E-Paper
Advertisement

విజయ్ వర్మ పక్కన ఆ బ్యూటీ ఎవరు? తమన్నాతో బ్రేకప్ తర్వాత కొత్త లవ్ స్టోరీ షురూ!

విజయ్ వర్మ పక్కన ఆ బ్యూటీ ఎవరు? తమన్నాతో బ్రేకప్ తర్వాత కొత్త లవ్ స్టోరీ షురూ!
Advertisement

Vijay Varma:సినీ ఇండస్ట్రీలో లవ్ స్టోరీలు ఎంత కామనో, అవి బ్రేకప్ అవడం కూడా అంతే కామన్. ఇది అందరికి తెల్సిందే.కానీ బ్రేకప్ అయిన వెంటనే మరో లవ్ స్టోరీ షురూ చేయడం మరీ కామన్ అంటూ మరోసారి ప్రూవ్ చేస్తున్నాడు బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ విజయ్ వర్మ. అవును …ఆమధ్య మిల్కీ బ్యూటీ తమన్నాతో ప్రేమ పెటాకులయ్యాక సింగిల్ గా ఉన్నాడనుకున్న విజయ్ వర్మ ఇపుడు మరో ప్రేమాయణానికి తెరతీశాడన్న వార్తలు మీడియాలో హట్ టాపిక్ అయిపోయాయి.

యంగ్ హీరోయిన్ తో చెట్టాపట్టాల్

Advertisement

విషయంలోకి వెళ్తే ఏప్రిల్ 21వ తేదీ రాత్రి ముంబైలోని బాంద్రాలోవిజయ్ వర్మ ఒక యంగ్ హీరోయిన్ తో చెట్టాపట్టాలేసుకొని కనిపించి పెద్ద షాకే ఇచ్చాడు.అయితే ఎవరికీ తెలీకుండా పాపులర్ రెస్టారెంట్ లో డిన్నర్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవాలని ప్లాన్ వేసిన ఆ జోడీ ఎట్టకేలకి కెమెరాల కంట పడటంతో ఒక్కసారిగా విజయ్ వర్మ వెంట ఉన్న ఆ అమ్మడు ఎవరా అంటూ క్యూరియస్ గా ఆరాలు తీస్తున్నారు నెటిజన్లు.

జవాన్’ సినిమాలో మెప్పించిన ఆలియా ఖురేషి

Advertisement

అయితే విజయ్ వర్మ పక్కన కనిపించిన ఆ ముద్దుగుమ్మ జవాన్’ సినిమాలో తన నటనతో మెప్పించిన ఆలియా ఖురేషి అని బీ టౌన్ లో వినిపిస్తున్న టాక్. ఆలియా ఖురేషి విషయానికి వస్తే ముంబైలోని ధీరూభాయ్ అంబానీ స్కూల్‌లో చదువుకున్నఆలియా, కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి పట్టా పొందిందని సమాచారం.అంతే కాదండోయ్ షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ సినిమాలో గర్ల్ గ్యాంగ్‌లో ఒకరైన ‘జాన్వి’ పాత్రలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది కూడా.ఇక ఆలియా నటిగానే ఆగిపోకుండా
‘ఝల్లీ’ లాంటి పాటలతో సింగర్‌గానూ తన మార్క్ చూపించడం విశేషం.ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఝాలివర్స్’ పేరుతో ఈమెకు లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారంటే నెట్టింట్లో ఈ అమ్మడికి ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో అర్థమైపోతుంది.

ALSO READ:సింగరా లేక డబ్బింగ్ ఆర్టిస్టా? లైవ్ కాన్సర్ట్‌లో అడ్డంగా దొరికిపోయిన దురంధర్ సింగర్ ..వీడియో వైరల్ !

లస్ట్ స్టోరీస్ 2′ సిరీస్ చేస్తున్న టైమ్ లో ప్రేమలో

ఇక విజయ్ వర్మ- తమన్నాల విషయానికి వస్తే జూన్ 2023లో ‘లస్ట్ స్టోరీస్ 2’ సిరీస్ చేస్తున్న టైమ్ లో ప్రేమలో పడింది ఈ జోడీ. ఇక అప్పటి నుండి ఎక్కడ పడితే అక్కడ కనిపించిన ఈ ప్రేమ పక్షులు గత ఏడాది నవంబర్ నుండి క్రమంగా కలిసి కనిపించడం తగ్గడంతో ఇద్దరి మధ్య ఎదో జరిగిందన్న గుసగుసలు మొదలయ్యాయ్. ఇక అడపా దడపా ఇన్ డైరెక్ట్ గా పోస్ట్ లతో హింట్ ఇచ్చారు కూడా. మొత్తానికి విజయ్ వర్మ ఇపుడు ఆలియా ఖురేషితో అడ్డంగా దొరికిపోవడంతో తమన్నాని సైడ్ చేసేశాడన్న క్లారిటీ వచ్చేసింది.అయితే మార్చి 2026లో ఒక ప్రైవేట్ ఈవెంట్‌లో విజయ్ వర్మ పక్కన ఆలియా ఖురేషి కనిపించినా పెద్దగా పట్టించుకోలేదెవరు.కానీ ఇప్పుడు ఏప్రిల్ 21 అర్ధరాత్రి ఈ జోడీ బాంద్రాలో డిన్నర్ డేట్ చేస్తూ అడ్డంగా దొరికిపోవడంతో విజయ్ వర్మ మరో ప్రేమాయణానికి శ్రీకారం చుట్టేశాడు అంటూ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు నెటిజన్లు.చూడాలి మరి మీడియాకి దొరికిపోయిన ఈ జోడీ తమ రిలేషన్ పై ఎలాంటి కన్ఫర్మేషన్ ఇస్తుందో !

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×