E-Paper
Advertisement

రోడ్డు మీద కొట్టు.. పదివేలు కోట్టు.. గద్వాల్ జిల్లా ఫుట్ పాత్‌లపై వసూళ్ల దందా..!

రోడ్డు మీద కొట్టు.. పదివేలు కోట్టు.. గద్వాల్ జిల్లా ఫుట్ పాత్‌లపై వసూళ్ల దందా..!
Advertisement

Footpaths: స్వేచ్ఛ బ్యూరో: జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఫుట్ పాత్ రోడ్డు అక్రమణ ఇష్టారాజ్యంగా నడుస్తోంది. జిల్లా కేంద్రమైన గద్వాల పట్టణంలో విశాలమైన రోడ్లు నేడు ఇరుకుగా మారి తరుచు ప్రమాదాలకు నిలయాలుగా మారింది. గద్వాల పట్టణంలో రహదారికి ఇరువైపుల పాదాచారుల కోసం వదిలిన ఖాళీ స్థలాలను షాపు యజమానులు, చిరు వ్యాపారులు, తోపుడు‌బండ్ల వ్యాపారులు అక్రమించుకుని తమ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. గద్వాల పట్టణంలో వాహనాల రాకపోకలు అధికంగా ఉండటంతో గతంలోనే పాదచారుల కోసం ఫుట్‌పాత్‌లను నిర్మించేందుకు ఖాళీ స్థలాలను వదిలారు. కానీ ఎక్కడ‌ ప్రత్యేకమైన పుట్ పాత్ లు నిర్మించలేదు. ఇదే అదునుగా చూసుకుని వాటిని కూడా కొంతమంది ఆక్రమించుకొని దర్జాగా చిన్నచిన్న షాపులు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాదచారులకు దారేది అన్న సందేహం కలుగుతోంది.

ఫుట్‌పాత్‌లను ఆక్రమించి..

పాదచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్‌పాత్‌లపై ఎలాంటి ఆక్రమణలు లేకుండా పాదచారులు రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకునే అంశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు వైఫల్యం చెందారన్న విమర్శలున్నాయి. ఫుట్‌పాత్‌లను ఆక్రమించి, దుకాణాలను ఏర్పాటు చేయడమేంటని ప్రశ్నించిన వారికి దర్జాగా పెడ్తాం.. ఏం చేసుకుంటారో చేస్కోండని అంటున్నారని కొందరు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, నాయకులు అండదం డలతోనే ఫుట్‌పాత్‌లపై దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోడ్డుకిరువైపులా ఉన్న ఖాళీ స్థలాలను ఆక్రమించి, చివరికి పర్మినెంట్‌ స్ట్రక్చర్‌తో దుకాణా లను ఏర్పాటు చేసుకున్న సందర్భాలున్నాయి. ఈ నిర్మాణాలన్నీ ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలిగేవిధంగా ఉన్నా, నేటి వరకు ఆ దుకాణాలను తొలగించే ప్ర యత్నాలను అధికారులు చేపట్టకపోవడంతో ఆడిం దేఆటగా మారింది.

పాదాచారుల కోసం ఏర్పాటు..

Advertisement

గద్వాల మున్సిపాలిటి పరిధిలో ఎప్పుడు రద్దీగా ఉండే రాజీవ్ మార్గ్, రాజవీధి,‌‌ పాత కూరగాయల‌ మార్కెట్, పాత బస్టాండ్, కొత్త బస్టాండ్, కృష్ణవేణి చౌరస్తా, భీంనగర్, అంబేద్కర్ చౌరస్తాలలో వ్యాపారులు తమ దుకాణాల పేరు మీద పెద్ద పెద్ద ప్లెక్సీ బోర్డులను ఏర్పాటు చేయడంతో వాహనదారులు, పాదాచారుల రాకపోకలకు ఇబ్బంది నెలకొంది. కొన్ని సందర్బాలలో పాదాచారులు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. కొత్త బస్టాండ్, భీంనగర్ లాంటి రద్దీ ప్రాంతాలలో పాదాచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్ పాత్ లను చోటామోటా లీడర్లు ఆక్రమించుకొని వ్యాపారాలు నిర్వహిస్తు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా ఫుట్‌పాత్‌లపై వెలిసిన షాపులను తొలగించాలని, పాదచారుల కోసం నిర్మించిన ఫుట్‌పాత్‌ను కేవలం పాదచారులే వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Also read: 30 ఏళ్ల ట్రాఫిక్ కష్టాలకు ఇక చెక్ కానీ..?

రోడ్లపైనే వాహనాలు పార్కింగ్, వ్యాపారాలు..

