geyser safety tips winter: చలికాలంలో గీజర్ల వాడకం విపరీతంగా పెరిగిపోతుంది. ఉదయాన్నే లేచి వేడి వేడి నీళ్లతో స్నానం చేయడం ఎవరికైనా.. హాయిగా అనిపిస్తుంది. అయితే.. ఈ సౌకర్యం వెనక పెద్ద ప్రమాదమే.. పొంచి ఉంటుందని చాలా మంది గ్రహించలేకపోతున్నారు. ముఖ్యంగా సరైన వెంటిలేషన్ లేని బాత్రూమ్‌లలో గీజర్లు వాడటం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతుంటాయి. అందుకే గాడ్జెట్ల పట్ల అప్రమత్తత చాలా అవసరం. ఇంతకీ గీజర్ వాడేటప్పుడు చాలా మంది చేసే పొరపాట్లు ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
చాలా మంది చలి గాలి లోపలికి.. రాకూడదని బాత్రూమ్ కిటికీలు, తలుపులు పూర్తిగా మూసివేసి.. గీజర్ ఆన్ చేస్తుంటారు. ముఖ్యంగా.. గ్యాస్ గీజర్లను వాడేటప్పుడు ఇది అత్యంత ప్రాణాంతకం. గ్యాస్ గీజర్ వెలువరించే కార్బన్ మోనాక్సైడ్ అనే రంగు, వాసన లేని.. వాయువు గదిలోని ఆక్సిజన్‌ను పూర్తిగా హరిస్తుంది. దీని వల్ల ఊపి రాడక నిమిషాల్లోనే స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి బాత్రూమ్‌లో.. తప్పని సరిగా ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదా తగిన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి.
కొంత మంది నీళ్లు వేడిగా ఉండాలనే.. ఉద్దేశంతో గీజర్‌ను గంటల తరబడి ఆన్ చేసి.. అలాగే వదిలేస్తుంటారు. దీని వల్ల వాటర్ హీటర్ పైభాగంలో.. విపరీతమైన పీడనం పెరిగి ట్యాంక్ పేలిపోయే ప్రమాదం ఉంది. మోడర్న్ ఆటోమేటిక్.. గీజర్లు నీరు వేడెక్కిన తర్వాత ఆటో-కట్ అవుతాయి. అయినప్పటికీ..సేఫ్టీ కోసం స్నానం చేసే.. ముందు గీజర్ స్విచ్ ఆఫ్ చేయడం ఎప్పుడూ బెస్ట్.
సంవత్సరాల తరబడి ఎలాంటి సర్వీసింగ్ చేయించకుండా.. గీజర్లను వాడటం వల్ల అందులోని ఇంటర్నల్ కాయిల్స్ దెబ్బతింటాయి. ఎలక్ట్రిక్ గీజర్లలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి కరెంట్ షాక్ తగిలే అవకాశాలు ఎక్కువ. చలికాలం ప్రారంభమయ్యే ముందే అర్హత కలిగిన టెక్నీషియన్‌తో గీజర్ థర్మోస్టాట్, వాల్వ్‌లు , వైరింగ్‌ను చెక్ చేయించడం చాలా ముఖ్యం.
యి.
ఇన్‌స్టంట్ ఎలక్ట్రిక్ గీజర్లు: చిన్న కుటుంబాలకు లేదా కిచెన్ అవసరాలకు ఇవి అనుకూలంగా ఉంటాయి. వీటి ధరలు సుమారు రూ. 3,500 నుంచి రూ. 7,000 వరకు ఉంటాయి.
స్టోరేజ్ గీజర్లు : పెద్ద కుటుంబాల కోసం లీటర్ల సామర్థ్యాన్ని బట్టి ఇవి లభిస్తాయి. వీటి ధరలు రూ. 6,000 నుంచి రూ. 15,000 లేదా అంతకంటే.. ఎక్కువ ధరలో బ్రాండ్‌ను బట్టి అందుబాటులో ఉంటాయి.
గ్యాస్ గీజర్లు: ఇవి తక్కువ కరెంట్ ఖర్చుతో వేగంగా నీటిని వేడి చేస్తాయి. మార్కెట్లో వీటి ధరలు రూ. 4,000 నుంచి రూ. 8,000 మధ్య ఉంటాయి. అయితే వీటిని అమర్చేటప్పుడు నిపుణుల సలహా తీసుకోవడం తప్పని సరి.
Also Read: అమెజాన్ సేల్..65 ఇంచుల స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్లు
1.బాత్రూమ్‌లోకి వెళ్లే ముందే గీజర్ ఆన్ చేసి, నీరు వేడెక్కిన వెంటనే స్విచ్ ఆఫ్ చేయాలి. కరెంట్ ఆన్‌లో ఉంచి స్నానం చేయడం ఎప్పుడూ మంచిది కాదు.
2.సేఫ్టీ వాల్వ్ సక్రమంగా పని చేస్తోందో.. లేదో ఎప్పుడూ చెక్ చేసుకోవాలి.
3.వాటర్ లీకేజ్ లేదా కరెంట్ షాక్ కొంచెం అనిపించినా వెంటనే వాడటం ఆపివేయాలి.
చలి కాలంలో వేడి నీరు ఎంత అవసరమో.. మన ప్రాణాల రక్షణ అంతకంటే ముఖ్యం. కొద్ది పాటి అజాగ్రత్త పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుంది. కాబట్టి పైన పేర్కొన్న జాగ్రత్తలను పాటిస్తూ..మీ కుటుంబాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి.