E-Paper
Advertisement

Jr NTR: అల్లు అర్జున్ వదులుకున్న కథతో ‘తారక్’ హిట్ కొడతాడా?.. నెల్సన్ తర్వాత గురి ఎన్టీఆరేనా?

Jr NTR: అల్లు అర్జున్ వదులుకున్న కథతో ‘తారక్’ హిట్ కొడతాడా?.. నెల్సన్ తర్వాత గురి ఎన్టీఆరేనా?
Advertisement

Jr NTR: టాలీవుడ్ మరియు కోలీవుడ్ సినీ వర్గాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన వార్త తెగ హల్ చల్ చేస్తోంది. ‘జైలర్’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్, తన తర్వాతి ప్రాజెక్టును మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ తో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అయితే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Read also-Nandamuri Networth: నందమూరి హరోల నెట్ వర్త్ ఎంతో తెలుసా.. టాప్‌లో ఉన్నది ఎవరంటే?

అల్లు అర్జున్ నుంచి ఎన్టీఆర్ కు..

Advertisement

Jr NTR: ఈ ప్రాజెక్టుకు సంబంధించి వినిపిస్తున్న మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నెల్సన్ ఈ కథను ముందుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు వినిపించారట. అయితే, కొన్ని కారణాల వల్ల, డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఇప్పుడు అదే పవర్ ఫుల్ సబ్జెక్టును నెల్సన్, ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్‌కు తగినట్లుగా మార్పులు చేసి ఓకే చేయించుకున్నట్లు టాక్. ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ స్థాయిలో ఉన్న క్రేజ్ దృష్ట్యా, ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించే అవకాశం ఉంది.

ముందు ‘జైలర్ 2’, తర్వాతే ఎన్టీఆర్!

ప్రస్తుతం నెల్సన్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో ‘జైలర్ 2’ (Hukum) షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ ప్రాజెక్ట్ పై దృష్టి సారించనున్నారు. మరోవైపు తారక్ కూడా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ భారీ యాక్షన్ డ్రామా శరవేగంగా తెరకెక్కుతుంది. ఈ లైనప్ పూర్తయిన తర్వాతే నెల్సన్ – ఎన్టీఆర్ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

Advertisement

Read also-Jabardast Komaram : మూడేళ్లు నరకం చూశాను.. మూటలు మోసాను..భార్య పై షాకింగ్ కామెంట్స్..

నెల్సన్ మార్క్ యాక్షన్

నెల్సన్ సినిమాల్లో ఉండే డార్క్ హ్యూమర్, నెత్తురు మరిగే యాక్షన్ సీక్వెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ లాంటి నటుడు నెల్సన్ శైలిలో కనిపిస్తే అది వెండితెరపై పూనకాలే అని చెప్పాలి. ముఖ్యంగా ఎన్టీఆర్ లోని మాస్ యాంగిల్ ను నెల్సన్ సరికొత్తగా ఆవిష్కరించబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. త్వరలోనే ఈ మెగా ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇది నిజమైతే, సౌత్ ఇండియా సినిమా ఇండస్ట్రీలో మరో భారీ సెన్సేషన్ గ్యారెంటీ కావొచ్చు.

Related News

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్!

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

Big Stories

Advertisement
×