E-Paper
Advertisement

Ramayana OTT: భారీ ధరకు రామాయణ ఓటీటీ డీల్!

Ramayana OTT: భారీ ధరకు రామాయణ ఓటీటీ డీల్!
Advertisement

Ramayana OTT: ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ నితేష్ తివారీ (Nithesh Tiwari) దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం రామాయణ. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి (Sai Pallavi)సీతగా, కన్నడ హీరో యశ్ రావణాసురుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన మొదటి భాగం దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఇటీవల ఈ సినిమాలో రాముడి పాత్రను పరిచయం చేస్తూ.. చిత్రబృందం ఒక వీడియోని రిలీజ్ చేసింది. ఇక దీంతో సినిమాపై బజ్ ఊహించని విధంగా పెరిగిపోయింది.

రామాయణ మూవీకి కళ్ళు చెదిరే ఓటీటీ డీల్..

ఇందులో రాముడిగా రణబీర్ కపూర్ ఆహార్యం ప్రేక్షకులను విపరీతంగా మెప్పించింది . ముఖ్యంగా అయోధ్యలోకి రాముడు ఎంట్రీ ఇచ్చే సీన్ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. సాయి పల్లవి సీతగా నటిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఈ భారీ బడ్జెట్ చిత్రంలో నటుడు యశ్ రావణాసురుడిగా నటించడమే కాకుండా ఆయన ఈ చిత్రానికి సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. రెండు భాగాలను కలిపి సుమారుగా 4 వేల కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే రెండు భాగాలుగా విడుదల కానున్న రామాయణ చిత్రానికి ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ఆఫర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మొత్తం డీల్ ఎన్ని వందల కోట్లంటే?

Advertisement

ఒక ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఏకంగా 1000 కోట్ల వరకు చెల్లించడానికి ముందుకొచ్చినట్లు సమాచారం. అయితే ఈ ఆఫర్ ను నిర్మాత నమిత్ మల్హోత్రా సున్నితంగా తిరస్కరించి, ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..

ALSO READ:Rashmika: పెళ్లయిన తర్వాత రష్మిక ఖాతాలో అరుదైన ఘనత.. సంతోషంలో ఫాన్స్!

సున్నితంగా తిరస్కరించిన నిర్మాత.. ఎందుకంటే?

Advertisement

అసలు విషయంలోకి వెళ్తే.. నిర్మాత నమిత్ మల్హోత్రా ఈ సినిమాకు సంబంధించి ప్రపంచవ్యాప్త సామర్థ్యం పై ఉన్న గట్టి నమ్మకం వల్లే ఆయన ఈ ఒప్పందాన్ని తిరస్కరించినట్లు తెలుస్తోంది. రామాయణ సినిమాతో వెంటనే లభించే ఆర్థిక లాభం కోసం కాకుండా ఈ ప్రాజెక్టును చలనచిత్ర దృశ్యంగా తీర్చిదిద్దడం పై దృష్టి సారిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా ఈ చిత్రాన్ని అనేక దేశాలలో విడుదల చేసి మరింత లాభాన్ని పొందే దిశగా నిర్మాత అడుగులు వేస్తున్నట్లు సమాచారం.. ఇకపోతే ఈ 1,000 కోట్ల ఓటీటీ ఆఫర్ ను కాదనడంతో అటు సినీ వర్గాలు ఆశ్చర్యపోయినా.. ఈ ప్రాజెక్టుపై చిత్ర నిర్మాతలకు ఉన్న నమ్మకాన్ని ఇది ప్రతిబింబిస్తోంది అనడంలో సందేహం లేదు. ఏది ఏమైనా ఈ సినిమాలో నటిస్తున్న భారీ తారాగణం.. మరొకవైపు ఈ సినిమా నుండి విడుదల చేసిన గ్లింప్స్ అన్నీ కూడా సినిమాపై అంచనాలు పెంచుతుంటే.. ఇప్పుడు ఇంత భారీ ఓటీటీ ఆఫర్ ని కూడా నిర్మాతలు తిరస్కరించడంతో అంచనాలు తారస్థాయికి చేరిపోతున్నాయి . మరి దీపావళి సందర్భంగా మొదటి భాగం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి రికార్డులు సొంతం చేసుకుంటుందో చూడాలి.

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×