E-Paper
Advertisement

Union Budget-2026 live Updates: కేంద్రమంతి నిర్మల బడ్జెట్-2026 ప్రసంగం, కొత్త ఐటీ చట్టం.. పన్ను ఎగవేస్తే కష్టాలు, డేటా సెంటర్లు ఏర్పాటు చేసేవారికి శుభవార్త

Union Budget-2026 live Updates: కేంద్రమంతి నిర్మల బడ్జెట్-2026 ప్రసంగం, కొత్త ఐటీ చట్టం.. పన్ను ఎగవేస్తే కష్టాలు, డేటా సెంటర్లు ఏర్పాటు చేసేవారికి శుభవార్త

Union Budget-2026 live Updates: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు లైవ్ అప్‌డేట్స్ చూద్దాం.

చిన్న మదుపరుల కోసం కేంద్రం కీలక నిర్ణయం

కార్పొరేట్ బైబ్యాక్ కొనుగోళ్లపై 22 శాతం పన్ను పడనుంది

నాన్ కార్పొరేట్ బై బ్యాక్ కొనుగోళ్లపై 30 శాతం పన్ను

2047 వరకు డేటా సెంటర్లకు ట్యాక్స్ హాలిడే

ట్యాక్స్ హాలుడే నిర్ణయంతో క్లౌడ్ సేవల సంస్థలకు భారీ ప్రయోజనాలు

ముంబైలో ఇండియన్ ఇన్ స్టిట్యూల్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ ఏర్పాటు

దేశవ్యాప్తంగా 15 వేల సెకండరీ పాఠశాలల్లో కంటెంట్ క్రియేటర్స్ ల్యాబ్స్

గతేడాదితో పోల్చితే 0.1 శాతం తగ్గిన ద్రవ్యలోటు

2026-27లో ద్రవ్యలోటు 4.3 శాతనికి తగ్గించాలన్నది ప్రభుత్వ లక్ష్యం

ఇకపై పన్ను ఎగవేతదారులకు 30 శాతం పెనాల్టీ

చిన్న పన్ను చెల్లింపుదారుల కోసం ప్రత్యేక పథకం

మానవ వనరుల సరఫరా ఏజెన్సీలపై ఒకటి లేదా రెండు శాతం టీడీఎస్

పన్ను పరిధిలోకి మానవ వనరుల సరఫరా ఏజెన్సీలు

రహదారి ప్రమాదాల పరిహారం వడ్డీపై పన్ను తొలగింపు

మ్యాన్ పవర్ సరఫరా చేసే సంస్థలపై టీడీఎస్ తగ్గింపు

విదేశీ టూర్ ప్యాకేజీలపై టీసీఎస్ తగ్గింపు

చదువు, వైద్యంపై టీసీఎస్ 5 నుంచి 2 శాతానికి తగ్గింపు

కొత్త కొబ్బరి తోటలు, వాటి స్థానంలో కొత్త మొక్కలు వేసుకునేందుకు ప్రొత్సాహం

చేపల పెంపకం కోసం దేశవ్యాప్తంగా 500 కొత్త రిజర్వాయర్ల ఏర్పాటు కృషి

హిమాలయాస్ చంద్ర టెలిస్కోప, కాస్మోస్-2 ప్లానిటోరియం ఏర్పాటు

కొబ్బరి, జీడి పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమం

ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం రానుంది

సామాన్యుల సైతం ఫైల్ చేసేలా మార్పులు

సవరించిన పన్ను రిటర్నుల దాఖల గడువు పెంపు, డిసెంబర్ 31 నుంచి మార్చి 31 వరకు

తూర్పున డంకుణీ నుంచి పశ్చిమ సూరత్ వరకు ప్రత్యేక సరుకు రవాణా మార్గం

హిమాచల్, ఉత్తరాఖండ్, కాశ్మీర్ లో ట్రెక్కింగ్, హైకింగ్ అభివృద్ధి

అరకులోనూ ట్రెక్కింగ్, హైకింగ్ కు ప్రొత్సాహం

వైద్య అనుబంధ నైపుణ్యాల అభివృద్ధికి ప్రత్యేక పథకం.. లక్ష ఏహెచ్ పీల ఏర్పాటు

పులికాట్ సరస్సులో పక్షులను వీక్షించేందుకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు

