E-Paper
Advertisement

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?
Advertisement

Araku Bamboo Chicken: విశాఖ మన్యానికి వెళ్లిన ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులను చేసేవి అక్కడి అందాలు మాత్రమే కాదు.. అడవి గాలిలో ఘుమఘుమలాడే ‘బొంగు చికెన్’ సువాసనలు కూడా. వెదురు బొంగులో నూనె చుక్క కూడా లేకుండా.. బొగ్గుల నిప్పుల మీద తయారుచేసే ఈ వంటకం రుచి మామూలుగా ఉండదు. కొండల మధ్య, మంచు తెరల సందులో వేడివేడిగా ఆకులు పరిచి వడ్డించే ఆ బొంగు చికెన్ తింటుంటే కడుపుతో పాటు మనసూ నిండిపోతుంది. కానీ ఈ అద్భుతమైన రుచిని ఆస్వాదించడానికి ప్రతిసారీ అరకు వెళ్లాల్సిన అవసరం లేదు. మన వంటింట్లోనే, సాధారణ వెదురు బొంగు సహాయంతో ఆ సాంప్రదాయక నాటు రుచిని ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు ఇవే:

చికెన్ – అర కిలో
వెదురు బొంగు – ఒకటి
అల్లం వెల్లుల్లి పేస్ట్ – రెండు చెంచాలు
పచ్చిమిర్చి – నాలుగు
కారప్పొడి – రెండు చెంచాలు
ధనియాల పొడి – ఒక చెంచా
గరం మసాలా – ఒక చెంచా

Advertisement

Also Read: హోటల్ స్టైల్ క్రిస్పీ ఇన్‌స్టంట్ రవ్వ దోశ.. 15 నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి!
నిమ్మరసం – రెండు చెంచాలు
పసుపు – అర చెంచా
ఉప్పు – రుచికి సరిపడా
పుదీనా తురుము – గుప్పెడు
కొత్తిమీర తురుము – గుప్పెడు
కరివేపాకు – కొద్దిగా
తమలపాకులు లేదా అరిటాకు – రెండు

తయారీ విధానం:

చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి, నీళ్లు లేకుండా పక్కన పెట్టుకోవాలి. ఒక వెడల్పాటి పాత్రలో చికెన్ తీసకుని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారప్పొడి, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, నిమ్మరసం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి తరుగు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కూడా చేర్చి ముక్కలకు మసాలాలన్నీ బాగా పట్టేలా బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కనీసం ఒక గంట సేపు నాననివ్వాలి. ఇలా మ్యారినేట్ చేయడం వల్ల మసాలాలు చికెన్ లోపలికి దిగి రుచి అద్భుతంగా వస్తుంది.

Advertisement

ఇప్పుడు తీసుకున్న వెదురు బొంగును లోపల, బయట శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలను ఒక్కొక్కటిగా ఈ వెదురు బొంగు లోపలికి నింపాలి. చికెన్ మొత్తం వేసిన తర్వాత, బొంగు మూతిని మడవబడిన తమలపాకులు లేదా అరిటాకులతో గట్టిగా మూసివేయాలి. గాలి బయటకు పోకుండా ఆకులను గట్టిగా అమర్చడం చాలా ముఖ్యం.

తర్వాత బొగ్గుల నిప్పులను సిద్ధం చేసుకుని, ఈ వెదురు బొంగును ఆ నిప్పుల మీద ఉంచాలి. అన్ని వైపులా సమానంగా కాలేలా బొంగును తిప్పుతూ 30 – 40 నిమిషాల పాటు కాల్చుకోవాలి. వెదురు కాలే కొద్దీ లోపల చికెన్ స్వచ్ఛమైన ఆవిరి, వెదురు వాసనతో ఉడుకుతుంది. బొంగు నల్లగా మారి కాలిన సువాసన రాగానే నిప్పుల మీద నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి. కాసేపటి తర్వాత ఆకు మూత తీసి చికెన్‌ను పళ్లెంలోకి తీసుకుంటే.. ఎంతో రుచికరమైన అరకు బొంగు చికెన్ సిద్ధమైనట్లే.

Also Read: సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా చేసి పెట్టండి ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!

Tags

Related News

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

Big Stories

Advertisement
×