఈయన తన సంతోషాన్ని తెలియజేశారు. ఇలా జానీ మాస్టర్ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకోవడంతో అభిమానులు కూడా ఈయనకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు.
Elated to receive the CREATIVE CHOREOGRAPHER Award for all the superhit chartbuster songs I did till date 😇 Thank you @Chittaramedia for the honour 🤝
I'm forever grateful to all the Actors, Directors, Technicians, Producers, and the Audience for their constant support,… pic.twitter.com/eZp8oveHnT
— Jani Master (@AlwaysJani) November 26, 2025
ఇలా జానీ మాస్టర్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈయనకు స్టార్ హీరోల సినిమాలలో కొరియోగ్రాఫర్ గా చేసే అవకాశాలను అందుకోవడమే కాకుండా ఇలా అవార్డులు కూడా వస్తున్న నేపథ్యంలో జానీ మాస్టర్ కు ఇకపై అన్ని మంచి రోజులే అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయితే జానీ మాస్టర్ కు స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు వస్తున్న నేపథ్యంలో ఈయనకు అవకాశాలు ఇవ్వడం గురించి కూడా పలువురు తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన వ్యక్తికి తిరిగి ఇండస్ట్రీలో అవకాశాలు ఇవ్వడం అంటే ఆయన తప్పుని ప్రోత్సహించినట్టే అంటూ మరికొంతమంది విమర్శలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: Sreeleela: వామ్మో వాచ్ మెన్ తో ఈ పనులేంటీ శ్రీలీల… వీడియో వైరల్!