BigTV English
Advertisement

Vande Bharat Trains: వందే భారత్ చూసి విదేశీయులే ఆశ్చర్యపోతున్నారు.. మోడీ కీలక వ్యాఖ్యలు!

Vande Bharat Trains:  వందే భారత్ చూసి విదేశీయులే ఆశ్చర్యపోతున్నారు.. మోడీ కీలక వ్యాఖ్యలు!

భారతీయులు గర్వంగా ఫీలయ్యే రైలు వందే భారత్ అన్నా రు ప్రధాని మోడీ. కనెక్టివిటీని మెరుగు పరచడంతో పాటు అద్భుతమైన సౌకర్యాలను అందిస్తున్నట్లు చెప్పారు. భారతీయుల కోసం భారతీయులచే తయారు చేయబడిన రైలు వందేభారత్ అన్నారు.  ప్రధాని మోడీ తన పార్లమెంటరీ నియోజకవర్గం అయిన ఉత్తర ప్రదేశ్ వారణాసి నుంచి నాలుగు కొత్త వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ రైళ్లు బనారస్-ఖజురహో, లక్నో-సహరన్‌ పూర్, ఫిరోజ్‌ పూర్-ఢిల్లీ, ఎర్నాకులం-బెంగళూరు మార్గాల్లో నడవనున్నాయి.


దేశ వ్యాప్తంగా 160కి చేరిన వందేభారత్ రైళ్లు

తాజాగా ప్రారంభించిన 4 వందేభారత్ రైళ్లతో కలిపి.. దేశ వ్యాప్తంగా మొత్తంగా 160కి చేరాయన్నారు ప్రధాని మోడీ. వందే భారత్, నమో భారత్, అమృత్ భారత్ లాంఇ రైళ్లు కొత్త తరం భారతీయ రైల్వేకు పునాది వేస్తున్నాయన్నారు. ఈ రైళ్లను చూసి విదేశీ ప్రయాణికులు కూడా ఆశ్చర్యపోతున్నారని  చెప్పుకొచ్చారు.  అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వృద్ధిలో మౌలిక సదుపాయాలు ప్రధాన అంశం అన్న మోడీ.. భారత్ కూడా అభివృద్ధి మార్గంలో వేగంగా కదులుతోందన్నారు. “మౌలిక సదుపాయాలు పెద్ద వంతెనలు, రహదారుల గురించి మాత్రమే కాదు.  అవి ఎక్కడ అభివృద్ధి చేస్తే అక్కడి ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుందన్నారు ప్రధాని మోడీ.

తాజాగా అందుబాటులోకి వచ్చిన 4 వందేభారత్ రైళ్లు

⦿ బనారస్-ఖజురహో వందే భారత్

బనారస్-ఖజురహో వందే భారత్ రైలు ఈ మార్గంలో ప్రత్యక్ష కనెక్టివిటీని అందిస్తుంది. ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లతో పోలిస్తే రెండు గంటల 40 నిమిషాలు సమయం ఆదా అవుతుంది. ఈ రైలు వారణాసి, ప్రయాగ్‌రాజ్, చిత్రకూట్, ఖజురహో లాంటి మత, సాంస్కృతిక గమ్యస్థానాలను కనెక్ట్ చేస్తుంది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ఖజురహోకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది.

⦿ లక్నో-సహరన్‌పూర్ వందే భారత్

లక్నో-సహరన్‌ పూర్ వందే భారత్ ప్రయాణాన్ని దాదాపు ఏడు గంటల 45 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. గతంతో పోల్చితే  దాదాపు ఒక గంట ప్రయాణ సమయాన్ని ఆదా చేస్తుంది. ఈ రైలు లక్నో, సీతాపూర్, షాజహాన్‌పూర్, బరేలీ, మొరాదాబాద్, బిజ్నోర్, సహరన్‌పూర్ ప్రయాణీకులకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

⦿ ఫిరోజ్‌పూర్-ఢిల్లీ వందే భారత్

ఫిరోజ్‌పూర్-ఢిల్లీ వందే భారత్ ఈ మార్గంలో అత్యంత వేగవంతమైన రైలు అవుతుంది. 6 గంటల 40 నిమిషాల్లో ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. ఢిల్లీ, పంజాబ్‌ లోని ఫిరోజ్‌ పూర్, బటిండా, పాటియాలా లాంటి కీలక నగరాల మధ్య కనెక్టివిటీని బలోపేతం చేస్తుంది.

⦿ ఎర్నాకులం-బెంగళూరు వందే భారత్

ఎర్నాకులం-బెంగళూరు వందే భారత్ ప్రయాణ సమయాన్ని రెండు గంటలకు పైగా తగ్గిస్తుంది.  ఎనిమిది గంటల 40 నిమిషాల్లో ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. ఇది ప్రధాన ఐటీ, వాణిజ్య కేంద్రాలను కలుపుతుంది.

Read Also:  వందే భారత్ రైలు జర్నీకి బ్రిటన్ దంపతులు ఫిదా, అల్లం చాయ్ అదుర్స్ అంటూ..

Related News

Train PNR Status: ఇంటర్నెట్ లేకున్నా ట్రైన్ PNR స్టేటస్ తెలుసుకోవచ్చు, ఎలాగంటే?

AP Family Tour: ఫ్యామిలీ టూర్ ప్లాన్ చేస్తున్నారా ? ఏపీలోని ఈ ప్లేస్‌‌లపై ఓ లుక్కేయండి !

Assam Temple darshan: రూ.7వేలకే అస్సాం పవిత్ర యాత్ర.. కామాఖ్య, ఉమానంద ఆలయ దర్శనం ప్యాకేజ్ వివరాలు

Northeast India Tour: ఇండియాలోనే చూపు తిప్పుకోలేని అందాలు.. దీని ముందు వరల్డ్ టూర్ వేస్ట్ !

Vande Bharat: వందే భారత్ రైలు జర్నీకి బ్రిటన్ దంపతులు ఫిదా, అల్లం చాయ్ అదుర్స్ అంటూ..

Free Travel: అక్కడ బస్సు, రైళ్లలో పిల్లలు పుడితే.. వారికి లైఫ్ టైమ్ జర్నీ ఫ్రీ!

Miniature Train: ఇది దేశంలోనే తొలి సోలార్ పవర్ ట్రైన్.. ఎక్కడ నడుస్తుందో తెలుసా?

Big Stories

×