E-Paper
Advertisement

మిస్ యూనివర్స్ ఇండియా ఎంట్రీ.. సత్య రొమాన్స్.. ‘జెట్లీ’ ట్రైలర్ లో హైలైట్స్ ఇవే!

మిస్ యూనివర్స్ ఇండియా ఎంట్రీ.. సత్య రొమాన్స్.. ‘జెట్లీ’ ట్రైలర్ లో హైలైట్స్ ఇవే!
Advertisement

Jetly Trailer :ఈ మధ్య కాలంలో తనదైన కామెడీతో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తున్న కమెడియన్ సత్య ఇప్పుడు జెట్లీతో మెయిన్ లీడ్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. సూపర్ హిట్ అయిన ‘మత్తు వదలరా’ ఫ్రాంచైజీతో మంచి పేరు తెచ్చుకున్న రితేష్ రాణా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా రేపే అంటే మే 1 న థియేటర్లోకి వస్తున్న సందర్భంగా మూవీ నుండి క్రేజీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

సినిమా స్టోరీ  80% ఒక విమానం (Jet) లో

Advertisement

మాములుగా ట్రైలర్ అంటే చాలా వరకు హైడ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమా స్టోరీ ఏంటో,ఎలా సాగబోతుందో డైరెక్టర్ రితేష్ చాలా వరకు హింట్ ఇచ్చేసినట్టే కనిపిస్తుంది. ఇక ఈ సినిమా స్టోరీ దాదాపు 80% ఒక విమానం (Jet) లోనే సాగుతుందని తెలుస్తుంది. దుబాయ్ నుండి కొచ్చికి వచ్చే జర్నీలో జరిగే కథే ఈ సినిమా అని ఇన్ సైడ్ టాక్. అయినా సినిమాలో సత్య చేసిన కామెడీ, రితేష్ కున్న ఇమేజ్,కనిపిస్తున్న విజువల్స్, సత్య తనదైన మేనరిజమ్స్, బాడీ లాంగ్వేజ్‌తో ఒక సామాన్యుడు అసాధారణ పరిస్థితుల్లో చిక్కుకుంటే ఎలా ఉంటుందో కడుపుబ్బ నవ్వించిన తీరు అన్నీ ఆడియన్స్ ని థియేటర్ల వరకు లాక్కొచ్చేలానే ఉన్నాయి.

నవ్వుల జల్లు ఖాయం

Advertisement

ఇక ఈ సినిమాలో సత్య కి జతగా స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ మరియు వైవా హర్ష జతకట్టడంతో నవ్వుల జల్లు ఖాయం అంటూ సినిమాపై అంచనాలు పెంచేసుకున్నారు మూవీ లవర్స్. దీనికి తోడు రితేష్ రాణా – సత్య కాంబోలో వచ్చిన ‘మత్తు వదలరా’ (2019), ‘మత్తు వదలరా 2’ (2024) సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో తెల్సిందే. ఇక అనుకున్నంతగా ఆడని ‘హ్యాపీ బర్త్ డే’ (2022) లో సత్య పంచిన నవ్వులు అన్నీ ఇన్నీ కావు.

ALSO READ: చూడటానికి సాఫ్ట్.. కానీ మాటల్లో ఫైర్! కరిష్మా కపూర్ నెగెటివ్ వీడియో వైరల్!

సత్య కి జోడీగా మిస్ యూనివర్స్ ఇండియా 2024 

ఇక ఈ సినిమాలో సత్య కి జోడీగా మిస్ యూనివర్స్ ఇండియా 2024 విన్నర్ రియా సింఘా నటించడం సినిమాకే హైలెట్. ఇక సినిమాలో 15 వేల కోట్ల బ్యాంక్ స్కామ్ చేసి పారిపోతున్న బిలియనీర్ ప్రజాపతి పాత్రలో అజయ్ కనిపించబోతున్నాడని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. ఇక టెక్నికల్ గా చూస్తే కాల భైరవ ఇచ్చిన మ్యూజిక్, అందునా BGM సినిమాకి ప్రాణం పోసిందనే చెప్పాలి.

మైత్రీ మూవీ మేకర్స్ ప్రెజెంటేషన్ లో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చెర్రీ ప్రొడ్యూస చేసిన ఈ సినిమాకి సెన్సార్ నుంచి U/A సర్టిఫికెట్ రావడం చూస్తుంటే ఫ్యామిలీ అంతా కలిసి చూసే ఎంటర్ టైనర్ అని అర్థమయిపోతుంది. చూడాలి మరి సమ్మర్ ని టార్గెట్ చేస్తూ మే 1 న థియేటర్లలోకి రాబోతున్న ఈ జెట్లీ ఎలాంటి నవ్వులు కురిపిస్తుందో!

 

Related News

పవన్ ఫ్యాన్స్‌కి పూనకాలే.. OG యూనివర్స్ నుంచి అదిరిపోయే ట్రీట్!

‘రోమాంచకం’కు రెండో రోజే షాక్.. కలెక్షన్లు ఇలా పడిపోయాయేంటి?

డాన్సర్స్ అసోసియేషన్‌లో మళ్లీ రచ్చ.. సుమలతపై రఘు మాస్టర్ కౌంటర్!

డ్రాగన్ పై ప్రశాంత్ నీల్ బిగ్ అప్డేట్…స్పీడుమీదున్న తారక్!

ఏంటి నాని.. ఇంత హైప్ అవసరమా? ‘ది ప్యారడైజ్’పై అప్పుడే డౌట్స్!

సినిమాలోనే మ్యాజిక్ ఉంది…ఆకట్టుకుంటున్న ఎపిక్ ట్రైలర్!

రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. రూ.5 వేల పెన్షన్.. నట్టి కుమార్ ఆఫర్ ఇదే!

సమ్మర్ హీట్‌లో ప్రగ్యా జైస్వాల్ స్పెషల్ ట్రీట్.. నెట్టింట వైరల్!

Big Stories

Advertisement
×