E-Paper
Advertisement

రఘురామ కృష్ణరాజుకు ఢిల్లీ కోర్టులో ఊరట.. బ్యాంకు రుణాల కేసులో బెయిల్ మంజూరు

రఘురామ కృష్ణరాజుకు ఢిల్లీ కోర్టులో ఊరట.. బ్యాంకు రుణాల కేసులో బెయిల్ మంజూరు
Advertisement

దేశ రాజధాని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజుకు భారీ ఊరటనిచ్చింది. బ్యాంకు రుణాల ఎగవేతకు సంబంధించిన కేసులో నిందితుడిగా ఉన్న ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో రెండవ నిందితుడిగా (A-2) ఉన్న రఘురామ కృష్ణరాజు గురువారం నాడు కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. విచారణ జరిపిన న్యాయస్థానం దర్యాప్తు సమయంలో నిందితుడిని అరెస్ట్ చేయనందున ఆయనకు బెయిల్ మంజూరు చేయడం సముచితమని భావించింది.

రఘురామ కృష్ణరాజుతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో నలుగురికి కూడా న్యాయస్థానం ఊరటనిచ్చింది. రూ. 50,000 షురిటీ బాండ్‌పై వీరికి బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ సుమారు 15 వేల పేజీలకు పైగా ఉండటంతో నిందితుల తరపు న్యాయవాదులు కీలక విన్నపం చేశారు. అంత భారీ స్థాయిలో ఉన్న పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించడానికి (Scrutiny) సమయం కావాలని వారు కోర్టును కోరారు.

Advertisement

న్యాయవాదుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న రౌస్ అవెన్యూ కోర్టు పత్రాల పరిశీలన నిమిత్తం తదుపరి విచారణను జూలై 6, 2026 కి వాయిదా వేసింది. అలాగే ఈ కేసులో నిందితులుగా ఉన్న వివిధ కంపెనీల ప్రస్తుత స్థితిగతులపై కూడా కోర్టు ఆరా తీసింది. సదరు కంపెనీల లిక్విడేషన్ ప్రక్రియ ఏ దశలో ఉందో పూర్తి వివరాలను సమర్పించాలని సంబంధిత అధికారులను న్యాయస్థానం ఆదేశించింది.

కాగా, రఘురామ కృష్ణరాజుకు చెందిన ఇండ్‌ భారత్‌ థర్మల్‌ పవర్‌ లిమిటెడ్‌.. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, దాని అనుబంధ బ్యాంకుల నుంచి సుమారు 1,383 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్న ఈ సంస్థ, అందులో 826.17 కోట్ల రూపాయలను నిబంధనలకు విరుద్ధంగా ఇతర ఖాతాల్లోకి మళ్లించి బ్యాంకులను మోసగించినట్లు అభియోగాలు ఉన్నాయి.

Advertisement

Read Also: తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందా..? కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి ఏమంటున్నారంటే?

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×