E-Paper
Advertisement

సింగరా లేక డబ్బింగ్ ఆర్టిస్టా? లైవ్ కాన్సర్ట్‌లో అడ్డంగా దొరికిపోయిన దురంధర్ సింగర్ ..వీడియో వైరల్ !

సింగరా లేక డబ్బింగ్ ఆర్టిస్టా? లైవ్ కాన్సర్ట్‌లో అడ్డంగా దొరికిపోయిన దురంధర్ సింగర్ ..వీడియో వైరల్ !
Advertisement

Jasmine Sandlas :లైవ్ కాన్సర్ట్ అంటే ఏంటి? మనముందే సింగర్స్ రియల్‌గా పాటలు పాడటం. కానీ నా లైవ్ కాన్సర్ట్ అంటే లెక్క వేరే అంటుంది దురంధర్ సింగర్ జాస్మిన్ సాండ్లాస్. అవును, వేల రూపాయలు పెట్టి వచ్చిన మ్యూజిక్ లవర్స్‌కు పాడుతున్నట్టు యాక్టింగ్ చేస్తూ పెద్ద షాకే ఇచ్చింది. పైగా నెత్తిన నీళ్లు పోసుకుంటూ ఓవర్ యాక్టింగ్ కూడా చేసేసింది. మరింతకీ ఈ సింగర్ ఫేక్ బాగోతం ఏంటో మనమూ చూసేద్దాం.

ఏప్రిల్ 19న అహ్మదాబాద్‌లో భారీ ఈవెంట్

Advertisement

దురంధర్.. ఈమధ్య ఈ ఫ్రాంచైజీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. ముఖ్యంగా ఈ సినిమాలో ‘షరారత్’, ‘మై ఔర్ తూ’ అంటూ పాటలు పాడి సెన్సేషన్ క్రియేట్ చేసింది జాస్మిన్ సాండ్లాస్. ఒక రకంగా ప్రస్తుతం ఉన్న ట్రెండ్ అంతా ఈ పాటలకే ఫిదా అయిపోయారనే చెప్పాలి. ఇక ఇవి లేకుండా పార్టీ కాని, పబ్ కాని ఉండదంటే ఆశ్చర్యం లేదు.

ఇంకేం.. అంతటి క్రేజ్ కొట్టేసిన జాస్మిన్ సాండ్లాస్‌తో ఈవెంట్ చేసి క్యాష్ చేసుకోవాలనుకున్నారు కొంతమంది ఆర్గనైజర్స్. అనుకున్నదే తడవుగా ఏప్రిల్ 19న అహ్మదాబాద్‌లో భారీ ఈవెంట్ ప్లాన్ చేశారు. అంత ఫేమస్ సింగర్ పాడే పాటలను లైవ్‌లోనే వినొచ్చు అంటూ టికెట్స్‌ను ఎగబడి కొన్నారు మ్యూజిక్ లవర్స్.

Advertisement

also read:నలుగురు మొనగాళ్లు.. ఒకే సీజన్… 2027 సమ్మర్ వార్ లో నిలిచేదెవరు?

పెదాలు కదుపుతూ ‘లిప్ సింక్’ డ్రామా

అంతా బాగానే ఉంది. ఈవెంట్‌లో జాస్మిన్ సాండ్లాస్ చేస్తున్న హంగామా మామూలుగా లేదు. పాట పాడకుండానే పాడుతున్నట్టు బిల్డప్ ఇస్తూ, మధ్యలో తలపై నీళ్లు పోసుకుని తెగ ఊగిపోయింది. స్టేడియంలో ఉన్నవాళ్లంతా ఆమె ఎనర్జీ చూసి ఫిదా అయిపోయారు కూడా.

కానీ అసలు సినిమా తర్వాత కనిపించింది. ఆ ఈవెంట్ వీడియోలు చూసిన నెటిజన్లు షాక్ తింటున్నారు. జాస్మిన్ మైక్ పక్కన పెట్టినా పాట మాత్రం బ్యాక్‌గ్రౌండ్‌లో ఫుల్ వాల్యూమ్‌తో వినిపిస్తోంది. అంటే జాస్మిన్ లైవ్‌లో పాట పాడటం లేదు.. కేవలం ప్లే అవుతున్న రికార్డింగ్‌కు పెదాలు కదుపుతూ ‘లిప్ సింక్’ డ్రామా ఆడుతోందని క్లియర్‌గా అర్థమైపోయింది.

జాస్మిన్‌ను ఓ రేంజ్‌లో ఆడుకుంటున్న నెటిజన్లు

ఇక ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో క్లిప్స్ వైరల్ అవ్వడంతో జాస్మిన్‌ను ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు నెటిజన్లు.
“వందల కిలోమీటర్లు జర్నీ చేసి, వేల రూపాయలు పోసి నీ లిప్ సింక్ చూడాలా?” అని ఒకరు అంటే.. “సింగర్ అనుకున్నా.. నువ్వు యాక్టర్ వా?” అంటూ మరొకరు సెటైర్ వేశారు.

ఇక తలపై నీళ్లు పోసుకున్న సీన్‌పై నెటిజన్లు చెడుగుడు ఆడేస్తున్నారు. ముఖ్యంగా “నీ పాటకు, ఆ నీళ్ల విన్యాసాలకు అస్సలు సంబంధం లేదు. నీ పాపాలు కడిగేసుకోవడానికి ఆ నీళ్లు సరిపోవు.. ఇంకో బకెట్ పోసుకోవాల్సింది” అంటూ ఒకరు పెట్టిన కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అయితే జాస్మిన్ సాండ్లాస్ ఒక్కరే కాదని, ప్రస్తుతం స్టేజ్ మీద మైక్ పట్టుకుని పాడే వాళ్లంతా ఇలాగే చేస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా లైవ్ మ్యూజిక్ అని చెప్పి జనాన్ని మోసం చేయడం ఫ్యాషన్ అయిపోయిందని ఫైర్ అవుతున్నారు మ్యూజిక్ లవర్స్.

చూడాలి మరి ట్రోలర్స్‌కు మాంచి స్టఫ్ అయిన జాస్మిన్ ఈ ఇన్సిడెంట్‌ను ఎలా కవర్‌అప్ చేసుకుంటుందో!

ALSO READ :నాని ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ …‘బ్లడీ రోమియో 2026 టార్గెట్ మిస్.. అసలేం జరుగుతోంది?

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

Big Stories

Advertisement
×