నేషనల్ డిజిటల్ విజ్ఫాన కేంద్రం ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

15 పురావస్తు ప్రాంతాలను అభివృద్ధి చేయడం

ఖేలో ఇండియా మిషన్ లో క్రీడాభివృద్ధి

యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్ రంగాలకు చేయూత ఇవ్వడం

తూర్పు భారత్ లో నేషన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్

20 వేల పర్యాటక ప్రాంతాల్లో 10 వేల గైడ్లు నియామకం

సూక్ష్మ తరహా పరిశ్రమలకు రూ. 2వేల కోట్లు

స్వయం సమృద్ధి భారతం పేరుతో రూ. 2 వేల కోట్ల ఫండ్

ప్రభుత్వ కొనుగోళ్ల ద్వారా ఎంఎస్ఎంఈలకు ఊతం

వికసిత్ భారత్ కోసం బ్యాంకింగ్ రంగంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు

మెడికల్ వ్యాల్యూ టూరిజం కోసం ప్రత్యేక హబ్స్

ఐఐఎం ద్వారా టూరిస్టు గైడ్‌లకు ట్రైనింగ్

దేశంలో మూడు ఆయుర్వేద ఆసుపత్రులు ఏర్పాటు

ఆయుష్ కేంద్రాల అప్ గ్రేడేషన్

వైద్య పరిశోధనకు జామ్ నగర్ లో పరిశోధన కేంద్రం

ప్రవేటు రంగంలో పశువైద్య, డయాగ్నస్టిక్స్ ఏర్పాటు

యువత కోసం వైద్యరంగంలో కొత్తగా కోర్సుల ఏర్పాటు

ఎన్నారైలకు శుభవార్త

భారత్ స్టాక్ మార్కెట్ లో పెట్టేుబడుల పరిమితి పెంపుకు ఛాన్స్

మూలధన వ్యయం రూ.12. 2 లక్షల కోట్లకు పెంపు

రూ. 10 వేల కోట్లతో ఎంఎస్ఎంఈల అభివృద్ధికి ప్రత్యేక గ్రోత్ ఫండ్

రూ. 10 వేల కోట్ల కంటైనర్ తయారీ రంగం కోసం ప్రత్యేక పథకం

కొత్తగా డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ఏర్పాటు

బెంగాల్ నుంచి గుజరాత్ వరకు కారిడార్ ఏర్పాటు

ఇన్ ఫ్రాక్ట్రక్చర్ రిక్స్ ఫండ్ ఏర్పాటు

సీపీఎస్ఈల కోసం ప్రత్యేకమైన హక్కులు

హైటెక్ టూల్ రూమ్స్ ఏర్పాటు, జౌళిరంగం ఆధునీకరణ, పరిశ్రమలు విద్యా సంస్థల అనుసంధానం

ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల అభివృద్ధికి ప్రాధాన్యం

సీ-ప్లేన్ల నిర్వహణకు ప్రభుత్వం నుంచి తోడ్పాటు

వచ్చే ఐదేళ్లలో కొత్తగా 20 జల మార్గాల అభివృద్ధి

వారణాసి-పట్నాలో షిప్ రిపేరింగ్ సెంటర్ల ఏర్పాటు

ముంబై – పూణె, హైదరాబాద్ – చెన్నై, ఢిల్లీ-వారణాసి, వారణాసి – సిలిగురి

పూణె-హైదరాబాద్, హైదరాబాద్- బెంగుళూరు

ఏడు  హైస్పీడ్ రైల్ కారిడార్లు ఏర్పాటు

జౌళి ఉత్తత్తుల అంతర్జాతీయ బ్రాండింగ్ కోసం ప్రత్యేక కార్యాచరణ

మెగా టెక్స్ టైల్ పార్కులు ఏర్పాటు

ప్రపంచస్థాయి కంటెయిర ఉత్పత్తి కార్పొరేషన్ ఏర్పాటు

ఖనిజ వనరులున్న రాష్ట్రాలకు ప్రత్యేక ప్రొత్సాహం అందేలా చర్యలు

ఒడిషా, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేక మైనింగ్ మిషన్

నాలుగు రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ మినరల్స్ కోసం ప్రత్యేక కార్యక్రమం

