BigTV English
Advertisement

Gouri Kishan : జర్నలిస్ట్ కు హీరోయిన్ ఘాటు రిప్లై.. అలా చేస్తే ఊరుకొనేది లేదు..

Gouri Kishan  : జర్నలిస్ట్ కు హీరోయిన్ ఘాటు రిప్లై.. అలా చేస్తే ఊరుకొనేది లేదు..

Gouri kishan: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ విన్నా హీరోయిన్ గౌరీ కిషన్ పేరు వినిపిస్తుంది. ఒక్కసారిగా సోషల్ మీడియా సెన్సేషనల్ హీరోయిన్ గా మారిపోయింది ఈ అమ్మడు. ఇటీవల తన కొత్త ప్రమోషన్లలో భాగంగా ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఆమెకు చేదు అనుభవం ఎదురైంది.. అందులో ఓ రిపోర్టర్ తనని బరువు ఎంత అని అడగడంతో ఆమె ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.. అంతేకాదు అతనికి దిమ్మతిరిగి పోయేలా నా బరువు తెలుసుకుని నువ్వు ఏం చేస్తావు? ఇదంతా ఎవరినైనా శారీరకంగా అవమానించడమే.. నేను ఒక సినిమా చేశాను దాన్ని అడగండి అని ఆమె ఇచ్చిపడేసారు. ఈ హీరోయిన్ కు సినీ ఇండస్ట్రీలో మద్దతు పెరుగుతుంది. ఏ పలువురు హీరోయిన్లు ఈమెను సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. తాజాగా గౌరీ కిషన్ ఓ నోట్ ని రిలీజ్ చేశారు. అందులో ఏముందో ఒకసారి తెలుసుకుందాం..


ఎవరైన అలా చేస్తే ఊరుకొనేది లేదు..

హీరోయిన్ గౌరీ కిషన్ అదర్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఈనెల 6వ తేదీన ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.. అందులో ఓ రిపోర్టరు ఆమె బరువు గురించి అడిగాడు. దానికి ఆమె ఇచ్చిన రిప్లై ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హీరోయిన్ కి మద్దతుగా మరి కొంతమంది హీరోయిన్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్లు పెడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ హీరోయిన్ ఓ ప్రెస్ నోట్ ని రిలీజ్ చేశారు. హీరోయిన్ అన్నప్పుడు ఆమె చేస్తున్న సినిమాల గురించి మాట్లాడాలి. బాడీ షేవింగ్ చేయడం తప్పు. ఎవరికైనా ఇలాంటి అనుభవం ఎదురైతే ఖచ్చితంగా మీరు ధైర్యంగా బయట పెట్టాలి. ఇలాంటి వాటిని అస్సలు భరించకూడదు. ఒకసారి ఎదురైన అనుభవాలను పట్టించుకోకుండా ఉంటే మరోసారి అలాంటివే ఎదురవుతాయి. అందుకే ఇలాంటి వాటిని ఎప్పుడూ సహించకూడదు అంటూ నోట్లో రాసుకోచ్చింది. అంతేకాదు నాకు సపోర్ట్ గా నిలిచిన చెన్నై ప్రెస్ క్లబ్, అమ్మ అసోసియేషన్ కు, మీడియా మిత్రులకు శ్రేయోభిలాషులకు అందరికీ ధన్యవాదాలు అని తెలిపింది.. ఈ నోటు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

Also Read :నిఖిల్ అన్న ఏమైపోయావ్.. స్వయంభు ఇంకెన్ని రోజులు..?


గౌరీ కిషన్ సినిమాలు.. 

మలయాళం ముద్దుగుమ్మ గౌరీ కిషన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. 96, జాను సినిమాల్లో బాలనటిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది గౌరీ కిషన్. తెలుగు తో పాటు, మలయాళం, తమిళ్లో పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. తమిళంలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. విజయ్ మాస్టర్, ధనుష్ కర్ణన్, జి.వి. ప్రకాష్ అడియే, ఉలగమై, హాట్‌స్పాట్ వంటి చిత్రాలతో పాపులర్ అయ్యింది.. అదర్స్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఈ మూవీ నిన్న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఈమెకు బాడీ షేవింగ్ పై చేదు అనుభవం ఎదురయింది. సినిమా ఎలా ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఏమి జర్నలిస్ట్ కి ఇచ్చిన రిప్లై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ప్రస్తుతం తమిళ, తెలుగు, మలయాళ చిత్రాలతో బిజీగా ఉన్న గౌరీ కిషన్‌కు 26 సంవత్సరాలు.. ఈమె చేతిలో కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయని తెలుస్తుంది. త్వరలోనే వాటి గురించి ప్రకటించే అవకాశం ఉంది.

Related News

Jatadhara Day 1 Collections : ‘జటాధర’ ఫస్ట్ డే కలెక్షన్స్.. కాస్టూమ్స్ డబ్బులైనా వస్తాయా ?

The Girl Friend Day 1 Collection: దారుణంగా ది గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ డే కలెక్షన్స్… రష్మిక రికార్డ్స్ బ్రేక్

Mass jathara: మాస్ జాతర క్లోజింగ్ కలెక్షన్స్.. బుట్ట సర్దే టైం వచ్చిందా?

Hero Vishal: యువతిపై అత్యాచారం.. మీ కాళ్లు పట్టుకుంటానంటూ హీరో విశాల్‌ ట్వీట్‌

Anu Emmanuel: ది గర్ల్ ఫ్రెండ్.. అను పాపకు అవకాశాలు వచ్చేలా ఉన్నాయే

Rahul Ravindran: ది గర్ల్ ఫ్రెండ్ మూవీ… క్షమాపణలు చెప్పిన డైరెక్టర్.. ఎందుకంటే?

Rashmika Mandhanna : అఫీషియల్‌గా చెప్పేసింది… రౌడీతో పెళ్లి ఇక రూమర్ కాదు!

Big Stories

×