Janu Liri Remuneration:జానులిరి ..తెలంగాణా ఫోక్ డాన్సర్ గా ఈమెకి ఎంత క్రేజ్ ఉందో చెప్పక్కర్లేదు.ముఖ్యంగా తనదైన స్టెప్పులతో పాటని మరింత హుషారుగా మారుస్తూ ఆడియన్స్ లోకి దూసుకెళ్ళేలా చేయడం ఈమె స్పెషాలిటీ అని చెప్పాలి.
ఇక తాజాగా తెలంగాణలో బతుకమ్మ సంబరాలు మొదలవడంతో నెట్టింట ఎంతో మంది పాటలు సందడి చేస్తున్న సంగతి తెల్సిందే.ఇక ఇదే క్రమంలో జానులిరి నటించిన
”సీమ లేవ్వలేదు ..సిమ్మ సీకటి కాదు పొద్దులు పొడవంగా మా కోడి కూసే ”అనే బతుకమ్మ రిలీజ్ కాగా రిలీజ్ అయిన వారం రోజుల్లోనే దాదాపు తొమ్మిది లక్షల వ్యూస్ కొల్లగొట్టడం విశేషం.దీంతో జాను లిరి అసలు ఒక్క పాటకి ఎంత తీసుకుంటుందా అంటూ ఆరాలు తీస్తున్నారు మూవీ లవర్స్.
కేవలం వెయ్యి రూపాయలకే
జాను లిరి కెరీర్ మొదలెట్టినప్పుడు కేవలం వెయ్యి రూపాయలకే డాన్స్ చేసిన సందర్భాలు ఉన్నాయని తనే పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.ఇక ప్రస్తుతం జాను లిరి ఒక్కో పాటకి దాదాపు లక్ష నుండి రెండు లక్షల రూపాయల మధ్య పారితోషికం తీసుకుంటుందన్న టాక్ వినిపిస్తుంది. అయితే ఈ పారితోషికం చేసే పాటని బట్టి మారుతుందని ,చిన్న స్థాయిలో చేసే పాటలకి ఇది కాస్త తక్కువగా ఉంటుందని, భారీ స్థాయిలో పాటలకి ఇది మరింత పెరిగే అవకాశం కూడా ఉందని ఫోక్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట.
1500 నుండి రెండు వేల వరకు ఫోక్ సాంగ్స్
ఇక వీటికి తోడు ఈవెంట్లలో , షోలలో కూడా తన క్రేజ్ ని తగ్గట్టుగానే రెమ్యూనరేషన్ తీసుకుంటుందని తెలుస్తుంది.ఇక వీటికి తోడు జాను లిరి అనే యూట్యూబ్ చానల్ ద్వార కూడ మనీ వస్తుంది అన్న సంగతి తెల్సిందే.ఇక ఇప్పటి వరకు జాను లిరి దాదాపు 1500 నుండి రెండు వేల వరకు ఫోక్ సాంగ్స్ లో డాన్సర్ గా నటించడం విశేషం.
పాటల విషయానికి వస్తే
ఇక జాను లిరి పాటల విషయానికి వస్తే ముఖ్యంగా మంగ్లీ ,కనకవ్వ కలిసి పాడిన ఆడ నెమలి (Aada Nemali) అనే పాటలో జాను లిరి, మంగ్లీ కలిసి డాన్స్ చేయగా ఈ పాట ఎంత ఫేమస్ అయ్యిందో చెప్పక్కర్లేదు.యూట్యూబ్ లో ఈ పాట ఏకంగా 36 కోట్ల వ్యూస్ ని కొల్లగొట్టి జానులిరి డాన్స్ కి ఉన్న పవర్ ఏంటో ప్రూవ్ చేసింది.
ఇక జానులిరి చేసిన మిగతా పాటల విషయానికి వస్తే చెయ్యవోయ్ పిల్లగా (Chayiyyavoy Pilaga), ఓ వెన్నెల (Oh Vennela),చెయ్యి పట్టు బావ (Cheye Pattu Bava)చీరలు లేవ్ రైయికలు లేవ్ (Chiralu Lev Raiyikal Lev),మరదలు పిల్ల (Maradhalu Pilla)వంటి ఎన్నో పాటలు ఇపుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
మాధురి రాథోడ్ లైఫ్లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!
ఏది ఏమైనా ఒకప్పుడు వెయ్యి రూపాయల పారితోషికం తీసుకున్న జాను లిరి ఇపుడు లక్షరూపాయల పారితోషికం తీసుకునేలా ఎదగడం నిజంగా మెచ్చుకోతగ్గ విషయం.