Bandla Ganesh:అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కి ఊహించని షాక్ ఇచ్చింది. తన స్థిరాస్తిని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేలం వేయడాన్ని సమర్థిస్తూ.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ బండ్ల గణేష్ ఇటీవల దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేయడం సంచలనంగా మారింది. అసలు విషయంలోకి వెళ్తే.. తన వ్యాపార రుణాలకు సంబంధించి జూబ్లీహిల్స్ లోని స్థిరాస్తిని యూనియన్ బ్యాంక్ వేలం వేయడాన్ని సవాల్ చేస్తూ గతంలో న్యాయస్థానాలను ఆశ్రయించారు బండ్ల గణేష్. ఈ వ్యవహారంలో బ్యాంకు చేపట్టిన వేలం సరైనదేనని, ఇందులో జోక్యం చేసుకోలేమంటూ తెలంగాణ హైకోర్టు ఇటీవల యూనియన్ బ్యాంక్ కి అనుకూలంగా తీర్పును వెలువరించింది.
అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. బండ్ల గణేష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక అందులో పిటిషన్ దాఖలు చేయగా.. ఇవాళ ఆ పిటీషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం..ఈ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. పైగా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ.. బండ్ల గణేష్ దాఖలు చేసిన ఈ పిటీషన్ ను కొట్టివేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు బండ్ల గణేష్ పిటిషన్ ను కొట్టివేయడంతో సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ గా మారింది.
అసలు విషయంలోకి వెళ్తే.. ఈనెల 4వ తేదీన బండ్ల గణేష్ కి చెందిన జూబ్లీహిల్స్ ఆస్తి వేలానికి సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను ఆమోదిస్తూ బ్యాంకు సర్ఫేసీ చట్టం – 2002 కింద చేపట్టిన ఆస్తి వేలం సమర్ధనీయమే అంటూ తెలిపింది. వేలం ద్వారా చేసిన విక్రయాన్ని రద్దు చేసి , ఆ సొమ్మును ఆస్తి యజమానులకు చెల్లించాలంటూ రుణ వసూళ్ల ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. బండ్ల గణేష్ , ఆయన తండ్రి, సోదరుడు తదితరులకు చెందిన ఆస్తి వేలం వేయడాన్ని రద్దు చేస్తూ డిఆర్టీ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ యూనియన్ బ్యాంకు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఈ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి మౌషుమి భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఈ విచారణలో బ్యాంకు తరఫున మాజీ ఏజీ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ..” శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్ ప్రైవేట్ లిమిటెడ్ తీసుకున్న రుణ రికవరీలో భాగంగా హామీదారులైన కుటుంబానికి చెందిన ఆస్తిని స్వాధీనం చేసుకున్నాము. 2022లో వేలం నిర్వహించగా.. రూ.8.51 కోట్లు వచ్చింది. డిఆర్టీ ఉత్తర్వులలో చట్టపరమైన లోపాలు ఉన్నాయని చెప్పారు. రుణ గ్రహీత కంపెనీకి సంబంధించి ఎన్ .సీ.ఎల్.టీలో దివాలా ప్రక్రియ ప్రారంభమైనంత మాత్రాన.. వ్యక్తిగత గ్యారెంటర్ల ఆస్తులపై మారటోరియం వర్తించదని తెలిపారు . వ్యక్తిగత గ్యారెంటర్లపై ప్రత్యేకంగా దివాలా చర్యలు ప్రారంభించినప్పుడే.. ఆ రక్షణ వర్తిస్తుందన్నారు. ఇక రూ.8.50 కోట్ల విక్రయ మొత్తాన్ని ఇప్పటికే వన్ టైం సెటిల్మెంట్ కింద బ్యాంకు సర్దుబాటు చేసినట్లు తెలిపారు. పిటిషనర్లు వన్ టైం సెటిల్మెంట్ కింద చెల్లించడానికి ముందుకు వచ్చారని, దీనికి బ్యాంకు అంగీకరించిందని, వేలాన్ని సవాలు చేయడంతో పాటు బ్యాంకు పై వేసిన ఇతర పిటీషన్లను ఉపసంహరించుకోవడానికి బండ్ల గణేష్ అంగీకరించారన్నారు. అయితే అది చేయకుండానే డిఆర్టీని ఆశ్రయించారని, ట్రిబ్యునల్ బ్యాంకు రికార్డులను పరిశీలించకుండా వేలాన్ని రద్దు చేసిందని తెలిపారు.
also read: జూబ్లీహిల్స్ లో స్థల కబ్జా యత్నం.. బడా ప్రొడ్యూసర్స్ సి.కళ్యాణ్, బి. శివరామకృష్ణపై కేస్ ఫైల్!
అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ బ్యాంకు వాళ్లు తమ ఆస్తిని అన్యాయంగా విక్రయించారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టు వెళ్లగా నేడు సుప్రీంకోర్టులో కూడా ఆయనకు ఎదురు దెబ్బ తగిలింది.