E-Paper
Advertisement

గందరగోళంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం

గందరగోళంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం
Advertisement

GHMC Issues: స్వేచ్ఛ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ లోని అత్యధిక జనాభాకు పౌర, అత్యవసర సేవలందించే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. గత ఫిబ్రవరి 11వ తేదీన కోర్ అర్బన్ రీజియన్ పరిధిని జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లుగా విభించిన తర్వాత జీహెచ్ఎంసీలో స్తబ్దత నెలకొంది. ముఖ్యంగా ఈ ప్రధాన కార్యాలయానికి వచ్చే సందర్శకుల సంఖ్య కూడా బాగా తగ్గిపోవటంతో కార్యాలయంలోని ఆరు అంతస్తులు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి.

మూడు కార్పొరేషన్లు ఏర్పాటు..

కోర్ అర్బన్ రీజియన్ లోని 27 పట్టణ స్థానిక సంస్థలను జీహెచ్ఎంసీలో విలీనం చేయకముందు గత నవంబర్ 25వ తేదీకి ముందు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి డైలీ సుమారు వెయ్యి నుంచి 1400 మంది సందర్శకులు వివిధ పనులపై రాకపోకలు సాగించే వారు. దీనికి మించి జీహెచ్ఎంసీ పునర్విభజనకు ముందు హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ ఆఫీసర్లు కూర్చొనేందుకు చాంబర్లు సరిపోయేవి కావు. దీంతో కొన్ని విభాగాల అధిపతుల ఛాంబర్లను బుద్దభవన్ కు, ఇందిరాపార్కులోకి మార్చాల్సి వచ్చింది. కానీ మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన తర్వాత ముఖ్యమైన విభాగాధిపతులకు కేటాయించిన చాంబర్లు నేడు ఖాళీగా నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి.

అదనపు కమిషనర్..

Advertisement

పట్టణ స్థానిక సంస్థల విలీనానికి ముందు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అత్యధిక మంది విభాగాధిపతులు విధులు నిర్వహిస్తుండటంతో ఛాంబర్లు సరిపోక, ఒక్కో ఛాంబర్ లో ఇద్దరు విభాగాధిపతులు విధులు నిర్వర్తించిన సందర్భాలున్నాయి. ప్రధాన కార్యాలయంలోని మూడు అంతస్తులో నున్న అదనపు కమిషనర్ (క్రీడలు) ఛాంబర్ లో అప్పటి అదనపు కమిషనర్ (అర్బన్ కమ్యూనిటీ డెవలప్ మెంట్ ) కూడా ఒకే టేబుల్ షేర్ చేసుకుంటూ విధులు నిర్వర్తించే వారు. ఇదే పరిస్థితి జీహెచ్ఎంసీలో అంతకన్నా ముందు సర్కిళ్లలో ఉండేది. గతంలో 24 వరకున్న సర్కిళ్లను ఆ తర్వాత 30కి పెంచటంతో ఒకే సర్కిల్ ఆఫీసులో ఇద్దరు ఆఫీసర్లు ఒకే టేబుల్ షేర్ చేసుకుని విధులు నిర్వర్తించే వారు.

Also read: 30 ఏళ్ల ట్రాఫిక్ కష్టాలకు ఇక చెక్ కానీ..?

నేటికీ జీహెచ్ఎంసీ..

Advertisement

పట్టణ స్థానిక సంస్థలను జీహెచ్ఎంసీలో విలీనం చేసిన తర్వాత డిసెంబర్ మాసంలో జీహెచ్ఎంసీకి అదనపు కమిషనర్లుగా నియమితులైన వినయ్ కృష్ణా రెడ్డి, జి. సృజనలకు ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా ఛాంబర్లను కేటాయించారు. ఆ తర్వాత ఫిబ్రవరి పది వరకు వారు ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వర్తించి, ఫిబ్రవరి 11వ తేదీన కొత్తగా ఏర్పాటైన సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లకు కమిషనర్లుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెల్సిందే. కానీ నేటికీ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని రెండో అంతస్తులో ఒక ఛాంబర్ కు నేటికీ టి. వినయ్ కృష్ణా రెడ్డి, అదనపు కమిషనర్ అనే నేమ్ ప్లేటుతోనే కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ ఛాంబర్ ఖాళీగానే ఉంది.

