E-Paper
Advertisement

సిల్వర్ జూబ్లీ ఇయర్‌లో బీఆర్ఎస్.. నాటి నుండి నేటి వరకు ముందున్న లక్ష్యం అదే..?

సిల్వర్ జూబ్లీ ఇయర్‌లో బీఆర్ఎస్.. నాటి నుండి నేటి వరకు ముందున్న లక్ష్యం అదే..?
Advertisement

BRS Journey: స్వేచ్ఛ బ్యూరో: బీఆర్‌ఎస్‌ ఆవిర్భవించి ఏప్రిల్‌ 27 నాటికి 25 ఏండ్లు పూర్తయ్యి, 26వ వసంతంలోకి అడుగుపెడుతున్నది. పార్టీని స్థాపించిన నాటి నుంచి ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంది. అయినా వెరువక విజయ తీరాలను ముద్దాడింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్‌ఎస్‌ 14 ఏండ్లు అవిరామంగా పోరాటం చేసి, అనేక ఉద్యమాలు చేసింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా ప్రజల్లో బీఆర్‌ఎస్‌ సుస్థిరస్థానం సంపాదించింది. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల హృదయాల్లో ఇంటి పార్టీగా నిలిచింది. రాష్ట్ర సాధన అనంతరం బీఆర్‌ఎస్‌ తన పదేండ్ల పరిపాలనలో అటు అభివృద్ధిలో ఇటు ప్రజా సంక్షేమంలోనూ ఊహించని విజయాలు సాధించి తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపింది.

కొండాలక్ష్మణ్ బాపూజీ నివాసం

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంతో 2001 ఏప్రిల్‌ 27న తెలంగాణ అస్తిత్వ పతాకగా పురుడుపోసుకున్న పార్టీ టీఆర్ఎస్. నేటి బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ పదవికి, శాసనస సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు టీడీపీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసి పార్టీని స్థాపించారు. కొండాలక్ష్మణ్ బాపూజీ నివాసం జలదృశ్యంలో పార్టీ ఆవిర్భవించింది. ఏడాదికిపైగా జలదృశ్యంలోనే టీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలు సాగాయి. ఆతర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పార్టీ ముఖ్యపాత్ర పోషించింది. 2001 మే 17న కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్ లో నిర్వహించిన బహిరంగ సభ ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో పెను మార్పులకు బీజం వేసింది. పార్టీకి సైద్ధాంతిక భూమిక కల్పించడం దగ్గర్నుంచి కార్యాచరణను నిర్దేశించడం వరకు, తెలంగాణ సమాజాన్ని, దేశ రాజకీయ వ్యవస్థ స్వభావాన్ని లోతుగా అధ్యయనం చేసి, అర్థం చేసుకుని, తెలంగాణ ఉద్యమ వ్యూహానికి రూపకల్పన చేశారు.

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా..

Advertisement

2001లో ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి దాకా బీఆర్‌ఎస్‌ అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నది. పార్టీ పెట్టినప్పుడు అసలు ఈ పార్టీ ఉంటదని, ‘మఖలో పుట్టి పుబ్బలో పోతది’ అని, కేసీఆర్‌ పదవుల కోసమే పార్టీ పెట్టిండని, తెలంగాణపై ఆయనకు చిత్తశుద్ధి లేదని ఆయనపై ముప్పేటదాడి జరిగింది. చంద్రబాబు ఎత్తులతో శిథిలావస్థలో చిక్కిశల్యమైన కాంగ్రెస్‌ పార్టీ బీఆర్‌ఎస్‌తో 2004లో పొత్తుపెట్టుకోవటం వల్ల ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చాక తెలంగాణ వాదం లేదని నిరూపించేందుకు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నకాలంలో బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి బీఆర్‌ఎస్‌ను నిట్టనిలువునా చీల్చారు. తెలంగాణ వాదం లేదని నమ్మబలికే ప్రయత్నం చేస్తే 2006లో కేసీఆర్‌ కేంద్ర మంత్రి పదవికి మాత్రమే కాకుండా కరీంనగర్‌ ఎంపీ పదవికీ రాజీనామా చేశారు.

Also read: నోరు జారితే రాజకీయ భవిష్యత్తు ఖతం.. కాంగ్రెస్ అధిష్టానం సంచలన నిర్ణయం!

