E-Paper
Advertisement

జయకృష్ణ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా.. ఆసక్తికర విషయాలు బయటకు!

జయకృష్ణ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా.. ఆసక్తికర విషయాలు బయటకు!
Advertisement

Jayakrishna: దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ మనవడు, స్వర్గస్తులు రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని ఇండస్ట్రీకి పరిచయం అవుతూ నటిస్తున్న తొలి చిత్రం శ్రీనివాస మంగాపురం. ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించబోతున్నారు జయకృష్ణ ఘట్టమనేని. జూలై 30వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్న నేపథ్యంలో స్వయంగా జయకృష్ణ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమా గురించి, అలాగే తన వ్యక్తిగత ఇష్టాల గురించి అభిమానులతో పంచుకుంటున్నారు.

బాబాయ్ తర్వాత ఆ హీరో అంటే చాలా ఇష్టం..

ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జయకృష్ణ.. తనకు ఇష్టమైన హీరో గురించి చెప్పి సదరు హీరో అభిమానులను సర్ప్రైజ్ చేశారు.. ఇంటర్వ్యూలో భాగంగా.. “జయ కృష్ణ, మీరు సహజంగానే మీ బాబాయ్ మహేష్ బాబు నటనను ఇష్టపడతారు కదా.. ఆయన కాకుండా తెలుగులో మీకు ఇష్టమైన హీరో ఎవరు?” అని ప్రశ్నించగా.. జయకృష్ణ మాట్లాడుతూ..” మా బాబాయ్ మహేష్ బాబు తర్వాత నాకు రాంచరణ్ అంటే చాలా ఇష్టం. ప్రతి సినిమా కోసం ఆయన చాలా కష్టపడతారు. ముఖ్యంగా ఆయన నటన నన్ను ఎప్పటికప్పుడు ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది. ఇక ఇటీవల వచ్చిన పెద్ది సినిమా కూడా చూశాను. ఆయన ఆ సినిమాలో చాలా అద్భుతమైన నటన కనబరిచారు” అంటూ రాంచరణ్ పై ప్రశంసల కురిపించారు జయ కృష్ణ. ప్రస్తుతం తనకు తన బాబాయ్ మహేష్ బాబు కాకుండా మెగా హీరో రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం అని చెప్పి అభిమానులను సర్ ప్రైజ్ చేశారు. ఇక జయకృష్ణ మాటలు విన్న మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేవనడంలో సందేహం లేదు.

శ్రీనివాస మంగాపురం మూవీతో రాబోతున్న జయకృష్ణ..

Advertisement

జయకృష్ణ నటిస్తున్న శ్రీనివాస మంగాపురం సినిమా విషయానికొస్తే.. ఈ చిత్రానికి ఆర్ఎక్స్ 100, మంగళవారం వంటి చిత్రాలతో సూపర్ హిట్ విజయాలను సొంతం చేసుకున్న అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా.. చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్ పై జెమిని కిరణ్ నిర్మించారు. కేజిఎఫ్ 2 సినిమాలో తన అద్భుతమైన నటనను కనబరిచి, అందరి దృష్టిని ఆకట్టుకున్న రవీనా టాండన్ కూతురు రషా తడానీ ఈ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు.

also read: సుప్రీంకోర్టులో బండ్ల గణేష్ కు ఎదురుదెబ్బ.. పిటిషన్ ను కొట్టి వేస్తూ కీలక తీర్పు!

జయకృష్ణ చీట్ చేశాడు – రవీనా టాండన్

Advertisement

ఇకపోతే అటు రషా తడానీ కూడా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంది . అందులో భాగంగానే జయకృష్ణ షూటింగ్ సెట్లో ఎలా ఉంటారు? అని అడగగా.. “ఆయన చాలా సైలెంట్ గా ఉంటాడు. కాకపోతే చీటింగ్ చేస్తాడు.. ఇద్దరం కలిసి బోర్డింగ్ గేమ్స్ ఆడేవాళ్ళం. ఆ సమయంలో జయ కృష్ణ చాలా చీట్ చేశాడు” అంటూ నవ్వుతూ తెలిపింది రషా తడాని. అలాగే మోహన్ బాబుతో గడిపిన క్షణాలను కూడా ఆమె పంచుకుంది. తన తల్లి తో కలిసి నటించిన రోజులను గుర్తు చేసుకుంటూ ఎన్నో ముచ్చట్లు ఆయన తెలిపారు అంటూ రషా తడానీ చెప్పుకొచ్చింది.

 

Related News

ఒకే హీరోకి కూతురిగా, లవర్‌గా, తల్లిగా నటించిన సీనియర్ హీరోయిన్ ఎవరో తెలుసా?

జననాయగన్.. లాస్ట్ క్లిప్..థియేటర్లలో కన్నీళ్లు పెట్టుకుంటున్న ఆడియన్స్!

నన్ను ఒంటరిగా హోటల్ రూమ్‌కు రమ్మన్నారు.. సీరియల్ నటి షాకింగ్ కామెంట్స్

సుప్రీంకోర్టులో బండ్ల గణేష్ కు ఎదురుదెబ్బ.. పిటిషన్ ను కొట్టి వేస్తూ కీలక తీర్పు!

దళపతి విజయ్ ‘జననాయగన్’ రివ్యూ: ఫ్యాన్స్ ఊహించింది ఒకటి.. జరిగింది వేరొకటి!

జూబ్లీహిల్స్ లో స్థల కబ్జా యత్నం.. బడా ప్రొడ్యూసర్స్ సి.కళ్యాణ్, బి. శివరామకృష్ణపై కేస్ ఫైల్!

‘జన నాయగన్’ రెమ్యునరేషన్స్.. విజయ్ ఒక్కడికే అన్ని కోట్లా?

Big Stories

Advertisement
×