E-Paper
Advertisement

Jr NTR Neel Movie: ‘వార్ 2’ ఎఫెక్ట్ వల్ల ఎన్టీఆర్ నీల్ మూవీలో భారీ మార్పులు.. ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?

Jr NTR Neel Movie: ‘వార్ 2’ ఎఫెక్ట్ వల్ల ఎన్టీఆర్ నీల్ మూవీలో భారీ మార్పులు.. ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?
Advertisement

Jr NTR Neel Movie: ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇందులో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న క్రేజీ కాంబినేషన్ ప్రశాంత్ నీల్ సినిమా. అయితే, ఈ సినిమా షూటింగ్, స్క్రిప్ట్ విషయంలో మేకర్స్ కొన్ని కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. వార్ 2 తర్వాత ఎన్టీఆర్ ప్రతి విషయంలోనూ చాలా కేర్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఈ ప్రశాంత్ నీల్ సినిమా కూడా చాలా కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటికీ, మధ్యలో ఎన్టీఆర్ తన బాలీవుడ్ డెబ్యూ మూవీ ‘వార్ 2’ షూటింగ్‌లో పాల్గొన్నారు. ‘వార్ 2’ అప్‌డేట్స్ మరియు అవుట్‌కమ్ తర్వాత, ప్రశాంత్ నీల్ ఈ సినిమా స్క్రిప్ట్‌పై మరింత కసరత్తు చేసినట్లు సమాచారం. ఎన్టీఆర్ ఇమేజ్‌కు తగినట్లుగా, అంచనాలను అందుకునేలా కథలో కొన్ని కీలక మార్పులు చేసి, టీమ్ మరింత పక్కాగా సిద్ధమైంది.

Read also-Aadarsha Kutumbam Ak 47: వెంకీ-త్రివిక్రమ్ కాంబోపై పెరుగుతున్న హైప్..రిలీజ్ ఎప్పుడంటే..?

Advertisement

బిగ్ సర్ప్రైజ్ ఎప్పుడంటే?

నిజానికి ఈ సినిమా ఫస్ట్ లుక్ గతేడాది మే నెలలోనే వస్తుందని అందరూ భావించారు. కానీ అనివార్య కారణాల వల్ల అది సాధ్యపడలేదు. అయితే, ఈ ఏడాది మే 20న (ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా) ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈసారి మాత్రం అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సాలిడ్ కంటెంట్‌ను సిద్ధం చేస్తున్నారట. ఇక ఇటీవలి ఎన్టీఆర్ మేకోవర్ చూస్తుంటే ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తున్నాయి. చాలా షార్ప్‌గా, పవర్‌ఫుల్ బాడీ లాంగ్వేజ్‌తో కనిపిస్తున్న ఆయన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ కొత్త లుక్ నీల్ సినిమా కోసమే అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా ఎన్టీఆర్ నీల్ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందని అభిమానులు ఆసిస్తున్నారు.

Advertisement

Read also-February 14 Movies: లవర్స్ డే స్పెషల్.. ఈవారం రీ రిలీజ్ , కొత్త సినిమాల సందడి..

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×