E-Paper
Advertisement

భారత్‌లోకి వచ్చేసిన Motorola Edge 70 Pro.. 50MP సెల్ఫీ కెమెరా, ఏఐ ఫీచర్లు.. ధర తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

భారత్‌లోకి వచ్చేసిన Motorola Edge 70 Pro.. 50MP సెల్ఫీ కెమెరా, ఏఐ ఫీచర్లు.. ధర తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!
Advertisement

Motorola Edge 70 Pro Lunched: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ మోటరోలా తమ Edge సిరీస్‌లో మరో పవర్‌ఫుల్ ఫోన్‌ Motorola Edge 70 Proను ఇండియాలోకి తీసుకొచ్చింది. కేవలం చూడటానికి స్టైలిష్‌గా ఉండటమే కాదు.. దీనిలో అద్భుతమైన AI ఫీచర్లు, కెమెరా క్వాలిటీ, అదిరిపోయే పర్ఫార్మెన్స్‌ను అందించారు. క్వాడ్ కర్వ్డ్ డిస్‌ప్లేతో ప్రీమియం లుక్ ఇస్తూనే.. రఫ్ అండ్ టఫ్ వాడకానికి తట్టుకునేలా దీన్ని తయారు చేశారు. ఇప్పుడీ ఫోన్ పూర్తి వివరాల్లోకి వెళ్లిపోదాం..

5200 నిట్స్ బ్రైట్‌నెస్..

ఈ Motorola Edge 70 Proలో ఆకట్టుకునే విషయం దీని 6.8 అంగుళాల డిస్‌ప్లే. ఎండలో ఉన్నా కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 5200 నిట్స్ బ్రైట్‌నెస్ ఇచ్చారు. ఇక మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్ వాడటం వల్ల ఫోన్ అస్సలు హ్యాంగ్ అవ్వదు. హెవీ గేమ్స్ ఆడినా లేదంటే ఎక్కువ యాప్స్ వాడినా చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. అలాగే దీనిలో 12GB వరకు RAM ఉండటం వల్ల మల్టీ టాస్కింగ్ చాలా ఈజీ అయిపోతుంది.

Advertisement

Also Read: రూటర్ మీద కాయిన్ పెడితే Wi-Fi స్పీడ్ పెరుగుతుందా? పొరపాటున కూడా ఆ పని చేయొద్దు, ఎందుకంటే?

రోజంతా వాడినా తగ్గని బ్యాటరీ..

దీని వెనుక వైపు మూడు 50MP కెమెరాలు ఉండటం వల్ల డే అండ్ నైట్ ఫొటోలు చాలా క్లారిటీగా వస్తాయి. ఇక సెల్ఫీల కోసం కూడా 50MP కెమెరానే ఇచ్చారు. బ్యాటరీ విషయానికి వస్తే.. దీనిలో 6500mAh పెద్ద బ్యాటరీని అమర్చారు. దీనికి తోడు 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల ఫోన్ చాలా స్పీడ్‌గా ఛార్జ్ అయిపోతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా వాడేసుకోవచ్చు.

స్మార్ట్ ఏఐ ఫీచర్లు..

Advertisement

నేటి టెక్ యుగంలో ఏఐ ఫీచర్లు లేని ఫోన్ అంటూ లేదు. మోటరోలా కూడా దీనిలో గూగుల్ జెమిని, మైక్రోసాఫ్ట్ కోపైలట్ వంటి ఫీచర్లను అందించింది. ఇవి మన పనులను చాలా సులభం చేస్తాయి. ఆండ్రాయిడ్ 16తో వచ్చే ఈ ఫోన్‌కు మూడేళ్ల పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ కూడా వస్తాయి. దీంతో ఈ ఫోన్ ద్వారా కొత్త టెక్నాలజీని వాడుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక ఫొటోలు, వీడియోలు తీసుకునేటప్పుడు ఏఐ ఫీచర్లు తోడవ్వడంతో అవుట్‌పుట్ చాలా ప్రొఫెషనల్‌గా వస్తుంది.

ధర ఎంతంటే?

ఇకపోతే Motorola Edge 70 Pro ధర విషయానికి వస్తే.. 8GB వేరియంట్ రూ.38,999గా ఉండగా.. 12GB వేరియంట్ రూ.41,999కి అందుబాటులో ఉంది. పాంటోన్ లిల్లీ వైట్, టీ, టైటాన్ వంటి మూడు రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. ఏప్రిల్ 29 నుంచి ఫ్లిప్‌కార్ట్, మోటరోలా వెబ్‌సైట్లలో అమ్మకాలు మొదలవుతాయి. లాంచ్ ఆఫర్ కింద బ్యాంక్ డిస్కౌంట్‌తో రూ.2,000 వరకు అదనపు తగ్గింపు కూడా పొందొచ్చు.

Also Read: భారీగా తగ్గిన Redmi Note 13 5G ధర.. స్టాక్ అయిపోయే లోపే ఆఫర్‌ను పట్టేయండి బ్రో!

Related News

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

Big Stories

Advertisement
×