‘కేసీఆర్‌ సచ్చుడో తెలంగాణ వచ్చుడో..

Advertisement

తెలంగాణవైపు దేశం తిరిగి చూసేలా చేశారు. ‘కేసీఆర్‌ సచ్చుడో తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్‌ శవయాత్రో తెలంగాణ జైత్రయాత్రో’ అని నినదించి నవంబర్‌ 29, 2009 ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. డిసెంబర్‌ 9 తెలంగాణ ప్రకటనతో కేంద్రం దిగివచ్చేలా కేసీఆర్, బీఆర్‌ఎస్‌ పార్టీచేసింది. కానీ, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో డిసెంబరు 23న ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. తెలంగాణ పదాన్నే అసెంబ్లీలో నిషేధించిన టీడీపీతో 2009 ఎన్నికల్లో పొత్తుపెట్టుకొని ఆ పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునేలా అనివార్యతను కేసీఆర్‌ సృష్టించారు. తెలంగాణ ఏర్పాటుపై అందరి అభిప్రాయాలను సేకరించేందుకు శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ దశలో టీఆర్ఎస్ మిగిలిన పార్టీలతో కలిసి తెలంగాణ పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడింది. పొలిటికల్ జేఏసీ ప్రత్యేక తెలంగాణ కోసం కేంద్రంపై ఒత్తిడిని తీవ్రం చేసింది.

2014 దాకా తెలంగాణ కోసం..

2010 డిసెంబరు 16న వరంగల్‌లో టీఆర్‌ఎస్‌ తలపెట్టిన మహా గర్జనకు 20 లక్షల మంది హాజరయ్యారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పణ తరర్వాత 2011 జనవరి నుంచి టీఆర్‌ఎస్‌ అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. 2014 దాకా తెలంగాణ కోసం ఎన్ని వ్యూహాలు? ఎన్ని పోరాట మార్గాలు? గతానుభవాలు నేర్పిన పాఠాలతో ఈసారి తెలంగాణ వెనక్కి వెళ్లిపోతే ఇక తెలంగాణ నినాదమే ఆఖరికి అసెంబ్లీలోనే కాదు, సమాజంలోనూ తెలంగాణ పదం శాశ్వత నిషేధమేనని గ్రహించిప్రజల్లో సడలిపోయిన తెలంగాణ విశ్వాసాన్ని ఒక్కసారిగా ఆకాశమంత ఎత్తులో నిలిపారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వారానే తెలంగాణ సాధ్యమని, అందుకు అన్ని పార్టీల మద్దతు అవసరమని మెలికపెడితే.. ఒక్క పార్టీకూడా మద్దతు ఇవ్వని తెలంగాణకు దేశంలోని 36 పార్టీలు మద్దతిచ్చేస్థాయికి తీసుకొచ్చి లేఖలు తెప్పించారు.

2013 అక్టోబరులో..

తెలంగాణకు అడ్డంపడ్డవాళ్లతోనే ‘జై తెలంగాణ’ అనిపించి, ఎదుటివారి రాజకీయ అనివార్యతను తనకు అనుకూలంగా మలుచుకొని దాన్ని తెలంగాణకు బలంగా మార్చారు కేసీఆర్. ఎంచుకున్న లక్ష్యసాధన కోసం ప్రతి సందర్భాన్ని తెలంగాణ సందర్భంగా మలిచిన చరిత్ర కేసీఆర్‌ది. ఆందోళనలు, ఆమరణ నిరాహారదీక్షలు, బహిరంగసభలు మాత్రమే కాదు ఉప ఎన్నికలను సైతం ఉద్యమవ్యూహంగా మలిచారు. బీఆర్‌ఎస్‌ పార్టీ తన 26 ఏండ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని శిలాసదృశంగా మలిచిన చరిత్ర బీఆర్‌ఎస్‌ది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగా 2013 అక్టోబరులో తెలంగాణ బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 2014 ఫిబ్రవరి 18న లోక్‌సభ, 20న రాజ్యసభ ఆమోదం తెలిపింది. మరో వైపు 2014 ఏప్రిల్‌లో సాధారణ ఎన్నికలు జరుగగా, మే 16న ఫలితాలు వచ్చాయి. తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు గాను టీఆర్‌ఎస్‌ 63, 11లోక్‌సభ స్థానాలను గెలుపొందింది. దీంతో తెలంగాణలో జూన్‌ 2న రాష్ట్ర ఆవిర్భావంతో పాటు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ప్రమాణ స్వీకారం చేశారు.

