E-Paper
Advertisement

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!
Advertisement

Jhansi: ఝాన్సీ ..టీవీ యాంకరింగ్ లో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన ఈ వెర్సటైల్ యాక్టర్ ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది కూడా.ముఖ్యంగా ఈవిడ చేసిన టాక్ ఆఫ్ ది టౌన్ ప్రోగ్రాం టీవీ నాట ఒక సంచలనం.ఇక తులసి,అష్టా చమ్మా, సలార్ వంటి సినిమాలు ఆమె కెరీర్ లో మంచి గుర్తింపు ఇచ్చిన సినిమాలుగా నిలిచిపోయాయి.అయితే తెరపై తనదైన నటనతో నవరసాలు పండించే ఝాన్సీ జీవితంలో ఎన్నో కష్టాలు, అనుభవాలు ఉన్నాయని గాయత్రి భార్గవి ‘నవరస’ పాడ్‌కాస్ట్‌లో చెప్పుకొచ్చారు.

‘డబుల్ ఇస్మార్ట్’ షూటింగ్ సమయంలో తీరని విషాదం

Advertisement

ఈ ఇంటర్వ్యూలో ఝాన్సీ మాట్లాడుతూ ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా సమయంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ తనని తీవ్రంగా బాధించిందని తెలిపారు… తెల్లవారుజామున 3:30 గంటలకు తన మేనేజర్, హెడ్ డ్రెస్సర్ శ్రీను చనిపోయాడని తెలిసిందని ,అయినప్పటికీ సంజయ్ దత్ డేట్స్ అప్పుడే ఉండటంతో ఆ సినిమా షూటింగ్ లో పాల్గొనాల్సి వచ్చిందని తెలిపారు.

ఆ సీన్ లో తన కొడుకు చనిపోవడాన్ని చూసి తల్లి ఏడవాల్సి ఉంటుందని ఝాన్సీ కెమెరా ముందు అలాగే ఏడ్చానని, కానీ దర్శకుడు ‘కట్’ చెప్పిన తర్వాత కూడా తన కన్నీళ్లు ఆగలేదని గుర్తుచేసుకున్నారుఒకవైపు తనకు ఎంతో దగ్గరైన వ్యక్తిని కోల్పోయిన బాధ.. మరోవైపు కెమెరా ముందు నటించాల్సిన బాధ్యత. ఈ రెండింటి మధ్య తాను ఎంతటి మానసిక వేదనను అనుభవించానో మాటల్లో చెప్పలేనని ఝాన్సీ చెప్పుకొచ్చారు.

Advertisement

కెరీర్‌ను గమనిస్తే

ఝాన్సీ కెరీర్‌ను గమనిస్తే యాంకర్‌గా, నటిగా రెండు రంగాల్లోనూ తన సత్తా చాటడం మనకి తెల్సిందే. ఒకప్పుడు ఉదయం రేడియో జాకీగా పని చేస్తూ, మధ్యాహ్నం టీవీ కార్యక్రమాలు చేస్తూ, సాయంత్రం ఈవెంట్లలో పాల్గొంటూ చాలా బిజీగా ఉండేదానినని చెప్పుకొచ్చారు.

ఇన్ని పనులు చేస్తున్నప్పటికీ సినిమాల్లో నటించే అవకాశాలను కూడా వదులుకోలేదని, తనకు నచ్చిన పాత్ర వస్తే దాని కోసం ప్రయత్నించడానికి ఎప్పుడూ వెనుకాడలేదని చెప్పుకొచ్చారు ఇప్పటికే పేరు తెచ్చుకున్న నటినైనా, ఒక పాత్రకు తాను సరిపోతానని నిరూపించుకోవడానికి ఆడిషన్ ఇవ్వడంలో తప్పేమీ లేదని భావిస్తానని తన అభిప్రాయన్ని బయటపెట్టారు ఈ ఈ వెర్సటైల్ యాక్టర్.

ఇపుడు మీడియాలో హాట్ టాపిక్

మొత్తానికి, గాయత్రి భార్గవితో జరిగిన ఈ పాడ్‌కాస్ట్‌లో ఝాన్సీ తన జీవితంలోని సంతోషాలనే కాకుండా బాధాకరమైన అనుభవాలను కూడా పంచుకున్నారు.ముఖ్యంగా  ‘సలార్’ వంటి పెద్ద సినిమాలో అవకాశం రావడం ఒకవైపు సంతోషాన్ని ఇచ్చినా,తన మేనేజర్, హెడ్ డ్రెస్సర్ శ్రీను మరణంతో  ఆ ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించనివ్వలేదని ఝాన్సీ చెప్పిన మాటలు ఇపుడు మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి !

ALSO READ :జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

Tags

Related News

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఎవరీ సాత్విక.. ఒక్క టీజర్ తోనే ఊహించని క్రేజ్!

కీర్తి సురేష్ పుట్టినరోజు స్పెషల్.. ‘అక్క’ టీజర్ రిలీజ్ !

ఇండస్ట్రీలో విషాదం.. మ్యూజిక్ డైరెక్టర్ ‘దేవా’ కన్నుమూత!

హార్ట్ టచ్ ఫీలింగ్.. ఆకట్టుకుంటున్న దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్!

కావ్య మారన్ తో అనిరుధ్ పెళ్లి ఫిక్స్.. వారికి ప్రత్యేక ఆహ్వానం!

ఈ జనరేషన్‌కు మరో బ్రహ్మానందం దొరికేశాడు.. కోనా వెంకట్ కామెంట్స్!

Big Stories

Advertisement
×