E-Paper
Advertisement

Video: PSLలో మ‌రో అరాచ‌కం.. ఒకే ఒక్క‌ బంతికి 14 పరుగులు ఇచ్చిన పాక్ బౌల‌ర్

Video: PSLలో మ‌రో అరాచ‌కం.. ఒకే ఒక్క‌ బంతికి 14 పరుగులు ఇచ్చిన పాక్ బౌల‌ర్
Advertisement

PSL Muhammad Ismail-PSL 2026:  పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటు ( Pakistan Super League 2026 Tournament ) నేపథ్యంలో రోజుకో ఆసక్తికర సంఘటన జరుగుతూనే ఉంది. నసీమ్ షా వివాదాస్పద పోస్టు నుంచి మొదలుకొని బాల్ టాంపరింగ్ వరకు ఏదో ఒక వివాదం తెరపైకి వస్తూనే ఉంది. దానికి తోడు డేవిడ్ వార్నర్ గొడవ, పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ కు సంబంధించిన ప్లేయర్లకు సమ్మర్ హాలిడేస్ ఇవ్వడం లాంటి సంఘటనలు కూడా ఇందులో చూస్తున్నాం. ఇక లేటెస్ట్ గా ఒకే ఒక్క బంతి వేసి ఏకంగా 14 పరుగులు సమర్పించుకున్నాడు పాకిస్తాన్ బౌలర్. ఇక మొత్తం ఓవ‌ర్ వేసి, 26 ప‌రుగులు ఇచ్చాడు సద‌రు బౌల‌ర్. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఒకే ఒక్క బంతికి 14 పరుగులు ఇచ్చింది మహమ్మద్ ఇస్మాయిల్ ( Muhammad Ismail) అనే పాకిస్తాన్ బౌలర్.

Also Read: Shahid Afridi On Petrol: లీట‌ర్ పెట్రోల్ రూ. 500 కాదు, రూ.2000 పెంచినా త‌ప్పులేదు..పాక్ స‌ర్కార్ పై షాహిద్ అఫ్రిది సంచ‌ల‌నం !

ఒకే ఒక్క‌ బంతికి 14 పరుగులు ఇచ్చిన పాక్ బౌల‌ర్

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇప్పటికే 10 మ్యాచ్ లు కాగా నిన్న రాత్రి 11వ మ్యాచ్ కూడా నిర్వహించారు. లాహోర్ లోని గడాఫీ స్టేడియం వేదికగా లాహోర్ ఖలందర్స్ వర్సెస్ ముల్తాన్ సుల్తాన్స్ ( Lahore Qalandars vs Multan Sultans) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ కంటే ముందు వర్షం పడింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ను 13 ఓవర్లకు కుదించారు. ఈ సందర్భంగా లాహోర్ మొదట బ్యాటింగ్ చేసి 13 ఓవర్లలో 185 పరుగులు సాధించింది. అయితే ఇదే సమయంలో ముల్తాన్ సుల్తాన్ ( Multan Sultans)  బౌలర్ ముహమ్మద్ ఇస్మాయిల్ (Muhammad Ismail ) ఒకే ఓవర్ లో 26 పరుగులు సమర్పించుకున్నాడు.

అంతేకాదు తన తొలి బంతికి మొత్తం 14 పరుగులు ఇచ్చి చెత్త రికార్డు నమోదు చేసుకున్నాడు ముహమ్మద్ ఇస్మాయిల్. ఈ మ్యాచ్ లో మొదటి బంతి వైడ్ వేశాడు ముహమ్మద్ ఇస్మాయిల్. అయితే ఆ బంతిని కీపర్ వదిలివేయడంతో బౌండరీ వెళ్ళింది. ఆ తర్వాత బ్యాటర్ ఫోర్ కొట్టాడు. దాని నెక్స్ట్ బంతి మళ్ళీ వైడ్ తో పాటు బౌండరీ వెళ్ళింది. దీంతో ఒక్క బంతి పూర్తయ్యే సరికి 14 పరుగులు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఓవరాల్ గా ఇదే ఓవర్ లో 26 పరుగులు సమర్పించుకున్నాడు ముహమ్మద్ ఇస్మాయిల్ (Muhammad Ismail ). దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ పై దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన లాహోర్ ఖలందర్స్ ( Lahore Qalandars) 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Advertisement

 

 

Also Read: Lalit Modi-Goenka: సంజీవ్ గోయెంకా దుర్మార్గుడు, వాడిపై బ్యాన్ వేయాలి..పంత్ కాళ్లు మొక్కే దాకా వ‌ద‌లొద్దు

 

Related News

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

Big Stories

Advertisement
×