Jr NTR Devara 2 Movie: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘దేవర’. రెండు భాగాలుగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ 2024 సెప్టెంబర్ 27న విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సొంతం చేసుకుంది. సుమారు రూ. 500 పైగా కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. నిజానికి విడుదలకు ముందు దేవర భారీ అంచనాలు ఉన్నాయి.
ఇది వెయ్యి కోట్ల సినిమా అవుతుందని మూవీ టీం గట్టిగా నమ్మింది. కానీ, రూ. 500 కోట్లతోనే సరిపెట్టింది. అయితే రిలీజ్ కి ముందు మూవీపై ప్రమోషన్స్ బాగా చేసి విపరీతమైన బజ్ పెంచారు. దీంతో విడుదల తర్వాత దేవర ఆ స్థాయిలోప్రేక్షకులను మెప్పించలేకపోయింది. పాన్ ఇండియాగా ఈ చిత్రం తెలుగులోనూ మంచి రెస్పాన్స్ అందుకుంది. హిందీ ఆడియన్స్ నుంచి ఆశించి రెస్పాన్స్ రాలేదు. ఇక సౌత్‌లోనూ అంతమాత్రం టాక్ తెచ్చుకుంది. కానీ తెలుగులో మాత్రం దేవర దుమ్ముదులిపింది. ఎన్టీఆర్ తండ్రికొడుకులు డ్యుయెల్ రోల్లో ఈ తెరకెక్కిన ఈ సినిమా తొలి పార్ట్ మాత్రం తండ్రి దేవర పాత్ర చూట్టు తిరిగింది. ఇక సెకండ్ పార్ట్ కొడుకు వర పాత్ర హైలెట్ చేస్తూ సాగనుంది. అయితే మూవీ విడుదలైన ఏడాది దాటిన ఇంకా దేవర 2పై ఎలాంటి అప్డేట్ లేదు.
మొన్నటి వరకు తారక్ వార్ 2 చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీంతో దేవర 2 ఆలస్యం అయ్యింది. వార్ 2 షూటింగ్ పూర్తయ్యి విడుదల కూడా అయిపోయింది. కానీ, ఇప్పటి వరకు దేవర 2 నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. ఈ క్రమంలో ఈ సినిమా ఆగిపోయిందనే టాక్ వినిపించింది. అది తెలిసి ఫ్యాన్స్ అంత షాక్ అయ్యారు. అదే టైంలో దేవర పార్ట్ వచ్చి ఏడాది అయిన సందర్భంగా సెప్టెంబర్‌లో పార్ట్ 2 ఉంటుందంటూ మూవీ అప్‌డేట్ వదిలింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. పార్ట్ 2 ఉంటుందన్నారు. కానీ, ఎప్పుడు సెట్‌పైకి తీసుకువస్తారన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. మూవీ అప్‌డేట్ అప్‌డేట్ ఇవ్వడంతో దేవర 2 ఉంటుందని ఫ్యాన్స్ అంతా గట్టి నమ్మకం పెట్టుకున్నారు. ఈ డిసెంబర్‌లో మూవీ లాంచ్ కూడా ఉండోచ్చనే ప్రచారం కూడా జరుగుతున్న తరుణంలో మళ్లీ ఫ్యాన్స్‌ని నిరాశ పరిచే అప్‌డేట్ ఒకటి సినీ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.
దేవర 2 పూర్తిగా రద్దయ్యిందంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్న ఎన్టీఆర్.. ఇప్పుడు దేవర 2 చేసేందుకు ఆసక్తిగా లేడట. కొరటాల శివతో ఈ సినిమా చేయనని చెప్పినట్టు గట్టి టాక్ వినిపిస్తుంది. ఇది నిజమని, ఇక దేవర 2 ప్రాజెక్ట్ పూర్తిగా రద్దయినట్టే అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు. కానీ, దేవర 2 వస్తుందా? రాదా? ఇప్పటికే సందేహంలో ఉన్న ఫ్యాన్స్ ఈ లేటెస్ట్ బజ్ ఆందోళన కలిగిస్తుంది. మరి ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే మూవీ టీం నుంచి ఆఫీషియల్ ప్రకటన వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే. కాగా జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం సైఫ్ అలిఖాన్ ప్రతికథానాయకుడిగా.. శ్రీకాంత్ కీలక పాత్రలో నటించారు.