Also Read: స్టూడెంట్స్‌కు భారీ గుడ్ న్యూస్.. ఏడాదికి రూ.48,000 స్కాలర్ షిప్, ఈ విద్యార్హత ఉంటే చాలు..!

ఉద్యమనాయకుడిగా కేసీఆర్‌.. 

2018 డిసెంబరులో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 88 స్థానాల్లో గెలుపొంది రెండో సారి అధికారంలోకి రావడంతో కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2014 నుంచి పదేండ్ల పాటు అంతకుముందు 14 ఏండ్లపాటు ఉద్యమనాయకుడిగా కేసీఆర్‌ను చూశారు. తన పదేండ్ల పాలనా కాలంలో తెలంగాణను అన్ని రంగాల్లో అకాశమంత ఎత్తున నిలిపారు. తెలంగాణ వస్తే కరెంట్‌లేక ‘చీకటి’ రాజ్యమేలుతుందని, నక్సలిజం పెట్రేగిపోతుందని, పద్నాలుగేండ్ల ఉద్యమ తెలంగాణ నిత్యం ఆందోళనలతో కూరుకుపోతుందని, సాగునీరు లేక, తాగునీరులేక, పాలించే నైపుణ్యం లేక తెలంగాణ ఎందుకూ పనికిరాకుండాపోతుందని శాపనార్థానాలు పెట్టినవారు కేసీఆర్‌ సారధ్యంలోని బీఆర్‌ఎస్‌ పాలనను చూసి కాపీ కొట్టాల్సిన అనివార్యతలను తెలంగాణ సృష్టించింది. ఈ క్రమంలో ఎన్నో ఆటుపోట్లను చవిచూసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారింది.

2022 అక్టోబర్ 5న బీఆర్ఎస్ గా మార్పు

టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా 2022 అక్టోబర్4న పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జాతీయపార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితిగా కేసీఆర్ ఖరారు చేశారు. అక్టోబర్ 5న బీఆర్ఎస్ పార్టీగా మార్చారు. డిసెంబర్ 9న తెలంగాణ భవన్ లో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా మధ్యాహ్నం 1.20 గంటలకు బీఆర్ఎస్ పత్రాలపై కేసీఆర్ సంతకం చేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. 2023 జనవరి 18న ఖమ్మంలో తొలిబహిరంగసభ నిర్వహించారు.

2023లో పార్టీకి గడ్డుకాలం

బీఆర్ఎస్ పార్టీకి 2023లో గడ్డుకాలం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాల్లో పోటీ చేసింది. కానీ 39 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ప్రధాన ప్రతిపక్షానికే పరిమితం అయింది. ఊహించని ఫలితాలు వచ్చాయి. మూడోసారి అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టిస్తుందని అందరూ భావించారు. దేశ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషిస్తుందని అంచనాలు సైతం వేశారు. కానీ అసెంబ్లీ ఫలితాలు మాత్రం అందుకు విరుద్దంగా వచ్చాయి. 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఊహకందని విరుద్దంగా ఫలితం వచ్చింది. 17 స్థానాల్లో పోటీ చేయగా ఒక్కస్థానంలో బీఆర్ఎస్ విజయం సాధించలేదు. పార్టీ స్థాపించిన నాటి నుంచి ఇదే ఘోరపరాజయం. ఎక్కువ సీట్లలో మూడోస్థానికి పరిమితం కావడం, మెదక్ ఎంపీ స్థానాన్ని సైతం ఓడిపోయింది. 2025లో జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు పార్టీకొంత ఊరట నిచ్చాయి. పంచాయతీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో 3502 సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించింది. మున్సిపల్ ఎన్నికల్లోనూ18 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఓట్లశాతం సైతం అసెంబ్లీ ఎన్నికల కంటే పెరిగింది.

Also Read: కేసీఆర్ ‘చావు’ రాజ‌కీయాల‌పై రేవంత్ మార్కు పంచులు! కేసీఆర్ పిట్ట‌క‌థ‌.. రేవంత్ ఒక్క‌దెబ్బ‌కు రెండు పిట్ట‌లు

Related News

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

Big Stories

Advertisement
×