E-Paper
Advertisement

సర్కారు బడి సత్తా అంటే ఇదే.. పదవ తరగతి ఫలితాల్లో మంథన్ గోడ్ పాఠశాల రికార్డులు..!

సర్కారు బడి సత్తా అంటే ఇదే.. పదవ తరగతి ఫలితాల్లో మంథన్ గోడ్ పాఠశాల రికార్డులు..!
Advertisement

SSC Results: స్వేచ్ఛ బ్యూరో: రెండు రోజుల క్రితం విడుదలైనటువంటి ఎస్ ఎస్ సి ఫలితాలలో మఖ్తల్ మండలంలో మన మంథన్ గోడ్ గ్రామం మూడో స్థానంలో ఉండడం గర్వించదగ్గ విషయమని సర్పంచ్ రాజేందర్ గౌడ్ అన్నారు. బుధవారం వెలువడినటువంటి పదవ తరగతి ఫలితాలలో నారాయణపేట జిల్లా మఖ్తల్ మండలం మంథన్ గోడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఉత్తీర్ణత సాధించిన సందర్భంగా గ్రామ సర్పంచ్ కలాల్ రాజేందర్ గౌడ్ ఆధ్వర్యంలో పదవ తరగతి ఫలితాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులను,ఉపాధ్యాయులను పాఠశాల ఆవరణలో ఘనంగా సన్మానించారు. ఇట్టి కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి ఖాజా అమీరుద్దీన్,మంథన్ గోడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలాల్ కృష్ణయ్య గౌడ్,కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు పులిమామిడి నరసింహ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

500కు పైగా మార్కులు..

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రాజేందర్ గౌడ్ మాట్లాడుతూ మంథన్ గోడ్ గ్రామానికి చెందిన పదవ తరగతి విద్యార్థులు రెండు రోజుల క్రితం వెలువడిన ఫలితాలలో పదిమంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించడంతోపాటు ప్రతి ఒక్కరు ఉత్తీర్ణత సాధించి కృషి పట్టుదల ఉంటేనే విజయం సాధిస్తాం అన్న మాట నిజమే అని నిరూపించుకున్నారన్నారు. విద్యార్థులు ఇంత చక్కటి ఫలితాలు సాధించారంటే వారి కృషి పట్టుదలతో పాటు వారి విజయానికి ఇల్లు బలంగా ఉండాలంటే పునాది బలంగా ఉండాలని చెప్తూ ఉంటాం అలాగే విజయానికి పునాదిగా బలంగా ఉన్నారని, తో పాటు పాఠశాలకు వచ్చాం వెళ్లిపోయాం అన్నట్టు కాకుండా మన పిల్లలను ప్రయోగజకులను చేయాలన్న దృఢ సంకల్పంతో నిరంతరం మార్గనిర్దేశనం చేసి ఈరోజు పదవ తరగతి ఫలితాల్లో బ్రహ్మాండమైన ఉత్తీర్ణత సాధించిన ఘనత మన ఉపాధ్యాయులకు చెందుతుందన్నారు.

Advertisement

Also Read: కమీషన్ల కక్కుర్తి కోసం రైతులను వేదిస్తారా.. రాంచందర్ రావు ఫైర్..!

ఈ కార్యక్రమంలో..

విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల అంకితభావం కలిసి ఈ అద్భుత ఫలితాలకు కారణమని కొనియాడారు. గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చిన వారందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సుదర్శన్ రెడ్డి, గ్రామ పెద్దలు దబ్బా సువ్వప్ప,ఎల్. చందర్, అశప్ప, జోగు శేఖర్, వార్డు సభ్యులు పులిమామిడి తిరుపతి, తెలుగు వెంకటేశ్, కుర్మయ్య, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ వడ్ల స్వప్న, బోడి సుజాత,ఉపాధ్యాయులు శ్రీనివాస్, వెంకటేశ్, సూర్య చంద్ర, నాగేశ్ తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement

Also Read: PSLలో మ‌రో అరాచ‌కం.. డ‌బ్బులు లేక ఆంటీల‌తో క్లీన్ చేయిస్తున్నారు, దొంగ‌ల్లా దూరేస్తున్నారు

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×