E-Paper
Advertisement

Aarohi: ఒడిలో నిద్రిస్తున్న చిన్నారి మాయం.. 6 నెలలు తర్వాత ఊహించనిది జరిగింది, కన్నీళ్లు పెట్టించే ఘటన!

Aarohi: ఒడిలో నిద్రిస్తున్న చిన్నారి మాయం.. 6 నెలలు తర్వాత ఊహించనిది జరిగింది, కన్నీళ్లు పెట్టించే ఘటన!

‘DNA’ సినిమాలో అప్పుడే పుట్టిన పాపను మార్చేస్తారు. తల్లికి తన పక్కన ఉన్నది పేగు తెంచుకు పుట్టిన బిడ్డకాదని తెలిసి పడే వేదన.. తన బిడ్డ ఎక్కడ ఉందో తెలియక అనుభవించే నరకయాతన గురించి గుండె ద్రవించేలా కథను ముందు నడిపించాడు దర్శకుడు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో కళ్లు చెమర్చిన వారే. అచ్చం ఇలాంటి ఘటనే నిజ జీవితంలోనూ జరిగింది. ముంబైలో మాయమైన చిన్నారి, ఆరు నెలలకు వారణాసిలో దొరికింది. ‘DNA’ సినిమాను తలదన్నే వాస్తవ ఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ముంబైలో చిన్నారి అదృశ్యం!

మే 20, 2025. అర్థరాత్రి అవుతోంది. ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌ లో ఒక చిన్న అమ్మాయి తన తల్లి ఒడిలో నిద్రపోతోంది. పేరు ఆరోహి. వాళ్ల సొంతూరు షోలాపూర్‌. తండ్రికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో చికిత్స కోసం ముంబైకి వచ్చారు. దూరం నుంచి రావడంతో బాగా అలసిపోయారు. రైల్వే స్టేషన్ లోనే నిద్రపోయారు.  కొంత సేపటి తర్వాత లేచి చూసే సరికి తల్లి ఒడిలో ఉండాల్సిన బిడ్డ కనిపించలేదు. చుట్టు పక్కల వెతికింది. ఎక్కడా లేదు.  ‘ఆరోహీ.. ఆరోహీ..’ అని గొంతుపోయేలా పిలిచింది. అయినా రాలేదు.  తెలియని బాధ, తన్నుకొస్తున్న దుఃఖం, కంటి నుంచి జలజల రాలుతున్న నీళ్లు. ఏం చేయాలో తెలియలేదు. నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి విషయం చెప్పారు. పోలీసులు కేసును విచారణ మొదలు పెట్టారు.  రోజులు గడుస్తున్నాయి.. కేసులో ఎలాంటి పురోగతి లేదు. చేతిలో పాప ఫోటో పట్టుకుని తల్లిదండ్రులు తిరగని ప్రదేశం అంటూ లేదు. రైల్వే స్టేషన్లు, రైళ్లు, మురికివాడలు, అనాథాశ్రమాలు, కనిపించి ప్రతి మనిషికీ ఆ ఫోటో చూపించి బిడ్డ ఆచూకీ కోసం అడిగారు. ఆరు నెలలు తండ్రి నిద్రపోలేదు. తల్లి తినలేదు. ఇద్దరూ కాళ్లు కాయలు కాసేలా తిరిగారు.

వారణాసిలో పట్టాల పక్కన ప్రత్యక్షం!

సీన్ కట్ చేస్తే..  1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారణాసిలో..  జూన్‌ లో రైల్వే పట్టాల దగ్గర ఏడుస్తూ, చెప్పులు లేకుండా, భయం భయంగా చూస్తూ ఓ పాప కనిపించింది. తన అసలు పేరు గుర్తులేదు. అమ్మాయి తనను తాను ‘కాశీ’ అని పిలుచుకుంటుంది. కొంత మంది స్థానికులు ఆమెను గుర్తించి అనాథాశ్రమంలో చేర్పించారు. తినడానికి ఆహారం, పడుకునేందుకు మంచం ఇచ్చారు అక్కడి సిబ్బంది. కొత్త పేరు పెట్టారు. కొన్నిసార్లు రాత్రిపూట ఆమె తన దుప్పటి అంచుని పట్టుకుని ‘ఆయ్.. ఆయ్..’(మరాఠీలో తల్లి) అని కలవరించేది. కానీ, అక్కడి వారికి ఆమె ఏమంటుందో అర్థం అయ్యేది కాదు.

పాప కోసం ఆగని ప్రయత్నాలు!

