JD Chakravarthy: సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి తన నటనతోనే కాదు, తన వ్యక్తిత్వంతోనూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయన చేసిన ‘గాయపడ్డ సింహం’ సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే, ఒకప్పుడు అతిలోక సుందరి శ్రీదేవిని పెళ్లి చేసుకోమని ఆమె తల్లి స్వయంగా జేడీని అడిగారనే వార్త ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆ ఆఫర్‌ను జేడీ ఎందుకు కాదన్నారు? అన్న ఆసక్తికర విషయాలను ఆయన ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
నటుడు జేడీ చక్రవర్తికి శ్రీదేవి చెల్లెలు మహేశ్వరితో మంచి స్నేహం ఉంది. వీరిద్దరూ కలిసి కొన్ని సినిమాల్లో కూడా నటించారు. ఒకరోజు మహేశ్వరితో పని ఉండి మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ఆమె తన ఇంటికి రమ్మని జేడీని ఆహ్వానించింది. అయితే మహేశ్వరి ఇల్లు కొంచెం దూరంగా ఉండటంతో, అందరూ కలిసి శ్రీదేవి ఇంట్లోనే లంచ్ చేస్తూ మాట్లాడుకుందామని నిర్ణయించుకున్నారు. అలా జేడీ. శ్రీదేవి నివాసానికి వెళ్లారు.
ఇక అందరూ కలిసి భోజనం చేస్తున్న సమయంలో శ్రీదేవి తల్లి రాజేశ్వరి జేడీ చక్రవర్తి దగ్గరికి వచ్చారట. జేడీని చూసి మెచ్చుకుంటూ, “బాబు.. నువ్వు చాలా బాగున్నావు, మా అమ్మాయి శ్రీదేవిని పెళ్లి చేసుకుంటావా?” అని నేరుగా అడిగేశారట. ఆ మాట వినగానే అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. సాక్షాత్తూ ఒక స్టార్ హీరోయిన్ తల్లి నుంచి అలాంటి మాట రావడం అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు, కానీ జేడీ మాత్రం మౌనంగా ఉండిపోయారు.
జేడీ చక్రవర్తి అలా సైలెంట్ అయిపోవడానికి ఒక బలమైన కారణం ఉంది. అప్పట్లో శ్రీదేవి తల్లికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉండేవి. ఆమె తలకు శస్త్రచికిత్స జరిగినప్పుడు చిన్న పొరపాటు జరిగింది. కుడివైపు చేయాల్సిన సర్జరీని ఎడమవైపు చేయడం వల్ల ఆమె మెంటల్ హెల్త్ మీద ప్రభావం పడింది. దీనివల్ల ఆమె మానసిక స్థితి సరిగా ఉండేది కాదు, ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో ఆమెకే తెలిసేది కాదు. ఇక ఆ విషయం తెలిసే జేడీ నిరాశ చెందారు.
ALSO READ:అట్లీ – బన్నీ ‘రాకా’ రిలీజ్‌పై కొత్త టాక్.. ప్లానింగ్ ఇదేనా?
ఇక శ్రీదేవి అంటే జేడీకి చాలా ఇష్టం మరియు గౌరవం. అంతటి అందగత్తెను పెళ్లి చేసుకునే అవకాశం వచ్చిందని సంబరపడాల్సింది పోయి, ఆమె తల్లి పడుతున్న ఆరోగ్య ఇబ్బందులు చూసి జేడీ మనసు కలిచివేసింది. ఆమె స్పృహలో ఉండి ఆ మాట అడగలేదని అర్థం చేసుకున్న జేడీ, ఆ విషయాన్ని కేవలం ఒక జ్ఞాపకంగానే మిగిల్చుకున్నారు. ఈ రహస్యాన్ని ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
సినిమా ప్రపంచంలో ఇలాంటి ఎన్నో వింతలు, విశేషాలు జరుగుతుంటాయి. శ్రీదేవి లాంటి స్టార్ హీరోయిన్ విషయంలో జరిగిన ఈ సంఘటన వింటే ఎవరికైనా బాధ కలుగుతుంది. జేడీ చక్రవర్తి తన నిజాయితీతో ఈ విషయాన్ని బయటపెట్టి, అప్పట్లో జరిగిన రూమర్లకు ఒక క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన తన కెరీర్ లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా గడుపుతున్నారు.