E-Paper
Advertisement

నాని ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ …‘బ్లడీ రోమియో 2026 టార్గెట్ మిస్.. అసలేం జరుగుతోంది?

నాని ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ …‘బ్లడీ రోమియో 2026 టార్గెట్ మిస్.. అసలేం జరుగుతోంది?
Advertisement

Bloody Romeo:ఓజి లాంటి సాలిడ్ హిట్ కొట్టిన సుజిత్ తన నెక్స్ట్ సినిమా టాలీవుడ్ నేచురల్ స్టార్ నానితో చేయబోతున్నాడు అనగానే అంచనాలు ఆకాశంలోకి వెళ్లిపోయాయ్. ఇక సినిమా పేరు బ్లడీ రోమియో అంటూ ఇప్పటికే అనౌన్స్ చేసేశారు కూడా. అయితే తాజాగా ఈ సినిమా విషయంలో వినిపిస్తున్న ఓ క్రేజీ అప్ డేట్ నాని ఫ్యాన్స్ ని ఫుల్ డిసప్పాయింట్ చేసేస్తుంది.

‘వాయిదా’ పర్వంలో ‘ది పారడైజ్’.. 

Advertisement

యస్ .. ముందుగా అనుకున్నట్టుగా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ జానర్లో తెరకెక్కనున్న ఈ సినిమా అనుకున్న సమయానికి వచ్చేలా కనిపించట్లేదట. కారణం … నాని తన కెరీర్ లోనే మోస్ట్ ప్రెస్టేజియస్ మూవీగా తెరకెక్కుతున్న ప్యారడైజ్ సినిమా షూటింగ్ మరింత డిలే అవడమే. ‘దసరా’ వంటి సూపర్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ అనుకున్న దానికన్నా ఆలస్యంగా జరుగుతుందని, ఇపుడు దాని ఎఫెక్ట్ బ్లడీ రోమియోపై పడుతుందని ఇన్ సైడ్ టాక్.

also read:పూరీ జగన్నాథ్ ‘స్లమ్ డాగ్’ సీన్ రివర్స్ … ఈసారి తప్పించుకోలేరా?

Advertisement

2026లో కనీసం సెట్స్ పైకి అయినా వెళ్తుం

నిజానికి మార్చి 26 2026కి సమ్మర్ గిఫ్ట్ గా ‘ది పారడైజ్’ సినిమాని వదలాలని ప్లాన్ చేశారు మేకర్స్. కానీ కారణాలేవైనా సినిమా షెడ్యూల్స్ ఆలస్యం అవడంతో అనుకున్న డేట్ కాస్తా ఆగస్టు 21, 2026కి మారింది. ఇక ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న తీరుని బట్టి ఈ సినిమా ఆగస్టు 21కి కూడా రావడం అనుమానమేనన్నది ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. దీని వల్లే పూర్తిగా నాని తన కాల్ షీట్స్ ని మరో సినిమాకి ఇవ్వలేని పరిస్థితి.ఇక సుజీత్ దర్శకత్వంలో బ్లడీ రోమియో అని సినిమా మొదలెట్టినప్పుడే 2026 చివరికల్లా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్. కానీ తాజా ట్రెండ్ బట్టి చూస్తే అసలు ఈ సినిమా 2026లో కనీసం సెట్స్ పైకి అయినా వెళ్తుందా అన్న డౌట్స్ రైజ్ అవుతున్నాయ్.

ఫ్యాన్స్‌లో నిరాశ.. కానీ సుజీత్ ప్లాన్ వేరే!

ఏది ఏమైనా ఒకే ఏడు నాని నుండి రెండు భారీ సినిమాలు చూడొచ్చు అని ఆశ పడ్డ అభిమానులకి ఇది డిసప్పాయింట్ చేసే అంశమే. అయితే ఈ డిలేని డైరెక్టర్ సుజీత్ ఒక అడ్వాంటేజ్‌గా మార్చుకోవాలని చూస్తున్నారట. అసలే సుజీత్ అంటేనే స్టైలిష్ మేకింగ్ మరియు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేకి కేరాఫ్ అడ్రస్. ఇప్పుడు దొరికిన ఈ ఎక్స్ట్రా టైమ్ ని స్క్రిప్ట్ ని మరింత ట్యూన్ చేసేందుకు వాడనున్నాడట.అయితే సినిమా ఎప్పుడు వచ్చినా బాక్సాఫీస్ వద్ద సినిమా సాలిడ్ వసూల్లు కొల్లగొట్టడం ఖాయమని ఫిక్స్ అయిపోతున్నారు నాని ఫ్యాన్స్. చూడాలి మరి బ్లడ్ రోమియో డిలే పై వస్తున్న ఈ వార్తలపై మేకర్స్ ఎప్పుడు అఫీషియల్ అనౌన్స్ మెంట్ వదులుతారో!

also read:నలుగురు మొనగాళ్లు.. ఒకే సీజన్… 2027 సమ్మర్ వార్ లో నిలిచేదెవరు?

Related News

ఆగస్టు 9న వైజాగ్‌లో బన్నీ హంగామా.. అభిమానులకు గుడ్ న్యూస్!

మృణాల్ ఠాకూర్ ఫైర్.. ఇక షేర్ చేసినా కేసులే!

నిఖిల్ ‘స్వయంభు’లో శక్తిమాన్.. టాప్ సీక్రెట్ రివీల్ చేసిన హీరో!

ఎన్టీఆర్ లేకుండానే ‘డ్రాగన్’ షూటింగ్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్!

శూర్పణఖ పాత్రపై రకుల్ షాకింగ్ కామెంట్స్!

ఆటా సందీప్ దూకుడు.. జానీ, శేఖర్ మాస్టర్లకి ఇక కష్టమేనా ?

జయం రవి విడాకుల కేస్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఆర్తి తల్లి!

త్రిషపై ఉదయనిధి అసభ్యకర వ్యాఖ్యలు.. కుష్బూ సంచలన ట్వీట్!

Big Stories

Advertisement
×