E-Paper
Advertisement

Jeevitha Rajasekhar: రివ్యూయర్లపై జీవిత రాజశేఖర్ అసహనం.. ఇప్పటికైనా మారండి అంటూ ఫైర్!

Jeevitha Rajasekhar: రివ్యూయర్లపై జీవిత రాజశేఖర్ అసహనం.. ఇప్పటికైనా మారండి అంటూ ఫైర్!
Advertisement

Jeevitha Rajasekhar: శర్వానంద్ (Sharwanand ) హీరోగా ప్రముఖ డైరెక్టర్ అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో తెరకెక్కిన ఇండియా ఫస్ట్ మోటో క్రాస్ రేసింగ్ యాక్షన్ మూవీ ‘బైకర్’. ఏప్రిల్ మూడవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. యు వి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రంలో సీనియర్ నటుడు రాజశేఖర్ హీరో తండ్రి పాత్ర పోషించగా.. మాళవిక నాయర్ హీరోయిన్గా నటించింది. జిబ్రాన్ అందించిన సంగీతం, హాలీవుడ్ స్థాయి యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇకపోతే ఈ సినిమా మొదటి షో తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో చిత్ర బృందం హైదరాబాదులో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఇందులో రాజశేఖర్ సతీమణి.. ప్రముఖ నటి, దర్శకురాలు జీవిత రాజశేఖర్ (Jeevitha Rajasekhar) పాల్గొని ఎమోషనల్ కామెంట్లు చేసింది.

రియల్ స్టోరీ తో బైకర్ సినిమాను అద్భుతంగా తీశారు- జీవిత రాజశేఖర్..

సక్సెస్ మీట్ లో భాగంగా జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ..” ఈ సినిమా మొదటి రోజు నుంచి నేను చిత్ర యూనిట్ తో పాటే ప్రయాణించాను.. సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు అభి, అసిస్టెంట్ డైరెక్టర్లు పడ్డ కష్టం నేను దగ్గరుండి చూసాను. థియేటర్లో నిన్న కనురెప్ప వేయకుండా సినిమా మొత్తం చూశాను. అంతలా నేను ఈ కథకు కనెక్ట్ అయిపోయాను. తండ్రి కొడుకుల మధ్య ఉండే సున్నితమైన అనుబంధాన్ని అద్భుతంగా ఈ చిత్రంలో చూపించారు. తండ్రికి కొడుకు అంటే ఎంతో ప్రేమ. కానీ ఆ కొడుకు ఎక్కడ చెడిపోతాడో అనే భయంతో ఆ ప్రేమను బయటకి చూపించలేడు. అటు కొడుకు కూడా తండ్రికి తన మనసులో మాట చెప్పలేక ఇబ్బంది పడతాడు. ఆఖరికి ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది.. ముఖ్యంగా నేను హోస్ట్ గా చేసిన “బతుకు జట్కాబండి” వంటి షోలో ఇలాంటి ఎన్నో రియల్ స్టోరీస్ చూశాను. అయితే ఈ సినిమాలో రాజశేఖర్ కళ్ళతోనే ఆ ఎమోషన్ ని పలికించారు. ఇక ఈ చిత్రం నాకు చాలా ఫేవరెట్.

రివ్యూయర్ల పై మండిపడ్డ జీవితా రాజశేఖర్..

Advertisement

అయితే ఇంత మంచి సినిమాని కొంతమంది రివ్యూయర్లు చాలా తప్పుగా తమ అభిప్రాయాలను ఇచ్చేసి.. సినిమాపై నెగిటివిటీని పెంచేస్తున్నారు. అందుకే సినిమా ఎలా తీయాలో ఇప్పుడు నేను రివ్యూయర్లనే అడుగుదామనుకుంటున్నాను. ఎందుకంటే సినిమాలో సెంటిమెంట్ ఎక్కువగా ఉంటే మెలోడ్రామా అని తీసి పారేస్తారు. అదే స్టైలిష్ గా తీస్తే డెప్త్ లేదని విమర్శిస్తారు. ఇక దేనిని నమ్మాలో.. ఎలా తీయాలో కూడా ఒక దర్శకురాలిగా నాకు కూడా అర్థం కావడం లేదు. ఒక సినిమా వెనుక ఎంతోమంది కష్టం.. కోట్ల రూపాయల ఖర్చు ఉంటుంది . ఇవన్నీ చూడకుండా కేవలం ఒక్కసారి సినిమా చూసి తమ అభిప్రాయాన్ని రివ్యూ రూపంలో చెప్పేస్తున్నారు. ఇది ఎంత బాధ.. ఎంత నరకమో వర్ణనాతీతం ..

ALSO READ:Ramayana OTT: భారీ ధరకు రామాయణ ఓటీటీ డీల్!

ప్రేక్షకులకు సందేశం ఇచ్చిన జీవిత రాజశేఖర్..

Advertisement

రివ్యూలు చూసి కాకుండా స్వయంగా మీరే థియేటర్లోకి వెళ్లి సినిమా చూడండి . మీ రివ్యూనే మాకు చాలా ముఖ్యం. గొడవలు, మనస్పర్ధలు ఏవైనా ఉన్నా సరే మనసు విప్పి మాట్లాడుకోండి.. ఎవరిని దూరంగా పెట్టకండి ” అంటూ ప్రేక్షకులకు కూడా సందేశం ఇచ్చింది జీవితా రాజశేఖర్. మొత్తానికి అయితే శర్వానంద్ – రాజశేఖర్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు తెరపై మ్యాజిక్ చేసిందని , అటు చిత్ర బృందం కూడా సంబరపడిపోతోంది. ఏది ఏమైనా గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న రాజశేఖర్ కి ఈ సినిమా మంచి బూస్ట్ అందించిందని చెప్పవచ్చు.

Related News

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

Big Stories

Advertisement
×