BigTV English
Advertisement

Jatadhara Day 1 Collections : ‘జటాధర’ ఫస్ట్ డే కలెక్షన్స్.. కాస్టూమ్స్ డబ్బులైనా వస్తాయా ?

Jatadhara Day 1 Collections : ‘జటాధర’ ఫస్ట్ డే కలెక్షన్స్.. కాస్టూమ్స్ డబ్బులైనా వస్తాయా ?

Jatadhara Day 1 Collections :  టాలీవుడ్ హీరో సుధీర్ బాబు నటించిన తాజా చిత్రం జటాధర.. ఒకప్పుడు ఎడిటర్ గా పలు సినిమాలకు పని చేసిన వెంకట్ కళ్యాణ్ ఈ మూవీతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అటు హీరోకు ఇటు డైరెక్టర్ కు ఈ సినిమా హిట్ అవ్వడం చాలా అవసరం. ఎందుకంటే ప్రేమ కథా చిత్రం తర్వాత సుధీర్ బాబుకు ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ మూవీ పడలేదు. అలాగే డైరెక్టర్ అడుగుపెట్టిన వెంకట్ కళ్యాణ్ కూడా ఇది అగ్ని పరీక్ష లాంటిదే.. ఈ మూవీ రిలీజ్ కి ముందు మంచి అంచనాలను క్రియేట్ చేసుకుని నిన్న థియేటర్లలోకి వచ్చేసింది. ఒకవైపు పాజిటివ్ టాక్ ని అందుకున్న సరే మరికొన్ని చోట్ల మాత్రం ఈ మూవీకి యావరేజ్ టాక్ రావడంతో కలెక్షన్లు కూడా దారుణంగా పడిపోయినట్లు తెలుస్తుంది. మరి మొదటి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లను రాబాట్టిందో చేసిందో ఒకసారి తెలుసుకుందాం..


‘జటాధర’ ఫస్ట్ డే కలెక్షన్స్.. 

శుక్రవారం భారీ అంచనాలతో థియేటర్లలోకి రిలీజ్ అయిన జటాధర మూవీ పెద్దగా మెప్పించలేక పోయింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్లను అందుకోలేక పోయింది. తెలుగు రాష్ట్రాల్లో సగటు ఆక్యుపెన్సీ 18 శాతం నుంచి 20 శాతం మధ్యలో ఉండగా, హిందీ మార్కెట్‌లో స్పందన చాలా తక్కువగా వచ్చింది. మౌత్ టాక్ యావరేజ్ అని రావడంతో కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. కనీసం మొదటిరోజు ఒక కోట్ అయినా రాబడుతుందని అనుకున్నారు. అంత కూడా లేదు కేవలం ఈ మూవీ 75 లక్షల వసూలు చేసింది. ఈ కలెక్షన్లు చాలా దారుణం అనే చెప్పాలి.. ఇలానే కొనసాగితే మాత్రం మూవీకి భారీ నష్టాలు తప్పేలా లేవు.. కనీసం ఈ వీకెండ్ అయినా కూడా ఈ సినిమాకు మంచి వసూళ్లు వస్తాయేమో చూద్దాం..

Also Read :జర్నలిస్ట్ కు హీరోయిన్ ఘాటు రిప్లై.. అలా చేస్తే ఊరుకొనేది లేదు..


మూవీ బడ్జెట్ & టార్గెట్.. 

సుధీర్ బాబు సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకొని జటాధర మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. థియేటర్లలోకి రాకముందు ఈ మూవీ నుంచి ట్రైలర్ బయటకొచ్చింది. ఆ ట్రైలర్ హారర్ కామెడీ సన్నివేశాల తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కానీ థియేటర్లలోకి వచ్చాక టాక్ మారింది. ఈ మూవీ యావరేజ్ టాక్ అందుకుంది. ప్రీరిలీజ్ బిజినెస్ ఓ రేంజులో జరిగింది. సోనాక్షి సిన్హా బాలీవుడ్ స్టార్‌గా పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకర్షిస్తారన్న నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్లు కూడా ఉత్సాహంగా ముందుకు వచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ బిజినెస్ దాదాపు రూ. 6 కోట్ల వరకు జరిగినట్లు చెబుతున్నారు. మొత్తంగా 15 కోట్ల వరకు వెళ్లిందని అంచనా.. ఫైనల్ గా ఈ మూవీ రూ. 8 కోట్లను వసూల్ చేస్తే హిట్ అయ్యేది. కానీ మొదటి రోజు 75 లక్షలు మాత్రమే రావడంతో సినిమాకు పెద్ద నష్టం కలిగేట్లు ఉందని సినీ ట్రేడ్ వర్గాల్లో టాక్.. ఏది ఏమైనా ఈ మూవీ పై హీరో చాలా ఆశలు పెట్టుకున్నాడు. మరి ఈ వీకెండ్ ఈ మూవీని గట్టేక్కిస్తుందేమో చూడాలి..

Related News

Sikindar: రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న సికిందర్.. వాటిని యాడ్ చేస్తూ!

Bhagya Shri Borse: రామ్‌ పోతినేనిలో అదంటే చాలా ఇష్టం… భాగ్యశ్రీ ఆన్సర్‌కి శ్రీముఖి షాక్

Actress Anandi: యాంకర్ సుమ సెట్ లో అలా ఉంటారా..అసలు విషయం చెప్పిన నటి!

Anchor Suma: 8 నెలల ప్రెగ్నెన్సీ తో కూడా యాంకరింగ్, ఆ ఇబ్బంది మర్చిపోలేను?

Rajinikanth: రజనీకాంత్‌ సోదరుడికి గుండెపోటు.. ఆస్పత్రికి సూపర్‌ స్టార్‌

Andhra King Taluka: మూడు పాటలకు మూడు ప్రత్యేకతలు… రామ్ టాలెంట్ చూపించాడా ?

Actor Ajay: చిరంజీవి కంటే బాలయ్య అంటేనే ఇష్టం… రెమ్యునరేషన్ పై అజయ్ షాకింగ్ కామెంట్స్!

Anchor Suma: ఇప్పుడు మన బతుకులు అవి, ఎన్టీఆర్ కోప్పడటంపై సుమా రియాక్షన్

Big Stories

×