దేశంలో కొత్త మూడు కెమికల్స్ రీసెర్చ్ పార్కులు

దేశంలో రెండు హైటెక్ టెక్నాలజీ రూమ్స్ ఏర్పాటు

కేరళ, తమిళనాడు, ఏపీలో రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్స్

సెమీ కండక్టర్ ఇండియా మిషన్ 2.0 కోసం రూ. 40 వేల కోట్లు

ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కు భారీగా కేటాయింపులు

ఆరోగ్యరంగం కోసం బయో ఫార్మాశక్తి

సంక్రమణేత వ్యాధులపై ప్రత్యేక దృష్టి

ఫార్మా విద్య, పరిశోధకు జాతీయ స్థాయిలో కొత్త విద్య సంస్థలు

రూ. 10 వేల కోట్లతో వచ్చే ఐదేళ్లకు బయో ఫార్మా శక్తి పథకం

ఆర్థిక సుస్థిరత కోసం ఆరు కీలక రంగాల్లో సంస్కరణలు

ఛాంపియన్ ఎంఎస్ఎంఈల కోసం ప్రత్యేక కార్యాచరణ

ప్రస్తుతమున్న NIPERకు ఆధునీకరణ

దేశంలో కొత్తగా 3 NIPER

2025 ఆగస్టు తర్వాత 350 సంస్కరణలు తీసుకువచ్చాం

ఆర్థిక ప్రణాళికలపై అంతర్జాతీయ పరిణామాల ప్రభావం ఉంటుంది

సబ్ కా సాత్, సబ్ కా వికాస్ ఆధారిత బడ్జెట్

ప్రజల ఆకాంక్షలను ఆచరణలోకి తీసుకొస్తున్నాం, రైతులు, దళిత గిరిజన సమూహాలకు అభివృద్ధి ఫలాలు

యువశక్తి కేంద్రంగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం

కర్తవ్య భవన్ లో రూపొందించిన తొలి బడ్జెట్ ఇది

పవిత్ర మాఘపౌర్ణమి రోజు బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం, ప్రపంచ మార్కెట్లో భారత్ ను అనుసంధానం చేస్తున్నాం

భారత్ ఆర్థిక ప్రయాణం స్థిరంగా సాగుతోంది. అనిశ్చిత పరిస్థితుల్లోనూ ముందుకు వెళ్తున్నాము

బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

లోక్‌సభకు చేరుకున్న కేంద్ర ఆర్థికమంత్రి సీతారామన్

ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన క్యాబినెట్‌లో భేటీ, బడ్జెట్‌కు ఆమోదముద్ర

బడ్జెట్ వేళ మరింత దిగువకు బంగారం-వెండి ధరలు, మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్‌‌లో 9 శాతం పతనం

పార్లమెంటులో కేంద్ర కేబినెట్ భేటీ, బడ్జెట్ చర్చ

తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్

పలు రంగాలకు ఆమె ప్రాధాన్యత ఇచ్చారు. నిర్మల బడ్జెట్ పై యావత్తు దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. బడ్జెట్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ ఇవాళ తెరచి ఉంటుంది. ఆదివారం రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన ఆర్థికమంత్రి సీతారామన్, బడ్జెట్ నుంచి కీలక వివరాలను ముర్ముతో పంచుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్‌కు వచ్చిన నిర్మలాకు ముర్ము ‘దహీ-చీనీ’ (పెరుగు, చక్కెర) తినిపించారు. అక్కడ నుంచి నేరుగా పార్లమెంటుకు ఆమె బయలుదేశారు.

బడ్జెట్ నేపథ్యంలో పార్లమెంట్ వద్దకు చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ, నిర్మలా సీతారామన్, హోంమంత్రి అమిత్ షా, పలువురు మంత్రులు.  ఏటా బడ్జెట్‌ వేళ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. బడ్జెట్‌ సమయంలో కేటాయింపులకే కాదు, నిర్మలా సీతారామన్‌ ధరించే చీరలపైనా అందరి దృష్టి ఉంటుంది. ఈసారి ఆమె తమిళనాడు కాంజీవరం హ్యాండ్లూమ్‌ చీరలో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.

 

 

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×