E-Paper
Advertisement

‘ముసలి ప్రొడ్యూసర్.. యంగ్ హీరోయిన్.. మంచం కింద నేను’..ఆ రాత్రి జరిగిన సీక్రెట్ బయటపెట్టిన జేడీ.

‘ముసలి ప్రొడ్యూసర్.. యంగ్ హీరోయిన్.. మంచం కింద నేను’..ఆ రాత్రి జరిగిన సీక్రెట్ బయటపెట్టిన జేడీ.
Advertisement

JD Chakravarthy :ఇండస్ట్రీలో ఆడవాళ్ళు అవకాశాల కోసం ఎంతలా తమని తాము సాక్రిప్రైజ్ చేసుకుంటారో మరోసారి కళ్ళకి కట్టినట్టు చెప్పాడు సీనియర్ యాక్టర్ జేడీ చక్రవర్తి. వయసులో ఉన్నవారే కాదు ఏజ్ బార్ అయిన ముసలి వాళ్ళు కూడా ఆడదాని కొంగు చూసి చొంగ కార్చుకునే వారే అంటూ తన లైఫ్ లో ఎదురైన కాస్టింగ్ కౌచ్ ఇన్సిడెంట్ ని ఒక ఇంటర్వ్యూలో ఇలా బయటపెట్టడం ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ జేడీ చెప్పిన ఆ కాస్టింగ్ కౌచ్ కబుర్లు ఏంటంటే…

అసలేం జరిగింది? గెస్ట్ హౌస్‌లో ఆ రాత్రి!

Advertisement

జేడీ చక్రవర్తి ఇండస్ట్రీలో చిన్నచిన్న క్యారెక్టర్స్ వేస్తున్న టైం అది. ఆయనకు, నటుడు సురేష్‌కు ఒక స్టార్ హీరోయిన్ మంచి స్నేహితురాలు. ఒకరోజు సాయంత్రం ఆ హీరోయిన్ వీరిద్దరినీ డిన్నర్ కోసం తన గెస్ట్ హౌస్‌కు పిలిచింది. ముగ్గురూ కలిసి సరదాగా ఉన్న సమయంలో రాత్రి 8:30 గంటల ప్రాంతంలో కాలింగ్ బెల్ మోగింది. కిటికీలో నుండి బయట ఉన్న వ్యక్తిని చూడగానే ఆ హీరోయిన్ ముఖం పాలిపోయింది. కంగారుగా “ప్లీజ్.. మీరిద్దరూ వెంటనే మంచం కింద దాక్కోండి” అని బ్రతిమాలిందట.

మంచం కింద జేడీ.. పైన ముసలి నిర్మాత వేషాలు!

Advertisement

ఇక వేరే దారి లేక ఏం చేయాలో అర్థం కాక ఆ హీరోయిన్ చెప్పినట్టే జేడీ, సురేష్ ఆ మంచం కింద దాక్కొని ఉన్నారట. అలా నక్కి ఉన్నవారికి లోపలికి వచ్చిన ఆ వ్యక్తిని చూసి ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినంత పని అయిందట. ఎందుకంటే వచ్చిన అతని వయసు ఆ హీరోయిన్ కి తాత అంత ఉంటుందట. కనీసం ఒకరు పట్టుకుంటే కాని నడవలేని ఆ ముసలి నిర్మాత ఆ కుర్ర హీరోయిన్ తో మాట్లాడిన తీరు, ప్రవర్తించిన విధానం చూసి ముసలాడికి కూడా అంత కామమా అంటూ ఆశ్చర్యపోయాడట జేడీ.

also read:రిటైర్డ్ జైలర్ ఈసారి గ్లోబల్ వార్.. జైలర్ 2 లో ఊహించని ట్విస్టులు!

“వాడి దగ్గర భరించలేని వాసన..” హీరోయిన్ ఆవేదన!

ఇక ఆ ముసలి నిర్మాత బయటికి వెళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చిన జేడీ, సురేష్ లకి ఆమెని చూస్తే కళ్ళల్లో నెలలు తిరిగాయట. కానీ ఆమె మాత్రం ఏమీ కానట్టు మాములుగానే “ఏం చేస్తాం రా.. వాడు ముసలోడే, వాడి దగ్గర భరించలేని వాసన వస్తుంది. కానీ వాడు ఇండస్ట్రీలో పెద్ద తోపు ప్రొడ్యూసర్. వాడు అడిగింది ఇవ్వకపోతే ఇక్కడ ఛాన్సులు రావు.. ఉండనివ్వరు” అంటూ నవ్వుతూనే తన మనసులోని బాధని వాళ్ళతో చెప్పుకుందట.

ఇది ఇష్టమా? అవసరమా?

నిజానికి “రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు.. ఇక్కడ అంతా ఇచ్చిపుచ్చుకోవడమే” అని ఇండస్ట్రీలో చాలా మంది అమ్మాయిల గురించి చాలా తేలికగా మాట్లాడేస్తారు. కానీ జేడీ చక్రవర్తి బయటపెట్టిన ఈ సంఘటనని చూస్తే ఏ అమ్మాయి కూడా కావాలని ఈ నరకంలోకి దిగాదని అర్థం అయిపోతుంది. కేవలం సినిమా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవాలన్న ఆశతో ఇలా ‘ముసలి’ వాళ్ల కక్కుర్తిని కూడా భరించాల్సి రావడం తెలుగు ఇండస్ట్రీకి మాయని మచ్చే అని చెప్పాలి.

ఇక జేడీ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆనాడు ఆ హీరోయిన్‌ను వేధించిన ఆ ముసలి నిర్మాత ఎవరు? అంటూ ఇండస్ట్రీలో డిస్కషన్ మొదలైంది. ఏది ఏమైనా ఈ గ్లామర్ వరల్డ్ వెనుక ఉన్న ఇలాంటి వేదింపులు ఆగనంత వరకు అమ్మాయిలు సినిమాల్లోకి భయం భయంగా అడుగులు వేయాల్సిందే.

also read:మీమ్స్ రాజాలకి మైండ్ బ్లాక్.. బన్నీ పేరు వాడితే 72 గంటల్లో ఖతం!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×