ఆ అధికారికి నాలుగు ఛాంబర్లు..?

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కొందరు అదనపు కమిషనర్లకు నేటికీ రెండు, మరో అధికారికా ఏకంగా నాలుగు ఛాంబర్లున్నాయి. ప్రస్తుతం ప్రధాన కార్యాలయంలోని హెల్త్, రెవెన్యూ విభాగాలకు అదనపు కమిషనర్ గా వ్యవహారిస్తున్న అధికారిణి ఖైరతాబాద్ జోన్ కు జోనల్ కమిషనర్ గా కూడా వ్యవహారిస్తున్నందున ఆమె ప్రధాన కార్యాలయంతో పాటు ఖైరతాబాద్ జోన్ లో కూడా ఛాంబర్ ఉంది. ఇటీవలే జీహెచ్ఎంసీలోకి ఎంట్రీ ఇచ్చిన మరో ఐఏఎస్ ఆఫీసర్ ఏకంగా నాలుగు శాఖల బాధ్యతలు నిర్వహిస్తూ, నాలుగు ఛాంబర్లలో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు ప్రస్తుతం క్రీడా విభాగం డైరెక్టర్ గా వ్యవహారిస్తున్న అధికారికి కూడా రెండు ఛాంబర్లను కేటాయించారు.

Also read: మహా నగరంలో పైసల కష్ట్రాలు.. కొత్త కార్పోరేషన్లకు జీతాల గండం

గ్రౌండ్ ఫ్లోర్‌లో కూడా..

ఆయనకు మూడో అంతస్తులోని అదనపు కమిషనర్ (క్రీడలు) ఛాంబర్ కేటాయించగా, ఆయన ఇన్ ఛార్జి సీపీఆర్ఓ ఆఫీసర్ గా కూడా విధులు నిర్వహిస్తుండటంతో గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా ఛాంబర్ కేటాయించారు. ఈ రకంగా అధికారులు ఫుల్ గా ఉన్న సమయంలో ఒక్కో ఛాంబర్ లో ఇద్దరు అధికారులు విధులు నిర్వర్తించిన రోజులు పోయి, ఒక ఆఫీసర్ ఏకంగా రెండు నుంచి నాలుగు ఛాంబర్లలో విధులు నిర్వహిస్తున్నారు. ప్రధాన కార్యాలయంలో అదనపు కమిషనర్ గా, రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్ గా, సీసీఎల్ఏ ప్రాజెక్టు డైరెక్టర్ తో పాటు సమీక్షలు నిర్వహించినపుడు సచివాలయంలోని ఛాంబర్లను వినియోగిస్తున్నారు.

ఇష్టారాజ్యంగా ఛాంబర్ల రెనోవేషన్..

జీహెచ్ఎంసీలోకి కొత్తగా అదనపు కమిషనర్లుగా వస్తున్న ఆఫీసర్లు తమకు నచ్చిన విధంగా ఛాంబర్లను రెనొవేషన్ చేసుకుంటున్నారు. అసలే ఆర్థిక సంక్షోభం నెలకొన్న సమయంలో కార్పొరేట్ తరహాలో ఛాంబర్ల రెనొవేషన్ కు ఖర్చు చేయటం అవసరమా? అన్న వాదనలు విన్పిస్తున్నాయి. మూడు అంతస్తులో అదనపు కమిషనర్ (రెవెన్యూ, హెల్త్) ఛాంబర్ లో ఇదివరకు విధులు నిర్వర్తించిన అధికారి రెనొవేషన్ చేయించుకున్న వెంటనే ఆయన జీహెచ్ఎంసీ నుంచి బదిలీ అయి వెళ్లారు. ప్రస్తుతం మరో ఛాంబర్ ను కూడా కార్పొరేట్ స్థాయిలో రెనొవేషన్ చేసేందుకు బిల్డింగ్ మెయింటనెన్స్ ఇంజనీర్లు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.

Also read: ఉమ్మడి మెదక్ జిల్లాలో కదం తొక్కిన ఆర్‌టీసీ కార్మికులు

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×