The Girl Friend Day 1 Collection: నేషనల్ రష్మిక మందన్న(Rashmika Mandanna) నటించిన తాజా చిత్రం ది గర్ల్ ఫ్రెండ్(The Girl Friend). నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా విడుదలకు ముందు సినిమా పట్ల భారీ స్థాయిలో అంచనాలను పెంచేశారు. అయితే సినిమాకు మాత్రం అనుకున్న స్థాయిలో ఆదరణ లభించలేదని చెప్పాలి. ఇక ఈ సినిమా మొదటిరోజు థియేటర్ రన్ పూర్తి చేసుకోవడంతో ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ కి సంబంధించిన వివరాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా మొదటి రోజు కేవలం 1.10 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించినట్లు తెలుస్తుంది. ఇలా ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ కి సంబంధించిన వివరాలు బయటకు రావడంతో ట్రేడ్ వర్గాల నిపుణులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
రష్మిక పాన్ ఇండియా స్థాయిలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈమె నటించిన వరుస ఆరు సినిమాలు కూడా 100 కోట్ల కలెక్షన్లను రాబట్టాయి. ఇలా బ్యాక్ టు బ్యాక్ 6 హిట్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక ఈ సినిమాతో కూడా హిట్ కొడుతుందని అందరూ భావించారు కానీ, ది గర్ల్ ఫ్రెండ్ సినిమా అనుకున్న స్థాయిలో అంచనాలను చేరుకోలేకపోయింది. ఇలా ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోవడంతో అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇలా రష్మిక నటించిన సినిమాకు కేవలం కోటి రూపాయలు మాత్రమే నెట్ కలెక్షన్లు రావడంతో బ్రేక్ ఈవెంట్ టార్గెట్ రీచ్ అయ్యేనా? ఈ సినిమా సేఫ్ జోన్ లో ఉండేనా? అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెంట్ అవ్వాలి అంటే సుమారు 7 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుంది. ఈ సినిమాకు రూ.6.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరగాగ, ఏడు కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ గా నిలిచింది. మరి మొదటి రోజే దారుణంగా ఈ సినిమా కలెక్షన్లు పడిపోవడంతో బ్రేక్ ఈవెన్ సాధ్యమయ్యేనా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
రష్మిక దీక్షిత్ శెట్టి జంటగా..
గీత ఆర్ట్స్ సమర్పణలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలోనే ఈ సినిమాకు భారీగా బిజినెస్ జరిగిందని స్పష్టమవుతుంది. ఈ సినిమాకు ఇంకొంచెం పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్లు పెరిగే అవకాశాలు ఉంటాయి తప్ప లేదంటే బ్రేక్ ఈవెన్ కూడా కష్టమేనని తెలుస్తోంది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే రాహుల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి(Deekshith Shetty) రష్మిక జంటగా నటించగా అను ఇమ్మానియేల్ కీలకపాత్రలో నటించి సందడి చేశారు. ఇక ఈ సినిమాలో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించడమే కాకుండా కీలకపాత్రలో కూడా కనిపించారు. ఈ చిత్రానికి ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడు నిర్మాతలుగా వ్యవహరించారు.