తప్పిపోయిన పాప కోసం ముంబై పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. తల్లిదండ్రులు ఆమె కోసం రోజూ పోలీస్ స్టేషన్ కు వెళ్లి వచ్చేవారు. వారి బాధను చూసి ఖాకీలూ కంటతడి పెట్టేవారు. కొద్ది వారాల తర్వాత ఆరోహి ఫోటోలతో పోస్టర్లు ప్రింట్ చేశారు. లోకమాన్య తిలక్ టెర్మినస్ నుంచి భూసావల్, వారణాసి కాంట్ వరకు ప్రతి ప్లాట్‌ ఫామ్‌ పై వాటిని అతికించారు. పేపర్లలో ప్రకటనలు ఇచ్చారు.  ఆమె తల్లిదండ్రులు వందల ఇళ్లకు వెళ్లి తలుపు తట్టారు. తమ బిడ్డ గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. సాయం కోసం జర్నలిస్టులను కలిసి తన బాధను చెప్పుకున్నారు.  పోలీసులు నిజంగా ఎఫర్ట్ పెట్టి, పాప కోసం వెతకడం మొదలు పెట్టారు. ఆమె ఫోటోను తమ చొక్కా జేబుల్లో పెట్టుకుని సొంత బిడ్డ తప్పిపోయినట్లు ఫీలయ్యారు.

పాప పోస్టర్లు చూసి గుర్తుపట్టిన లోకల్ రిపోర్టర్!

నవంబర్ 13న వారణాసిలోని ఓ లోకల్ రిపోర్టర్ ఆ పాప పోస్టర్ చూశాడు. ఆ పాపను ఎక్కడో చూసినట్లు గుర్తుకు వచ్చింది. నిద్రలో మరాఠీ పదాలు మాట్లాడే అమ్మాయిని ఈ అమ్మాయేనని కన్ఫార్మ్ చేసుకున్నాడు. వెంటనే, తను ముంబై పోలీసులకు కాల్ చేశాడు. విషయం తెలియడంతో ఓ పోలీస్ ఇన్ స్పెక్టర్ వారణాసికి వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం సదరు పోలీస్ ఇన్‌స్పెక్టర్ ల్యాప్‌ టాప్ ముందు కూర్చుని వీడియో కాల్ చేశాడు. ముంబైలో క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారి వెనుక పాప తల్లిదండ్రులు నిలబడి ఉన్నారు. కంప్యూటర్ స్క్రీన్‌ మీద పింక్ ఫ్రాక్‌ లో ఉన్న ఓ చిన్న అమ్మాయి కనిపించింది. ఆమె తప్పిపోయిన రోజు తను వేసుకున్న డ్రెస్సు అదే. బిడ్డను చూసి ఆ తల్లి కుప్పకూలిపోయింది. తండ్రి “ఆమె మా ఆరోహినే.. ఆమే నా బిడ్డ అంటూ రోదిస్తూ చెప్పాడు.

నవంబర్ 14.. బాలల దినోత్సవం నాడు మళ్లీ తల్లి ఒడికి..   

వారణాసికి వెళ్లిన ముంబై పోలీసులు.. అక్కడి ఫార్మాలిటీస్ పూర్తి చేసి..  పాపను విమానంలో తీసుకొచ్చారు. ఆమె ముంబైకి చేరుకునే సమయానికి.. ముంబై క్రైమ్ బ్రాంచ్ అంతా ఎదురు చూస్తుంది. ఆమె కోసం కొత్త డ్రెస్సు, బెలూన్స్ కొని తెచ్చారు. అమ్మాయి ఎయిర్ పోర్టు నుంచి బయటకు వస్తూనే, పోలీసు అధికారి వైపు చేతులు చాచుతూ చిరునవ్వుతో వెళ్లింది. ఆమెను సదరు అధికారి ఎత్తుని హత్తుకున్నాడు. ఆమె అతడి మెడను చేతిలతో ప్రేమగా చుట్టేసింది. ఆమె తల్లిదండ్రులు ముందుకు నడవలేకపోయారు. పోలీసులే ఆ పాపను వారి దగ్గరికి తీసుకెళ్లారు. తల్లి తన బిడ్డను గుండెకు హత్తుకుంది. బిడ్డ ముఖాన్ని మరీ మరీ తడిమి చూసింది. తండ్రి ఆమె పాదలకు ముద్దుపెట్టాడు. తను పడిన బాధను కన్నీళ్ల రూపంలో వెళ్ల గక్కాడు. తల్లిదండ్రుల దగ్గర ఉండి, పోలీసుల వైపు చూస్తూ కల్మషం లేని నవ్వులు నవ్వింది.  ఆరు నెలల ఎదురు చూపులు ఫలించాయి. పోలీసులు పాపను తల్లిదండ్రులకు అప్పగించి కేసు ఫైల్ క్లోజ్ చేశారు. ఆరోహి ఇప్పుడు తన ఇంటికి చేరుకుంది. తల్లి ఆమెకు జోలపాట పాడుతుంది. తండ్రి నిద్రలో నవ్వుతున్నాడు. కిడ్నాపర్ ఇంకా బయట ఉన్నాడు. కొన్నిసార్లు ఖాకీ యూనిఫాం దొంగలను పట్టుకోకపోవచ్చు. కానీ, తప్పిపోయిన పిల్లలను వారి తల్లిదండ్రుల దగ్గరికి చేర్చడంలో ముందుంటుంది.

Read Also: 2026లో భూమి అంతం? దీనిపై AI ఏం చెప్పిందో తెలుసా? ఇది చదివితే ఆశ్చర్యపోతారు!

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×