Advertisement

గద్వాలలో రాజవీధి, గాంధీచౌక్, పాతబస్టాండ్, కొత్తబస్టాండ్, కృష్ణవేణి చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా, రాజీవ్ మార్గ్ తదితర మార్గాలలో రోడ్డుకు ఇరువైపులా పాదచారుల కొరకు వదిలేసిన ఖాళీ ప్రదేశాలు అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల ఇష్టారాజ్యంగా రోడ్లపై వ్యాపారాలు నిర్వహిస్తుండటంతో రహదారిపై అక్రమంగా వాహనాలు పార్కింగ్ చేయడం, ఫుట్ పాత్ లపై వ్యాపారస్తుల బోర్డు లు పెట్టడం వల్ల రోడ్లపై వెళ్లే వాహనాలు నిలిచిపోయి, ట్రాఫిక్ సమస్యగా మారుతోంది దీంతో అటుగా వెళ్లే పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంత జరుగుతున్న వారిపై అధికారుల చర్యలు తూతూమంత్రంగా ఉంటున్నాయి.

ఇరుకుగా మారిన భీంనగర్ రోడ్డు

కృష్ణవేణి చౌరస్తా నుంచి నదీ అగ్రహారం వైపునకు వెళ్లే భీంనగర్ రోడ్డు మార్గం చాలా విశాలంగా ఉండేది. విశాలమైన రోడ్లను వ్యాపారులు అక్రమించుకోవడంతో చాలా ఇరుకుగా మారింది. భీంనగర్ లో డ్రైనేజి కాలువను సైతం అక్రమించుకుని చ్యాపారాలు కొనసాగిస్తున్నారు. షాపుల యజమానులు నిబంధనలకు విరుద్దంగా రోడ్డును అక్రమించుకుని వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. రోడ్లను అక్రమించుకోవడంతో వాహనాలు రోడ్లపైనే పార్కింగ్ చేస్తున్నారు.

Also Read: స్మోక్ చేస్తూ.. డ్రింక్ చేస్తూ.. చాక్లెట్లు తింటూ.. 122 ఏళ్లు బతికేసిన బామ్మ!

పుట్ పాత్ @రూ.10వేలు

గద్వాల పట్టణం కృష్ణవేణి చౌరస్తా నుంచి నదీ అగ్రహారం రోడ్డు వరకు‌‌ హోటళ్లు, పానీపూరి, సమోసా, టీ స్టాళ్లు, తదితర తిను బండాదాలకు అడ్డగా భీంనగర్ మారింది. భీంనగర్ అడ్డలో ఏదైన చిరువ్యాపారం పెడితే వ్యాపారం లాభాదాయకంగా ఉండటంతో వ్యాపారులు సైతం భీంనగర్ లో వ్యాపారాలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. భీంనగర్ లో రొడ్డుకు ఇరువైపుల పాదాచారుల కొరకు ఏర్పాటు చేసిన పుట్ పాత్ స్థలాలను వ్యాపారస్తులు దర్జాగా కబ్జాచేస్తున్నారు. చిన్న చిన్న రేకుల షెడ్డు ఏర్పాటు చేసి రూ.5-రూ.10వేల వరకు అద్దెకు ఇస్తున్నారు.‌ అలాగే వాణిజ్య షాపుల ముందున్న పుట్ పాత్ ల రోడ్లను సైతం అక్రమించుకుని చిరువ్యాపారస్తులకు రూ.10,వేలకు అద్దెకు ఇచ్చిన ఘటనలు‌ అనేకం ఉన్నాయి. భీంనగర్ లో ఓ‌‌ మటన్ సెంటర్ ముందున్న పుట్ పాత్ రోడ్డుపై పానీ పూరి షెడ్డు ఏర్పాటు చేసుకున్నారు. దీనికి నెలకు రూ.10వేల అద్ణె షాపు ఓనర్లకు చెల్లిస్తున్నారు. మరీ షాపు ముందు సమోసా ఫాయింట్ పెట్టుకునేందుకు రూ.10వేలు అద్దె చెల్లిస్తున్నారు.

జాతర దుకాణాలు వద్దు..

గతంలో భీంనగర్ లో సంతానవేణుగోపాల స్వామి జాతర సందర్భంగా ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక దుకాణంపై ప్రమాదవశాత్తు మట్టి ట్రాక్టర్ డీకొట్టడంతో ఆ ప్రాంతంలో జాతర దుకాణాలు ఏర్పాటుకు నిషేదించాలంటూ కొందరు కోర్టు నుండి స్టే తీసుకవచ్చారు. ఇటీవల జాతర సందర్భంగా జాతర దుజాణాల ఏర్పాటును అడ్డుకున్నారు. మరీ ఇదే భీంనగర్ లో రోడ్లను అక్రమించుకుని రోడ్లపైనే వ్యాపారాలు ఏర్పాటు చేసుకుంటె రోడ్డు ప్రమాదాలు సంభవించవా? అని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అనేక సంవత్సరాల‌‌ నుంచి ఆనవాయితీ గా వస్తున్న జాతరను ఇక్కడి నుంది తరలించాలన్నా మేధావులు… పుట్ పాత్ రోడ్లను అక్రమించుకుని దర్జాగా వ్యాపారాలు చేస్తుంటే మౌనం ఎందుకు వహిస్తున్నారని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Also read: తెలంగాణ పోలీసు శాఖలో భారీ ప్రమోషన్లు.. ఆరుగురు ఐపీఎస్ అధికారులకు డీజీ హోదా!

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×